Advertisementt

రాజ‌మౌళి లాంచ్ చేసిన 'షో టైమ్' టీజ‌ర్!

Mon 20th Jun 2016 07:56 AM
show time movie,rajamouli,kanchi,ranadheer,keeravani  రాజ‌మౌళి లాంచ్ చేసిన 'షో టైమ్' టీజ‌ర్!
రాజ‌మౌళి లాంచ్ చేసిన 'షో టైమ్' టీజ‌ర్!
Advertisement
Ads by CJ

అమృతం సీరియ‌ల్ తో ద‌ర్శ‌కుడుగా, ర‌చ‌యిత‌గా తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితులైన ఎస్.ఎస్.కాంచి ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో ప‌లు చిత్రాలు నిర్మించిన జాన్ సుధీర్ పూదోట ర‌మా రీల్స్ ప‌తాకం పై నిర్మిస్తున్న చిత్రం 'షో టైమ్'. ర‌ణ‌ధీర్, రుక్సార్ మీర్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తో పాటు టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి టీజ‌ర్ ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా..

రాజమౌళి మాట్లాడుతూ... ''మా కుటుంబంలో ప‌ద‌మూడు మంది క‌జిన్స్ ఉన్నాం. అందులో మా పెద్ద‌న్నను కింగ్ లా భావించే వాళ్లం, మా కాంచీ అన్న‌ని స‌ర్వ‌జ్ఞుడు అని పిలుచుకునే వాళ్లం. ఎందుకంటే ఆయ‌న‌కు తెలియ‌ని విష‌యం అంటూ లేదు. ఆయ‌నెప్పుడో ద‌ర్శ‌కుడు కావాల్సింది. కొంచెం లేటైనా ఒక థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో ద‌ర్శ‌కుడుగా మారడం చాలా సంతోషంగా ఉంది.  షో టైమ్ అనే మాట మాలో క‌ద‌లాడేది. నేను టీనేజ్ లో ఉన్న‌ప్పుడు హీరో అవ్వాల‌ని క‌ల‌లు క‌నేవాడిని. కానీ సిగ్గుతో ఎవ‌రితో చెప్పే వాడిని కాదు. ఈ క్ర‌మంలో ఓ రోజు అస‌లు నువ్వు ఏమ‌వ్వాల‌నుకుంటున్నావురా? అని కాంచి అన్న‌ అడిగాడు. భ‌య‌ప‌డుతూనే హీరో అవ్వాల‌నుకుంటున్నా అన్నాను. స‌రే బాగానే ఉంది కానీ...ఈ పల్లెటూరిలో ఉంటే హీరో ఎలా? అవుతావ‌ని నన్ను మ‌ద్రాసు తీసుకెళ్లాడు. ఇలా నాకు ప్ర‌తి విష‌యంలో ఓ గైడ్ లా ఉండేవారు. ఇక ఈ సినిమా విష‌యానికొస్తే... టైటిల్, పోస్ట‌ర్, టీజ‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా? అన్న‌ట్టుగా ఉన్నాయి. ఈ సినిమా కాంచి అన్న‌కు మంచి పేరు తీసుకురావాలి. నిర్మాత‌లు చాలా ప్లాన్డ్ గా వ‌స్తున్నారు. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు,

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ... ''కీర‌వాణి నేను ఎన్నో హిట్ చిత్రాలు చేశాం. కీర‌వాణి మ్యూజిక్ లో కింగ్ గా ఉన్నారు. రాజమౌళి నేను చేసిన యాడ్ ఫిలింస్, సీరియ‌ల్ కి వ‌ర్క్ చేశాడు. త‌ను దేశం అంతా గ‌ర్వించ‌ద‌గ్గ స్థాయిలో ఉన్నాడు. వీరిలానే కాంచీ కూడా గొప్ప ద‌ర్శ‌కుడుగా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోర‌కుంటున్నాను'' అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి మాట్లాడుతూ... ''కాంచి ఎప్పుడో ద‌ర్శ‌కుడవ్వాలి. ఇప్పటికి అవ‌కాశం వ‌చ్చింది. త‌న టాలెంట్ కిది షో టైమ్ అని భావిస్తున్నాను. దాదాపు మ‌నంద‌రిలో కలిగే ఫీలింగ్సే ఈ చిత్ర క‌థాంశం'' అని చెప్పారు.

సుమంత్ మాట్లాడుతూ... ''కాంచీ గారు నాకు చాలా కాలంగా తెలుసు. అలాగే నిర్మాత గారితో కూడా. టైటిల్, టీజ‌ర్ ఇన్నోవేటివ్ గా ఉంది'' అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.కాంచి మాట్లాడుతూ... ''ద‌ర్శ‌కుడు కావాల‌న్న‌ది నా డ్రీమ్. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత సుధీర్ గారికి రుణ‌ప‌డి ఉంటాను. కొంత లేట‌యినా...మంచి సినిమా తీసాననుకుంటున్నాను'' అని తెలిపారు. 

క‌ళ్యాన్ కోడూరి మాట్లాడుతూ... ''ద‌ర్శ‌కుడు కావాల‌న్న‌ది కాంచి అన్న‌క‌ల‌. ఈ సినిమా తో నెర‌వేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా టీజ‌ర్ చూస్తే సినిమా బాగా తీసుంటాడ‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా స‌క్సెస్ సాధించి కాంచి అన్న‌కు, నిర్మాత‌కు మంచి పేరు రావాలి'' అని అన్నారు.

నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ... ''ఎస్.ఎస్ కాంచి గారు అద్భుత‌మైన స్క్రిప్టుతో  షో  టైమ్ మూవీ చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయాల‌న్న ల‌క్ష్యంతో లియోయు, సార‌థ్యంలో లోహాస్ గ్లోబ‌ల్ ఎంట‌ర్ టైన్ మెంట్,వ‌ర‌ల్డ్ మొబైల్ హోల్డింగ్స్ , మ‌రియు తైవాన్ లోని మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీ అయిన వీ.ఆర్.టెక్నాల‌జీ వారితో భాగ‌స్వామ్యం కుదుర్చ‌కున్నాం. అందులో భాగంగా తొలి ప్ర‌య‌త్నంగా తెలుగులో 'షో టైమ్' అనే క్రైం, థ్రిల్ల‌ర్ చిత్రాన్ని రూపొందించాము. చైనా, కొరియా ఇలా ప‌లు దేశాల్లో తెలుగు సినిమాలు విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే చైనా లో కూడా ఓ సినిమా చేయ‌నున్నాం. దీనికి రాజ‌మౌళి ఫ్యామిలీ ఎంతో స‌పోర్ట్ గా నిలుస్తున్నారు'' అని అన్నారు.

ర‌ణ‌ధీర్, రుక్సారా మీర్, కార్తీక్, సంజీత్, ఆదిత్య‌, స‌త్యం, అమిత్ శ‌ర్మ‌, ర‌వి ప్ర‌కాష్, న‌క్ష‌త్ర‌, పూజిత‌, అరుణ్‌, అవినాష్‌, స్పూర్తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీః భూప‌తి, ఎడిటింగ్ః ఎన్ హెచ్ హ‌రి, కో ప్రొడ్యూస‌ర్ః కిర‌ణ్ త‌న‌మ‌ల‌, నిర్మాతః జాన్ సుధీర్ పూదోట‌, డైర‌క్ష‌న్ః కాంచి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ