Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (31-8-16)..!

Thu 01st Sep 2016 05:03 PM
inkokkadu,kurra thoofan,jyo achyutananda release date,jaguar,ee charitra inkennallu,premante suluvu kaaduraa,tollywood tazaa updates,tollywood tajaa updates,august 31st  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (31-8-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (31-8-16)..!
Advertisement
Ads by CJ

1. సెప్టెంబర్ 8న విక్రమ్ 'ఇంకొక్కడు' గ్రాండ్ రిలీజ్

పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటారాయన. విలక్షణతకు పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు అందుకే చియాన్ విక్రమ్ అంటే అభిమానాన్ని ఏర్పరుచుకున్నారు. శ్మశానంలో ఉండి మాటలు రాని శివపుత్రుడుగా ఉత్తమ అభినయాన్ని కనపరిచి జాతీయ అవార్డును దక్కించుకున్న విక్రమ్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కూతురుపై ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేసే నాన్నగా, గ్రుడ్డివాడు విక్రమ్ చేసిన శివతాండవంను ప్రేక్షకులు మరచిపోలేరు. అలాగే స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా, అన్యాయాన్ని ఎదిరించిన అపరిచితుడుగా మెప్పించారు. ఐ చిత్రంలో కురూపిగా విక్రమ్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి విలక్షణ నటుడు విక్రమ్ మన ముందుకు 'ఇంకొక్కడు'గా రానున్నారు. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రంలో రా ఏజెంట్ గానే కాకుండా, లవ్ అనే హిజ్రా పాత్రలో విక్రమ్ నటన ప్రేక్షకులకు కనువిందు చేయడం గ్యారంటీ. విక్రమ్ నటనతో పాటు హ్యరీష్ జైరాజ్ అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఇంకొక్కడు' చిత్రంలో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళంలో ఇరుముగన్ అనే పేరుతో తెరకెక్కిన  ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ అధినేత నీలం కృష్ణారెడ్డి 'ఇంకొక్కడు'గా సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 

2. నిఖిల్‌ కుమార్‌ 'జాగ్వార్‌'లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ 

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'జాగ్వార్‌' కోసం ఇటీవలే బల్గేరియాలో కోట్ల రూపాయల వ్యయంతో హై రేంజ్‌లో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరించారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ఫైట్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఈ ఫైట్‌ సినిమాకి హైలైట్‌గా నిలవనుంది. 

ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వండర్‌ఫుల్‌ రెస్పాన్స్‌ 

ఈ చిత్ర విశేషాలను సమర్పకులు హెచ్‌.డి.కుమారస్వామి తెలియజేస్తూ - రీసెంట్‌గా చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసిన 'జాగ్వార్‌' ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వండర్‌ఫుల్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నిఖిల్‌కుమార్‌ అత్యద్భుతంగా నటించాడని టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈమధ్యనే నేను పవన్‌కళ్యాణ్‌గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఆ సమయంలో 'జాగ్వార్‌' టీజర్‌ని పవన్‌ కళ్యాణ్‌గారు చూసి.. టీజర్‌ చాలా బాగుంది. నిఖిల్‌కుమార్‌కి హీరోగా మంచి భవిష్యత్‌ వుంటుంది. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్‌ వున్నాయి. డెఫినెట్‌గా సక్సెస్‌ అవుతాడు.. అని చిత్ర యూనిట్‌ని అప్రిషియేట్‌ చేశారు. 

తమన్నా స్పెషల్‌ సాంగ్‌ 

ఫస్ట్‌లుక్‌తోనే మా అబ్బాయి నిఖిల్‌కుమార్‌ అందరి ప్రశంసలు అందుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. బిజినెస్‌పరంగా 'జాగ్వార్‌' సినిమాకి మంచి క్రేజ్‌ వస్తోంది. ఈ చిత్రంలో గ్లామర్‌ హీరోయిన్‌ తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. ఈ పాట సినిమాకి మంచి ప్లస్‌ అవుతుంది. అలాగే ఈ చిత్రానికి ఇండస్ట్రీలో వున్న టాప్‌ టెక్నీషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 5 నుండి ఈ చిత్రం షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ఓ ప్రముఖ టాప్‌ హీరోయిన్‌తో స్పెషల్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తాం. ఈ పాట ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేసేవిధంగా వుంటుంది. 

థమన్‌ మ్యూజిక్‌ ఎక్స్‌లెంట్‌!! 

ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి మ్యూజిక్‌ చేసిన సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. రామ జోగయ్య శాస్త్రి ఈ చిత్రంలో అన్ని పాటల్ని ఒకదాన్ని మంచి మరొకటి అద్భుతంగా వుండేలా రాశారు. ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా సెప్టెంబర్‌ 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో 'జాగ్వార్‌' ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవాటెల్‌లో అత్యంత వైభవంగా జరపనున్నాం. 

దసరా కానుకగా అక్టోబర్‌ 6న సినిమా రిలీజ్‌!! 

విజయేంద్రప్రసాద్‌గారు ఈ చిత్రానికి అత్యద్భుతమైన కథని అందించారు. మనోజ్‌ పరమహంస ఫొటోగ్రఫీ, మహదేవ్‌ టేకింగ్‌, థమన్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. నిఖిల్‌కుమార్‌కి జోడీగా దీప్తి నటించింది. అలాగే ఈ చిత్రంలో నా ఫ్రెండ్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తుండగా, రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ తారాగణంతో 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా 'జాగ్వార్‌' చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు. 

'జాగ్వార్‌' నాకు చాలా మంచి చిత్రమవుతుంది 

హీరో నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ - నాకు తెలుగంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలను చూస్తుంటాను. విజయేంద్ర ప్రసాద్‌గారు మా నాన్నగారిని కలవడానికి వచ్చినపుడు మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకుని నా చేతుల్లో పెట్టండి అన్నారు. అది నాకిప్పటికీ గుర్తే. అలా విజయేంద్రప్రసాద్‌గారు ఓ మంచి కథను సిద్ధం చేశారు. మహదేవ్‌గారు ఎంతో కష్టపడి సినిమాను డైరెక్ట్‌ చేశారు. మనోజ్‌ పరమహంస బ్యూటిఫుల్‌ సినిమాటోగ్రఫి అందించారు. థమన్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. నావంతుగా నేను బెస్ట్‌ ఎఫర్ట్స్‌ పెట్టివర్క్‌ చేశాను. తప్పకుండా ఇది నాకు చాలా మంచి చిత్రమవుతుంది. ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేసి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను..అన్నారు. 

జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌. 

3. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ప్రేమంటే సులువు కాదురా'

రాజీవ్ సాలూరి-సిమ్మీదాస్ జంటగా..  యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..  ఆర్.పి ప్రొడక్షన్స్ పతాకంపై  భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేమంటే సులువు కాదురా. కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు ఈ చిత్రానికి సహ నిర్మాతలు. నందన్ రాజ్ సంగీతం సమకూర్చిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి 'ప్రాణం' కమలాకర్ రీ-రికార్డింగ్ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మా దర్శకుడు చందా గోవింద్ రెడ్డి ప్రేమంటే సులువు కాదురా చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే ప్రాణం కమలాకర్ ఆర్.ఆర్ కూడా. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ సంగీత దర్శకులు కోటి మా అబ్బాయి రాజీవ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ప్రేమంటే సులువు కాదురా ది బెస్ట్ సినిమా అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడం.. ఈ సినిమా సాధించబోయే విజయంపై మాకు మరింత నమ్మకం కలిగించింది. అలాగే.. భలే భలే మగాడివోయ్, బాబు బంగారం వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఎస్.బి.ఉద్ధవ్ సబ్జెక్టు నచ్చి మా చిత్రానికి పని చేయడం మాకు గర్వకారణం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 2016లో ఘన విజయం సాధించిన చిత్రాల జాబితా లో ప్రేమంటే సులువు కాదురా కచ్చితంగా ఉంటుందనే నమ్మకం మాకుంది అన్నారు. 

4. డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' 

విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై వై. శేషిరెడ్డి సమర్పణలో తమిళ్‌లో సంచలన విజయం సాధించిన 'తరకప్పు' చిత్రంను తెలుగులో 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. 

ఈ సందర్భంగా వై. శేషిరెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌లో ఘనవిజయం సాధించిన 'తరకప్పు' చిత్రాన్ని తెలుగులో 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' పేరుతో అనువదిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర హీరోలు సముద్రఖని, శక్తివేల్‌ పోటాపోటీగా నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ కథని దర్శకుడు రవి అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువతను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ రెండవ వారంలో ఆడియోని విడుదల చేసి..అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయనున్నాము...అన్నారు. 

శక్తివేల్‌ వాసు, సముద్రఖణి, వైశాలి, రియాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎమ్‌. రాజశేఖరరెడ్డి; ఫోటోగ్రఫీ: జోన్స్‌ ఆనంద్‌; సంగీతం: ఎఫ్‌.ఎస్‌. ఫైజల్‌; నిర్మాణం: విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌; దర్శకత్వం: రవి.

5. జ్యో అచ్యుతానంద సెన్సార్ పూర్తి...ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో  వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'జ్యో అచ్యుతానంద'. రొమాంటిక్ కామెడితో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. 

ఊహలు గుసగుసలాడే చిత్రంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన మరో అందమైన కుటుంబ కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో సినిమాపై మంచి అసక్తి నెలకొంది. అల్రెడి విడుదలైన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు, కల్యాణ్ రమణ సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ములుగా నారారోహిత్, నాగశౌర్యల మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని, ప్రేక్షకులను ఎంటైర్ చేస్తూనే  మంచి ఫీల్ తో, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటున్నారు.​

6. రెగ్యులర్‌ షూటింగ్‌లో 'కుర్రతుఫాన్‌' 

సిక్స్‌ప్రెండ్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మాస్టర్‌ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకుడు డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి రూపొందిస్తున్న చిత్రం 'కుర్రతుఫాన్‌'. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేశారు. 

దర్శకుడు మాట్లాడుతూ..సినిమా ప్రారంభించి చాలా రోజులవుతుంది. మంచి అవుట్‌పుట్‌ కోసమే చిత్రీకరణ ఆలస్యం అవుతుంది. చిత్రీకరణ విషయంలో దేనికీ కాంప్రమైజ్‌ అవ్వడం లేదు. ఈ చిత్రం నాతో పాటు సినిమాలో నటించే చాలా మందికి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం కావాలని..ది బెస్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నాము. అందువల్లే చిత్రీకరణ ఆలస్యం అవుతుంది. ఈ సెప్టెంబర్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. అక్టోబర్‌లో ఆడియోను విడుదల చేసి, సంక్రాంతికి లేదా సమ్మర్‌కి చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాము..అని అన్నారు. 

గాధె తరుణ్‌, తేజ్‌, భావన, హరిక్రిష్ణ, మాస్టర్‌ శ్రీరామచంద్ర, బ్రహ్మానందం, ఆలీ, ఉత్తేజ్‌, రాజీవ్‌ కనకాల, రచ్చరవి, ఘంట విజయ్‌, శ్రీచరణ్‌, సిద్దూ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపాల్‌ సామ్రాజ్‌; సంగీతం: టి.పి. భరద్వాజ్‌; పాటలు: చంద్రబోస్‌, విజయ్‌కుమార్‌; ప్రొడక్షన్‌: మహేష్‌, నిర్మాణం: సిక్స్‌ఫ్రెండ్స్‌ యూనిట్‌; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ