భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ నిర్మించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్, అమెరికా లాస్ ఏంజిల్స్ లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవములో ఆదిత్య బాలల చిత్రము ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ చిత్రంగా అవార్డును కైవసం చేసుకొంది. ఈ సందర్భంగా..
భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. ''నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఎన్నో చిత్రాలు పోటీపడగా.. చివరగా ముప్పై చిత్రాలను ఎంపిక చేశారు. అందులో ఆదిత్య సినిమా మొదటి స్థానాన్ని సొంతం చేసుకొంది. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 14 నుండి 20 వరకు సుమారుగా 100 థియేటర్లలో ప్రదర్శింపబడింది. ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లి తండ్రుల ప్రశంసలు పొందింది. తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం వినోదపు పన్ను రాయితీ పొందిన ఉత్తమ చిత్రం మరియు తెలంగాణా ప్రభుత్వం హోం డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేకమైన నూన్ షో కి అనుమతి లభించినది. జూలై నుండి ఈ నూన్ షోలను ప్రదర్శింపజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల లో చదువుకునే అనాధబాలుడు అబ్దుల్ కలాం జూనియర్ సైంటిస్టు అవార్డును ఎలా దక్కించుకున్నాడనేదే కథ. మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను'' అని చెప్పారు.
ప్రేమ్ బాబు మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించాను. మంచి సందేశాత్మక చిత్రం. అవార్డ్స్ కూడా వచ్చాయి. నాకు ఈ అవకాసం ఇచ్చిన సుధాకర్ గారికి థాంక్స్'' అని చెప్పారు.