Advertisementt

ఆ రాత్రి ఆ నాలుగు గంటల్లో..?

Sun 12th Jun 2016 03:22 PM
happy birthday movie,chennamaneni sridhar,jyothi seth,8 to 12  ఆ రాత్రి ఆ నాలుగు గంటల్లో..?
ఆ రాత్రి ఆ నాలుగు గంటల్లో..?
Advertisement
Ads by CJ

చెన్నమనేని శ్రీధర్‌, జ్యోతీసేథీ, సంజన, శ్రవణ్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. శ్రీనందన్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ కల్లే నిర్మిస్తున్నారు. పల్లెల వీరారెడ్డి(చే గువేరా) దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

దర్శకుడు మాట్లాడుతూ ''కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ ఇది. ఒకే ఇంట్లో ఓ జంటకు ఎదురైన సంఘటనల సమాహారమే 'హ్యపీ బర్త్‌డే' సినిమా. రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య సమయంలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 15 నిమిషాల గ్రాఫిక్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి'' అని అన్నారు. 

నిర్మాత మహేష్‌ కల్లే మాట్లాడుతూ ''హారర్‌ జోనర్‌లో సరికొత్త కథ వినిపించారు దర్శకుడు. అందుకే వెంటనే అంగీకరించాను. కథ, కథనం ఆసక్తికరంగా ఉంటాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. మేజర్‌ పార్ట్‌ అంతా హైదరాబాద్‌, వైజాగ్‌ ప్రాంతాల్లో తెరకెక్కించాం. కొన్ని కీలక సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకమ్రాలు శరవేగంగా జరుగుతున్నాయి. విఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. 

సాంకేతిక నిపుణులు: 

సినిమాటోగ్రఫీ: వాసిరెడ్డి సత్యానంద్‌, సంగీతం: జి.సంతోష్‌ రెడ్డి, ఆర్ట్‌: మురళీకృష్ణ కొండేటి, ఎడిటర్‌: మహేంద్రనాథ్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: చంద్రారెడ్డి, సౌండ్‌ ఎఫెక్ట్స్‌: పురుషోత్తంరాజు, పబ్లిసిటీ డిజైనర్‌: టి.ఎస్‌.ఎస్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కోటేశ్వరరావు, కో డైరెక్టర్‌: గండికోట రవికుమార్‌,, . విఎఫ్‌ఎక్స్‌: రెడ్‌పిల్‌ స్టూడియోస్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌: జీనస్‌ స్టూడియో.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ