Advertisementt

జగపతిబాబు కి ఇదే ఫస్ట్ టైమ్..!

Sun 03rd Jul 2016 04:53 PM
jagapathi babu,the bfg,steven spielberg,hollywood movie,jagapathibabu dubbing  జగపతిబాబు కి ఇదే ఫస్ట్ టైమ్..!
జగపతిబాబు కి ఇదే ఫస్ట్ టైమ్..!
Advertisement
Ads by CJ

డిస్నీ వారి 'ది  బి ఎఫ్ జి' చిత్రంకు జగపతిబాబు  డబ్బింగ్

జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం 'దిబిఎఫ్ జి' (ది బిగ్ ఫ్రెండ్లీ  జయంట్).  డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 15 న దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు  విడుదల చేయనున్నారు. ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం. ఇప్పటికే హీరో నుండి విలన్‌గా మారి, విలన్ తో పాటు మంచి మంచి పాత్రల్లో నటిస్తున్న జగపతిబాబు ఇలా ఓ హాలీవుడ్ మూవీకి  డబ్బింగ్ చెప్పడం ద్వారా మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు.  24 అడుగులు ఎత్తుండే భారీ మనిషితో  స్నేహంగా ఉండే 10ఏళ్ళ చిన్నారి మధ్య జరిగే ఒక అద్భుతమైన కథను స్టీవెన్ స్పీల్ బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ