Advertisementt

సెన్సార్ బోర్డు లో దాసరి శిష్యుడు!

Mon 27th Jun 2016 01:52 PM
journalist prabhu,censor board,member,dasari,cine journalist  సెన్సార్ బోర్డు లో దాసరి శిష్యుడు!
సెన్సార్ బోర్డు లో దాసరి శిష్యుడు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సెన్సార్ బోర్డ్ పై ఆదిపత్యం కోసం చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. కానీ ఆ పదవులు కొందరికే సొంతమవుతాయి. అందుకోసం చేయరాని ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉంటారు. రాజకీయ ప్రముఖుల అండదండలతో ఆ పదవులను సొంతం చేసుకుంటారు. ఈ మధ్య సెన్సార్ బోర్డ్ లో కూడా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. సెన్సార్ బోర్డ్ కు ఒక పారదర్శకత లేకుండా పోయింది. అనేక వివాదాల లో సెన్సారుబోర్డు కూరుకు పోయింది. ఇదిలా ఉంటే 25 సంవత్సరాలు అనుభవం కలిగి ప్రముఖ సినీ జర్నలిస్ట్ గా ఉంటూ సినీ ప్రముఖుల అందరితో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న ప్రభుని సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమించింది. ప్రభు అనేక పత్రికలకు సంపాదకుడిగా పని చేసాడు. అలాగే ఆయన ప్రముఖ సినీ విమర్శకులు గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో కాలం గా దాసరి శిష్యుడిగా ఉన్న ప్రభుని సెన్సార్ సభ్యునిగా నియమించడం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆయన సెన్సార్ బోర్డు సభ్యునిగా ఎన్నికవడం ఇది రెండోసారి. గతంలో కూడా ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ