జ్యోతిరెడ్డి, ఈషా అగర్వాల్, సుమి ఘోష్, సిరి, ప్రియాంక ప్రధాన తారాగణంగా రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్ సమర్పణలో మేడిన్ తెలంగాణ ఫిలింస్ బ్యానర్‌పై నూతన చిత్రం లవర్స్ పార్క్ శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. విజయ్ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్ర తొలి సన్నివేశానికి సీనియర్ నటి కవిత క్లాప్ కొట్టగా, రచయిత ఘటికా చలం గౌరవ దర్శకత్వం వహించారు. హేమలతా రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా శివకుమార్.డి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
ఒకప్పుడు ప్రేమ అనే పదానికి చాలా విలువ ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్‌లో ప్రేమలో విలువలు లేకుండా పోయాయి. కానీ విలువలతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ లవర్స్ పార్క్ చిత్రం రూపొందనుంది. ఈ నెల 15నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుగుతుంది. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. దర్శక నిర్మాతలకు, ఎంటైర్ టీంకు అభినందనలు అని సీనియర్ నటి కవిత తెలిపారు.
లవర్స్ పార్క్ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తాం. భారీ బడ్జెట్‌లో కాకుండా మినిమమ్ బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో కూడిన సినిమాలు చేసి యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికే ఈ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. ప్రేమ విలువ, గొప్పతనాన్ని చెప్పే చిత్రమిది. ఈ చిత్రంలో కవిత, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటీనటులతో పాటు నలుగురు హీరోలు, హీరోయిన్స్ నటిస్తారు. లవ్, రొమాంటిక్ స్టోరీ అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని దర్శకుడు విజయ్‌రెడ్డి చెప్పారు.
కథ వినగానే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని చెప్పాను. చాలా మంచి కథ. మన తాతలు, తండ్రులతో పాటు ఇప్పటి యూత్‌ను టచ్ చేసే చిత్రమని రచయిత ఘటికాచలం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొని దర్శక నిర్మాతలకు థాంక్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరాః ప్రవీణ్(ముంబాయ్), ఎడిటర్ః సోమేశ్వర్, మ్యూజిక్ః నాగు మజాన్, రాజ్‌దీప్(బాలీవుడ్), అసోసియేట్ డైరెక్టర్ః కల్కి ప్రేమ్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ః శాండీ, నిర్మాణంః రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్, దర్శకత్వంః విజయ్ రెడ్డి.
Click Here to see the Lovers Park Opening Photos
Click Here to see the Lovers Park Opening Video