Advertisementt

మరో సక్కని తెలుగు టైటిల్ తో మూవీ..!

Wed 24th Aug 2016 02:54 PM
sakkanodu chikkinaa andhame,sakkanodu chikkinaa andhame movie pooja event,sakkanodu chikkinaa andhame telugu movie,sriram,us ramachandra rao  మరో సక్కని తెలుగు టైటిల్ తో మూవీ..!
మరో సక్కని తెలుగు టైటిల్ తో మూవీ..!
Advertisement
Ads by CJ

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'సక్కనోడు..చిక్కినా అందమే' 

శ్రీలక్ష్మీ వెంకటరమణ మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ దర్శకత్వంలో లీలా కార్తీక్‌, స్వప్న హీరో హీరోయిన్లుగా యు.ఎస్‌. రామచంద్రరావు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సక్కనోడు..చిక్కినా అందమే'. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ..నేటి ట్రెండ్‌కి తగ్గ లవ్‌స్టోరీతో యూత్‌నే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సబ్జెక్ట్‌ ఇది. మా నిర్మాతలు నేను చెప్పిన సబ్జెక్ట్‌ని నమ్మి, వెంటనే షూటింగ్‌ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. కిషన్‌ కవాడియా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రయిల్‌ షూట్‌ చేయడం జరిగింది. మంచి అభినయం ప్రదర్శించగల నటీనటులు ఈ చిత్రానికి దొరకడం ఆనందంగా ఉంది...అన్నారు. 

నిర్మాత యు.ఎస్‌. రామచంద్రరావు మాట్లాడుతూ..దర్శకుడు శ్రీరామ్‌ మంచి ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కథని వినిపించారు. కథ ఎంతగానో నచ్చింది. అందుకే వెంటనే షూటింగ్‌ ప్రారంభించాము. శరవేగంగా చిత్రీకరణ జరిపి..అతి తక్కువ సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము...అన్నారు. 

లీలా కార్తీక్‌, స్వప్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: బోడిరెడ్డి సాయికుమార్‌; సంగీతం: కిషన్‌ కవాడియా; కెమెరా: పి. వనిదర్‌ రెడ్డి; డ్యాన్స్‌: బి. రామారావు; ఎడిటింగ్‌: వి. నాగిరెడ్డి; ఆర్ట్‌: వెంకట్‌ ఆరె; కో-డైరెక్టర్‌: పురుషోత్తమ రెడ్డి వూటూరు; సహనిర్మాత: స్వప్నమంజరి మహంతి; నిర్మాత: యుఎస్‌. రామచంద్రరావు; దర్శకత్వం: శ్రీరామ్‌ బి.ఎస్‌.సి 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ