Advertisementt

అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠిల శ్రీరస్తు శుభ‌మ‌స్తు.

Wed 08th Jun 2016 05:08 PM
srirastu subhamastu movie,srirastu subhamastu movie stills,srirastu subhamastu movie news,srirastu subhamastu movie hero allu siresh,srirastu subhamastu,lavanya tripathi,lavanya tripathi movie srirastu subhamastu  అల్లు శిరీష్,  లావ‌ణ్య త్రిపాఠిల శ్రీరస్తు శుభ‌మ‌స్తు.
అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠిల శ్రీరస్తు శుభ‌మ‌స్తు.
Advertisement
Ads by CJ
 అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్ ని క్యాచ్ చేసి త‌న క‌థలుగా మ‌లుచుకుని తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్న‌ ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ ద‌ర్శ‌కుడిగా,  ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్  నిర్మాత‌గా,  ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం  శ్రీరస్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రానికి సంబందించి చివ‌రి షెడ్యూల్ ని కాశ్మీర్ లాంటి మెస్ట్ బ్యూటిఫుల్ విజువ‌ల్స్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో చిత్ర షూటింగ్ పూర్త‌వుతుంది. అతిత్వ‌ర‌లోనే థ‌మ‌న్.S.S  సంగీతం అందించిన ఆడియో విడుద‌ల చేసి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు.. 
>హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నాకు మెద‌టి నుండి కూడా మంచి చిత్రాలు చేయ్యాలి అనే వుండేది. ఆ ద‌శ‌లోనే మంచి చిత్రాలు చేసాను కూడా, మంచి చిత్రాలు తీస్తున్నావు అని అంటుంటే మ‌న‌సులో చాలా ఆనందంగా వుంటుంది. క‌మ‌ర్షియ‌ల్‌ ఫార్ములాని మిక్స్ చేసి ఓ మంచి ఫ్యామిలి క‌థ‌ని ద‌ర్శ‌కుడు బుజ్జి నాకు చెప్పారు. సినిమా వినొద‌మే కాదు  సినిమా ఆలోచించేవిధంగా వుండాలి అని న‌మ్ముతాను. అలాంటి క‌థ మా శ్రీర‌స్తు శుభ‌మస్తు. ఈ చిత్రం లో ప్ర‌తి ఓక్క కేర‌క్ట‌ర్ మ‌రో కేర‌క్ట‌ర్ కి రిలేటెడ్ గా వుంటుంది. చిన్న కేర‌క్ట‌ర్ కి కూడా వ్యాల్యూ వుంటుంది. ఓక సీనియ‌ర్ న‌టుల‌తో న‌టిస్తే మ‌న‌లోని కాన్ఫిడేన్స్ లెవెల్ బెట‌ర్ అవుతుంది, అదే ఈ చిత్రంలో రావు ర‌మేష్ గారికి నాకు మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశంలో కానివ్వండి, ఇంకా ఇత‌ర పాత్ర‌ల‌తో న‌టించిన‌ప్పుడు కానివ్వండి. స్క్రీన్ మీద‌ తెలుస్తుంది.  లావ‌ణ్య తొ సీన్స్ చాలా నేచుర‌ల్ గా వుంటాయి. కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు.  ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి,  రవి ప్రకాష్, రణధీర్,  హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఈ చిత్రం చేస్తున్నాము. అంద‌రూ చ‌క్క‌టి ఫ్యామిలి మెంబ‌ర్స్ లా ఇమిడారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాము. దీంతో షూట్ కంప్లీట్ అవుతుంది. అని అన్నారు
>నిర్మాత అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ ..  మా చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చివ‌రి షెడ్యూల్ కాశ్మీర్ లో జ‌రుగుతుంది. చక్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా స‌మ్మ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు చిత్రం త‌రువాత మా బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్ర‌మిది.. ద‌ర్శ‌కుడు బుజ్జి చాలా మంచి చిత్రాన్ని తీసాడు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ వున్న ఈ చిత్రంలో న‌టీన‌టులంద‌రూ చాలా బాగా న‌టించారు. థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అవుతుంది. అతి త్వ‌ర‌లో ఆడియో ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తాము. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము అని అన్నారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ