Advertisementt

వెంకటేష్‌, కిషోర్ తిరుమల చిత్ర విశేషాలు!

Fri 05th Aug 2016 07:55 PM
venkatesh,kishore tirumala,ram mohan rao,pr cinemas  వెంకటేష్‌, కిషోర్ తిరుమల చిత్ర విశేషాలు!
వెంకటేష్‌, కిషోర్ తిరుమల చిత్ర విశేషాలు!
Advertisement
Ads by CJ

అక్టోబర్‌ నుండి పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై విక్టరీ వెంకటేష్‌ కొత్త చిత్రం 

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ..హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న యువ దర్శకుడు కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, దర్శకుడు కిషోర్‌ తిరుమల తెలియజూస్తూ...అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు వెంకటేష్‌ నటించిన 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే', 'మల్లీశ్వరి', 'నువ్వునాకునచ్చావ్‌' తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. వెంకటేష్‌గారి నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌గారి పాత్ర చాలా సహజంగా ఉంటుంది...అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. త్వరలోనే వెంకటేష్‌గారి సరసన నటించే కథానాయిక తో పాటు.. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాము..అని తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ