సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ తో అగష్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విక్టరి వెంకటేష్, నయనతార, మారుతిల 'బాబు బంగారం' విడుదల
విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, మారుతి దర్శకుడిగా సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'బాబు బంగారం' సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని, యు/ ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని ఆగష్టు 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల జిబ్రాన్ మ్యూజిక్ లో విడుదలైన పాటలు సూపర్‌డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
Babu Bangaram Movie Full Updates
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్లో వరుస సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్షన్ లో మా బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పైన, ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకష్ణ(చినబాబు) సమర్పణలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాబు బంగారం చిత్రాన్ని నిర్మించాము. దీనికి సంబంధించిన సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సారు వారి అభినందనలతో పాటు..మా చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిలవటం చాలా హ్యాపీగా వుంది. సౌత్ క్రేజి మ్యూజిక్ దర్శకుడు జిబ్రాన్ అందించిన ఆడియో అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. ఈచిత్రం విక్టరి వెంకటేష్ గారి అభిమానులతో పాటు ఫ్యామిలి ఆడియన్స్ ని చక్కగా ఆకట్టుకుంటుంది..అని అన్నారు.