Advertisementt

'ఎంతపని చేసావే శిరీషా..' టీజర్ విడుదల!

Wed 08th Jun 2016 08:31 PM
enthapani chesave sireesha,teaser launch,mahath,punarnavi bhupalam  'ఎంతపని చేసావే శిరీషా..' టీజర్ విడుదల!
'ఎంతపని చేసావే శిరీషా..' టీజర్ విడుదల!
Advertisement
Ads by CJ

మహత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాలం జంటగా ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ బ్యానర్ పై శివరామకృష్ణ రూపొందిస్తోన్న చిత్రం 'ఎంతపని చేసావే.. శిరీషా..'. పట్లోరి బాలకృష్ణ, రాంప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ను అనిల్ సుంకర బుధవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. బ్యానర్ లోగోను పి.రామ్మోహన్ విడుదల చేయగా.. టైటిల్ లోగోను చిత్రనిర్మాతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా..

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాత బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్. అలానే హీరో మహత్ నాకు మంచి స్నేహితుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా హిట్ కావాలి. టైటిల్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. సినిమా కూడా అలానే ఉంటుందని భావిస్తున్నాను'' అని చెప్పారు. 

నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. ''అనిల్ సుంకర గారు నాకు ఇన్స్పిరేషన్, ఆయన బాటలోనే ఈ సినిమాను నిర్మించాను. టీం ఎఫర్ట్ తో చేసిన సినిమా. చిన్న ఇన్సిడెంట్ మీద సినిమా మొత్తం నడుస్తుంది. ఈ సినిమాతో మహత్ కు హీరోగా మంచి బ్రేక్ వస్తుంది. మంచి లోకేషన్స్ లో సినిమాను చిత్రీకరించాం'' అని చెప్పారు.

రామ్మోహన్ మాట్లాడుతూ.. ''చిత్ర నిర్మాతలు ఎంతో ప్యాషన్ తో సినిమా చేశారు. దశాబ్దాల పాటు ఈ సంస్థ మీద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సుదర్శన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో కనిపిస్తాను. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. ఫారెన్ లోకేషన్స్ లో కూడా షూట్ చేశారు. పాటల్లో కూడా ఫన్ ఉండేలా చేశారు'' అని చెప్పారు.

పునర్నవి భూపాలం మాట్లాడుతూ.. ''డైరెక్టర్ కథ చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాను. స్టొరీ అంత బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: పూర్ణచందర్ భైరి, ఫోటోగ్రఫీ: శ్యాం ప్రసాద్, ఎడిటర్: సత్య గిడుతూరి, ఆర్ట్: రామ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: దిలీప్ కుమార్ బోలుగోటి, నిర్మాతలు:  పట్లోరి బాలకృష్ణ, రాంప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల, దర్శకుడు: శివ రామకృష్ణ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ