దిల్ రాజు సమర్పకుడిగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం 'రోజులు మారాయి'. మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.బి. సంగీతం అందించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
సంగీత దర్శకుడు జె.బి మాట్లాడుతూ.. '' ఇటీవల విడుదలయిన ఈ చిత్ర పాటలకు శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట దిల్ రాజు గారి సినిమాలో మ్యూజిక్ చేయడానికి భయపడ్డాను. కాని ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్‌రాజు, మారుతిగారికి థాంక్స్. ఈ చిత్రంలో కాసర్ల శ్యామ్ నాలుగు పాటలు, కిట్టు ఒక పాటను రాశారు. సింగర్స్ కూడా మంచి సపోర్ట్ అందించారు'' అని చెప్పారు.
కాసర్లశ్యామ్ మాట్లాడుతూ.. ''ఈరోజుల్లో సినిమా నుండి నేను జెబి గారి సినిమాలకు రాస్తున్నాను. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. జెబిగారు గారు మ్యూజిక్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఆడియోలానే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రమ్యబెహర, అనుదీప్, రోహిత్, లిప్సిక, నయన తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే- మారుతి, సమర్పణ- దిల్ రాజు, సంగీతం- జె.బి, మాటలు- రవి నంబూరి, దర్శకత్వం- మురళి కృష్ణ ముడిదాని.