Advertisementt

'పెళ్లి చూపులు' ని గర్వంగా చెప్పుకుంటాడంట!

Fri 08th Jul 2016 09:13 PM
pelli choopulu,pelli chupulu,pelli choopulu movie audio launch,vijay devarakonda,ritu varma,raj kandukuri,yash,tarun bhaskar,pelli choopulu movie audio launch details  'పెళ్లి చూపులు' ని గర్వంగా చెప్పుకుంటాడంట!
'పెళ్లి చూపులు' ని గర్వంగా చెప్పుకుంటాడంట!
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూతన గీత బ్యానర్స్ పై నిర్మాత రాజ్ కందుకూరి, య‌ష్ రాగినేనితో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'పెళ్ళి చూపులు'.  వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో థియేట్రికల్ ట్రైలర్ ను సందీప్ కిషన్, తమ్మారెడ్డి భరద్వాజ, క్రాంతిమాధవ్ లు విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేయగా, తొలి ఆడియో సీడీని తమ్మారెడ్డి భరద్వాజ అందుకున్నారు. ఈ సందర్భంగా....

డి.సురేష్ బాబు మాట్లాడుతూ...టైటిల్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌. చాలా మంచి సినిమా చేశారు. నాగేష్ సినిమాటోగ్ర‌పీ, వివేక్ మ్యూజిక్ చాలా బావుంది. విజ‌య్‌, రీతూ స‌హా అంద‌రూ చాలా బాగా వ‌ర్క్ చేశారు. డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ మా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌.. అన్నారు.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ...ట్రైల‌ర్ బావుంది. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ బావున్నాయి. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం కంటే కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో బెట‌ర్ గా చేసుంటాడ‌ని అనుకుంటున్నాను. నిర్మాతలకు, దర్శకునికి, టీం అందరికి అభినంద‌న‌లు... అన్నారు.

అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ..ఆనంద్‌, ఉయ్యాలా జంపాలా త‌ర్వాత అదే జోన‌ర్‌లో క‌న‌ప‌డుతున్న చిత్ర‌మిది. రాజ్ కందుకూరిగారు ఈ సినిమాతో ఇంకా పెద్ద నిర్మాత అవుతారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా..అని అన్నారు.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ....ట్రైల‌ర్ చాలా బాగుంది. నాకు చూడగానే ఎంతగానో నచ్చింది. ఈ ట్రైల‌ర్‌ను మా గ్రూప్‌లోని ఫ్రెండ్స్‌కు పంపాను. భాస్క‌ర్ గ‌తంలో చేసిన షార్ట్ పిలిం గురించి తెలిసింది. త‌నకు ఆల్ ది బెస్ట్‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న బాగా న‌చ్చింది. యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్‌...అని అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ...టీజ‌ర్ చూడ‌గానే నాకు రీతు, విజ‌య్ దేవ‌ర‌ల‌ యాక్ష‌న్ చాలా బాగా న‌చ్చింది. విజ‌య్ కోసం నేను ఒక స్క్రిప్ట్ రాయాల‌నుకుంటున్నాను. అలాగే వివేక్‌తో కూడా సినిమా చేయాల‌నేంత బాగా ట్యూన్స్ ఉన్నాయి. నిర్మాతలతో నాకు బాగా ప‌రిచ‌యం ఉంది. టీం అంద‌రికీ అభినంద‌న‌లు..అని తెలిపారు. 

రాజ్ కందుకూరి మాట్లాడుతూ...ఈ సినిమా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సురేష్‌బాబుగారే. ఆయ‌నే దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్‌ను పంపి క‌థ విన‌మ‌న్నారు. క‌థ విన‌గానే బాగా న‌చ్చింది. ఈ సినిమా కోసం య‌ష్ కూడా క‌లవ‌డం చాలా ప్ల‌స్ అయ్యింది. మంచి యంగ్ టీం క‌లిసి చేసిన సినిమా. భ‌విష్య‌త్‌లో నేను చేసే సినిమాల్లో ఈ సినిమా నేను గ‌ర్వ‌ప‌డే సినిమా అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. వివేక్ సాగ‌ర్ వండ‌ర్ ఫుల్ మ్యూజిక్ అందించాడు. స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌..అని అన్నారు.

నిర్మాత య‌ష్ మాట్లాడుతూ...రాజ్ కందుకూరి తో ఎప్పటినుండో పరిచయం ఉంది. ముందుగా సురేష్ బాబు థాంక్స్‌ చెప్పాలి. ఎంతో సపోర్ట్ చేశారు. ప్రేక్ష‌కులు సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. త‌రుణ్ భాస్క‌ర్ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. త‌న ఆలోచ‌న‌ల‌కు వెల‌క‌ట్ట‌లేం. విజ‌య్‌, రీతూ చ‌క్క‌గా యాక్ట్ చేశారు. వివేక్‌సాగ‌ర్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. సహకరించిన అందరికి ధన్యవాదాలు..అని అన్నారు.

సంగీత దర్శకుడు వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ..ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇవ్వడానికి నిర్మాత‌లు, దర్శకుడు తరుణ్ లు  చాలా స్వేచ్చ‌నిచ్చారు. త‌రుణ్ తో చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. మంచి టీం నాకు అండ‌గా నిల‌బ‌డింది. సింక్ సౌండ్‌లో మ్యూజిక్ చేశాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను..అని అన్నారు.

దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ...నాకు చాలా ఎమోష‌నల్ మూమెంట్ ఇది. అంద‌రూ అండ‌గా నిల‌బ‌డ్డారు. నిర్మాత‌లు చాలా ఫ్రీడం ఇచ్చారు. నిజంగా నాకు తండ్రుల్లా స‌పోర్ట్ చేశారు. ఇది నిజ వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థ‌. మా అమ్మ‌గారు, భార్య నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. సురేష్ బాబుగారికి స్పెష‌ల్ థాంక్స్. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి అతని మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుంది. నాకు సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను..అని  అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర కొండ మాట్లాడుతూ...అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేసే చిత్ర‌మిది. వివేక్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత‌లు ఎక్కడా కంప్రమైజ్ కాలేదు. త‌రుణ్ మా నుండి మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నారు. అవకాశం ఇచ్చి, స‌హకారం అందించిన అంద‌రికీ థాంక్స్.. అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్నకె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్, కె.ద‌శ‌ర‌థ్, రామ‌రాజు, క్రాంతిమాధ‌వ్, అశోక్ కుమార్, మధుర శ్రీధర్, లావ‌ణ్య త్రిపాఠి, నాగ్ అశ్విన్, ర‌ఘుకుంచె, మామిడిప‌ల్లి గిరిధ‌ర్, గోవి, సిద్ధు, సుధాక‌ర్ కోమాకుల, నందు మొదలగు వారు చిత్ర యూనిట్‌ను అభినందించి..చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.       

విజయ్ దేవర కొండ, రీతూవర్మ, ప్రియదర్శిని, గురురాజ్, అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్, మ్యూజిక్: వివేక్ సాగర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రంజిత్ కుమార్, నిర్మాతలు: నిర్మాత రాజ్ కందుకూరి, యస్ రాగినేని దర్శకత్వం: తరుణ్ భాస్కర్ ధాస్యం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ