>తేదీ: 13-8-2016
>1. విశాల్, తమన్నా జంటగా జి.హరి భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'
>మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఒక్కడొచ్చాడు' టైటిల్ కన్‌ఫర్మ్ చేశారు. ఈ చిత్రం కోసం ఫైట్ మాస్టర్ కనల్‌కణ్ణన్ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు. ఈ ఛేజ్ 'ఒక్కడొచ్చాడు'కి ఓ హైలైట్ అవుతుంది. పాండిచ్చేరిలో భారీ సెట్స్ వేసి దినేష్ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. అలాగే విశాల్, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌లో కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశారు. హిప్ ఆప్ తమిళ్ సంగీతం అందించిన మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ 'ఒక్కడొచ్చాడు'.
>రష్యాలో రెండు పాటలు
>నిర్మాత జి.హరి మాట్లాడుతూ - యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ అన్నీ మిక్స్ అయిన మంచి కమర్షియల్ ఫిలిం 'ఒక్కడొచ్చాడు'. విశాల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. సెప్టెంబర్‌లో 10 రోజుల టాకీ పార్ట్ చెయ్యడంతో షూటింగ్ పూర్తవుతుంది. రష్యాలో రెండు పాటల్ని చిత్రీకరిస్తార. ఆగస్ట్ 19న ఫస్ట్ లుక్. ఆగస్ట్ 29 విశాల్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తాం. అక్టోబర్ 9న ఆడియో, అక్టోబర్ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
>విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
>ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్(రంగం ఫేమ్), మాటలు: రాజేష్ ఎ.మూర్తి, పాటలు: భాగ్యలక్ష్మి, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్, సమర్పణ: ఎం.పురుషోత్తమ్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.
>2. ప్రభాస్ కజిన్ 'సిద్ధార్థ్' హీరోగా రీ ఎంట్రీ..
>ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ హీరోగా గతంలో 'బ్లాక్ & వైట్', 'ప్రియుడు' తదితర చిత్రాలను నిర్మించిన నిర్మాత పి.ఉదయ్ కిరణ్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా సురేష్ రేపల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధార్థ్ గతం లో 'కెరటం' అనే చిత్రంలో నటించాడు. ఇప్పుడు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ గా మరలా ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో, 'బాహుబలి' చిత్రానికి ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేసిన బాలు కెమెరామెన్ గా ఎంపికయ్యారు. ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోందని ఫిలిం నగర్ సమాచారం.
>3.'నీ జతలేక' ప్రమోషనల్ టైటిల్ సాంగ్ విడుదల
>యంగ్ హీరో నాగశౌర్య హీరోగా పారుల్, సరయు హీరోయిన్స్‌గా శ్రీ సత్య విదుర మూవీస్ పతాకంపై లారెన్స్ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్ గౌడ్ చిర్రా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. కరుణాకర్ కంపోజ్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ రేడియో సిటీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా...
>దర్శకుడు లారెన్స్ దాసరి మాట్లాడుతూ..నీ జతలేక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. చూసే ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సిచ్యువేషనల్ కామెడితో సాగిపోతుంది. రీసెంట్‌గా విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన కరుణాకర్‌గారు ఈ సినిమాకు టైటిల్ సాంగ్‌ను అందించారు. మంచి ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. గర్ల్ జెలసీ అనే కాన్సెప్ట్‌తో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీ..అన్నారు.
>నిర్మాత జి.వి.చౌదరి మాట్లాడుతూ...మా సత్యవిదుర బ్యానర్‌లో విడుదలవుతున్న తొలి చిత్రమిది. సాంగ్స్‌కు చాలా మంచి స్పందన రావడం ఎంతో హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నాగశౌర్య, పారుల్, సరయు చక్కగా యాక్ట్ చేశారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం... అన్నారు.
>మ్యూజిక్ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ..ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాను. అయితే టైటిల్ సాంగ్ చేయాలనే ఆలోచన రాగానే దర్శక నిర్మాతలకు చెప్పాను. వారు ఒప్పుకోవడంతో టైటిల్‌సాంగ్ లిరిక్స్ రాయడమే కాకుండా ట్యూన్స్ కూడా కంపోజ్ చేశాను. కథలోని మెయిన్ పాయింట్ నచ్చడంతో దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సాంగ్‌ను కంపోజ్ చేశాను.. అన్నారు.
>ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎ.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
>4. ఆగస్ట్ 16 నుంచి శ్రీసత్యసాయి ఆర్ట్స్ చిత్రం రెండో షెడ్యూల్
>'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్' వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఆగస్ట్ 12తో పూర్తయింది. రెండో షెడ్యూల్ ఆగస్ట్ 16 నుండి జరుగుతుంది.
>ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ...హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్ట్ 12 వరకు జరిగిన మొదటి షెడ్యూల్‌తో 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్ 16 నుంచి నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మా బేనర్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం 'బెంగాల్ టైగర్' తర్వాత చేస్తున్న సినిమా ఇది. డైరెక్టర్ సత్తిబాబు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందించే ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రమవుతుంది.. అన్నారు.
>నవీన్ చంద్ర, శృతి సోధి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర, పిళ్ళా ప్రసాద్, విద్యుల్లేఖా రామన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
>ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., ఎడిటింగ్: గౌతంరాజు, కథ: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
>5. ఈనెల 26న వస్తున్న 'బంతిపూల జానకి'
>ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా.. హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ 'బంతిపూల జానకి'. ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తేజ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. శిల్పకళా వేదికపై.. భారీ చిత్రాల స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు విశేష స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు
>ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణులందరి సహాయ సహకారాల వల్ల 'బంతిపూల జానకి' చిత్రం అవుట్ పుట్ చాలా సంతృప్తిగా వచ్చింది. 2016లో ఘన విజయం సాధించబోయే చిన్న చిత్రాల జాబితాలో 'బంతిపూల జానకి' తప్పక స్థానం సంపాదించుకుంటుంది. దర్శకుడిగా నాకు చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది.. అన్నారు.
>ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజ మాట్లాడుతూ.. బోలె సంగీతం 'బంతిపూల జానకి' చిత్రానికి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కామెడీ థ్రిల్లర్ ను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు.