Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (1-9-16)..!

Fri 02nd Sep 2016 03:25 PM
rail,rail movie,dhanush,naradhudu movie,naradhudu movie release details,ilayaraja live concert,prakash raj,neerajanam audio launch,neerajanam,tollywood tajaa updates,tollywood tazaa updates,september 1st  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (1-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (1-9-16)..!
Advertisement
Ads by CJ

1. ధనుష్‌, కీర్తి సురేష్‌ జంటగా 'రైల్‌' - సెప్టెంబర్‌ 3న ఆడియో 

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్‌ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'రైల్‌'. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 3న గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ - హీరో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన రఘువరన్‌ బి.టెక్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అయింది. అలాగే నేను శైలజ చిత్రంలో హీరోయిన్‌గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన హీరోయిన్‌ కీర్తి సురేష్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'రైల్‌'. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 3న విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం..అన్నారు. 

ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌. 

2. సెప్టెంబర్ 3న వస్తున్న 'నారదుడు'

సూరజ్ ప్రొడక్షన్స్-టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం 'నారదుడు'.  

ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి  తెలుగు అనువాద రూపమిది. 'బిచ్చగాడు' కధానాయకుడు విజయ్ ఆంటోనీ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాతలు మాట్లాడుతూ.. 'ధనుష్ పెర్ఫార్మెన్స్, జెనీలియా, శ్రియల గ్లామర్ తో పాటు ప్రతి సన్నివేశంలోనూ పండే కడుపుబ్బ నవ్వించే కామెడీ, విజయ్ ఆంటోని సంగీతం, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు 'నారదుడు' చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. ధనుష్ సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా మేళవించిన చిత్రమిది. 'అభినవ నారదుడు' లాంటి ధనుష్ పాత్ర ఇటు మాస్..  అటు క్లాస్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరిస్తుంది. సెప్టెంబర్ 3న అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.. అన్నారు. 

గీత, శంకరాభరణం రాజ్యలక్ష్మి, భాగ్యరాజా, ఆశిష్ విద్యార్థి, జయప్రకాశ్ రెడ్డి, వివేక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర-వెన్నెలకంటి-శివగణేష్, సంగీతం: విజయ్ ఆంటోని, నిర్మాతలు: ఉమ- వై.వి.సత్యనారాయణ, దర్శకత్వం: జవహర్!!

3. నీరాజనం పాటలు విడుదల

మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నీరాజనం. అవన్ ఆళ్ల దర్శకుడు. మహాలక్ష్మీ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఈ చిత్రాన్ని దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్ విడుదల చేయగా రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ నీరాజనం మంచి టైటిల్. మంచి ప్లానింగ్‌తో మూడు భాషల్లో నిర్మించిన ఈ సినిమా నిర్మాత పెట్టిన ప్రతి పైసా తిరిగిరావాలి. రవిశంకర్ అందించిన పాటలు అద్భుతంగా వున్నాయి. సభ్యసాచి ఓరియాలో స్టార్ హీరో, షాపింగ్‌మాల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మగేష్..ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. దర్శకుడు అవన్ ఆళ్ల మాట్లాడుతూ ఓ మ్యూజికల్ రియాలిటీ షో నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథా చిత్రమిది. మూడేళ్ల క్రితం చేసుకున్న కథ ఇది. ఏడాది క్రితం నిర్మాతకు చెప్పాను. నాపై నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగుతుంది అన్నారు. నిర్మాత దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ దర్శకుడిపై వున్న నమ్మకంతో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. చాలా కథలు విన్నాను. అయితే అనుకున్న కథను సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడైతే బాగుంటుందని అవన్ ఆళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రవిశంకర్, మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని, బన్నీ ప్రకాష్, కెమెరామెన్ మహీశేర్ల, పి.తిలక్ తదితరులు పాల్గొన్నారు. 

4. తెలుగువారి కోసం ఇళ‌య‌రాజా, ప్ర‌కాశ్‌రాజ్‌

మేస్ట్రో ఇళ‌య‌రాజా పాట‌లంటే చెవి కోసుకోని తెలుగువారు ఉండ‌రు. ఆయ‌న పాట‌ల‌కు ఎలాంటి వారైనా త‌ల‌లూపి తీరుతారంతే. అంత‌టి సంగీత జ్ఞాని తాజాగా తెలుగువారి కోసం ఓ ప్ర‌త్యేక‌మైన కాన్స‌ర్ట్ చేయడానికి అంగీక‌రించారు. అదీ యుఎస్ ఎ , కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో. ఈ నెల 10న‌, శ‌నివారం జ‌రిగే ఈ కాన్స‌ర్ట్ కు మ‌రో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. కాన్స‌ర్ట్ కు తెలుగువారి అభిమాన విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. బే ఏరియా తెలుగు అసోసియేష‌న్‌, స్వాగ‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, లావ‌ణ్య దువ్వి, యు స్మైల్ డెంట‌ల్ ఆధ్వ‌ర్యంలో ఈ కాన్స‌ర్ట్ జ‌ర‌గ‌నుంది. నిర్వాహ‌కులు మాట్లాడుతూ...ఇప్ప‌టిదాకా ఇళ‌య‌రాజాగారు యుఎస్ ఎ లో ప‌లు సంగీత కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. మ‌రీ ముఖ్యంగా 2013లో యుఎస్ ఎ లో ఓ సారి కాన్స‌ర్ట్  చేశారు. తాజాగా  మ‌రో ఐదు ప్రోగ్రామ్‌ల‌ను నిర్వ‌హించ‌డానికి కూడా అంగీక‌రించారు. అయితే అవ‌న్నీ తెలుగు, త‌మిళం క‌ల‌గ‌లిపిన పాట‌ల‌తో ఉంటాయి. కానీ సెప్టెంబ‌ర్ 10న మేం నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మం మాత్రం సంపూర్ణంగా తెలుగువారి కోస‌మే. ఇందులో ఇళ‌య‌రాజాగారి ఆధ్వ‌ర్యంలో తెలుగు పాట‌ల‌ను మాత్ర‌మే పాడుతారు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో సంగీత ద‌ర్శ‌కుడిగా వెయ్యి చిత్రాల మైలు రాయిని దాటుతున్న త‌రుణంలో ఇసైజ్ఞాని, ప‌ద్మభూష‌ణ్ ఇళ‌య‌రాజాగారు మాకోసం ఈ కార్య‌క్ర‌మాన్ని అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది.  సింఫ‌నీ ఆర్కెస్ట్రాతో ఆయ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ముదావ‌హం. దాదాపు 50 మందికి పైగా సంగీత‌కారులు, కోర‌స్ గాయ‌నీగాయ‌కులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు.  ప్ర‌ఖ్యాత గాయ‌నీ గాయ‌కులు చిత్ర‌, సాధ‌నా స‌ర్గ‌మ్‌, మ‌నో, కార్తిక్‌, ప్రియా హిమేష్‌, అనితా కార్తికేయ‌న్‌తో పాటు ప‌లువురు శాన్ జోస్‌కి రానున్నారు. ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌గారు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఆయ‌న‌కు మా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు... అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ