1. సూపర్ హిట్ పెయిర్ జై, అంజలి జంటగా 'బెలూన్'
జై, అంజలి జంటగా నటించిన 'జర్నీ' సూపర్‌హిట్ అయింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో 70 ఎంఎం ఫిలిం స్ పతాకంపై టిఎన్ అరుణ్ బాలాజీ కందసామి నంద కుమార్ నిర్మిస్తున్న 'బెలూన్' చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 'మర్యాద రామన్న' ఫేం నాగినీడు మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సూపర్‌హిట్ మ్యూజిక్ చేస్తున్నారు.
లెజండ్రీ డైరెక్టర్ వి. రామచంద్రరావు ఫ్యామిలీ నుండి వస్తున్న దర్శకుడు!
తెలుగులో 17 చిత్రాలు డైరెక్ట్ చేసి అందులోనూ సూపర్‌స్టార్ కృష్ణతో 13 చిత్రాలకు దర్శకత్వం వహించి 'అసాధ్యుడు, దేవుడుచేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు 'వంటి ఎన్నో సూపర్‌హిట్స్ ఇచ్చిన లెజెండ్రీ డైరెక్టర్ వి. రామచంద్రరావు మనవరాలిని వివాహం చేసుకున్న ఎస్. శినీష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు శినీష్ 'బెలూన్' గురించి మాట్లాడుతూ - 'కొడైకెనాల్లో షూటింగ్ జరుపుకునే రొమాంటిక్ హర్రర్ మూవీ 'బెలూన్'. జై, అంజలి కెరీర్స్ లో మరో మైల్స్టోన్ అవుతుంది. 1989 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ హర్రర్ చిత్రమిది..అన్నారు.
2. 'దృశ్యం' దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో కొత్త చిత్రం 'ఘటన'
విక్టరీ వెంకటేష్ హీరోగా 'దృశ్యం'వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శ కత్వం వహించిన సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం వస్తోంది. ఈ చిత్రానికి 'ఘటన' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
సన్‌మూన్ క్రియేషన్స్ పతాకంపై V.R. కృష్ణ M. నిర్మించే ఈ 'ఘటన'కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన 'ప్రతిఘటన' అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. మరి సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీప్రియ దర్శ కత్వంలో వస్తోన్న ఈ 'ఘటన' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!!
3. నాని 'మజ్ను' సినిమా టీజర్ విడుదల...!
ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై 'జెమిని కిరణ్' నిర్మిస్తున్న చిత్రం 'మజ్ను'. నాని హీరోగా ఈ చిత్రంలోని పాటలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. కాగా మజ్ను సినిమా టీజర్ ఈ రోజు(శుక్రవారం) చిత్రం సభ్యులు విడుదల చేశారు. ఉయ్యాల జంపాల ఫేమ్ 'విరించి వర్మ' దర్శకుడు.
4. విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి. సినిమా బ్యానర్‌పై రూపొందనున్న చిత్రం 'లక్కున్నోడు'
'ఈడోరకం-ఆడోరకం' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా 'లక్కున్నోడు' చిత్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తున్న విష్ణు మంచు హీరోగా మా బ్యానర్లో సినిమా చేయనుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈడోరకం -ఆడోరకం వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత ఆయన చేస్తున్నలవ్ అండ్ కామెడి ఎంటర్టైనర్ 'లక్కున్నోడు'. గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్టైనర్స్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకన్న రాజ్‌కిరణ్ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆయన చెప్పిన పాయింట్ వినగానే మంచు విష్ణు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు రైటర్ డైమండ్ రత్నంబాబు రచన, కథా విస్తరణ, మాటలు అందిస్తున్నారు. సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మధు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారం తర్వాత సెట్స్ లోకి వెళుతుంది. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తామన్నారు.
ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్.కుమార్, విజయ్‌కుమార్ రెడ్డి, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్‌కిరణ్.
4. 'దేవిశ్రీ ప్రసాద్' హీరోయిన్గా పూజా రామచంద్రన్
విలక్షణ చిత్రాల దర్శకుడు శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవిశ్రీప్రసాద్'. సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఆర్.ఓ.క్రియేషన్స్ బ్యానర్‌పై రుద్రరాజు వెంకటరాజు, ఆక్రోష్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజునే యాదృచ్చికంగా ప్రారంభం కావడం విశేషం. స్వామిరారా, పిజ్జా చిత్రాల్లో నటించి మెప్పించిన పూజా రామచంద్రన్ ఈ చిత్రంలో నటిస్తుంది. డిఫరెంట్ పాయింట్ తో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసే ఆసక్తికరమైన మలుపులతో సాగే కథాంశంతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్స్ లో ఒకరైన పోసాని కృష్ణమురళి సెల్ఫీరాజా అనే పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఆద్యంతం అలరించే ఆయన క్యారెక్టర్ సాగుతుంది. తప్పకుండా ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చే మూవీగా అన్నీ హంగులతో సినిమాను రూపొందిస్తున్నామని దర్శకుడు శ్రీకిషోర్ అన్నారు. అయితే ఇప్పటి వరకు దేవిశ్రీప్రసాద్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించే నటుడెవరనే విషయాన్ని దర్శకుడు గోప్యంగా ఉంచుతున్నారు. అసలు ఆ నటుడెవరనే విషయంపై సినీవర్గాల్లో క్యూరియాసిటీ నెలకొంది.
5. కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త చిత్రం
ఉత్తమ చిత్రాలను అందించాలనే ఆసక్తితో, సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బలగ ప్రకాష్ నిర్మాతగా వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. అంతర్వేది టు అమలాపురం చిత్రంలో నటించిన హీరో, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కేటుగాడు వంటి డిఫరెంట్ చిత్రంతో అందరి మన్ననలు అందుకున్న దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వచ్చే నెలలో సినిమా లాంచనంగా ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తామని పుట్టినరోజు(ఆగస్ట్ 12) సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్ తెలియజేశారు.