Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (5-9-16)..!

Tue 06th Sep 2016 06:23 PM
cinejosh updates,cinejosh update news,cinejosh movie updates,cinejosh updates,majnu movie audio launch,jaguar movie,hero ram hyper movie,saye daivam movie,ekkadiki potavu chinnavada movie  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (5-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (5-9-16)..!
Advertisement
Ads by CJ
>మజ్ను ఆడియో విడుదల 

 నేచురల్‌ స్టార్‌ నాని, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న చిత్రం మజ్ను. ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏషియన్‌ నారాయణ దాస్‌, సునీల్‌, హీరో నాని, దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, అనీల్‌ సుంకర, రాజ్‌ తరుణ్‌, ఇంద్రగంటి మోహనకృష్ణ, మారుతి, హను రాఘవపూడి, కల్యాణ్‌కృష్ణ, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీ, గోళ్ళ గీత, పి.కిరణ్‌, విరించి వర్మ, గోపీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు. బిగ్‌ సీడీని ఏషియన్‌ మూవీస్‌ నారాయణ దాస్‌ విడుదల చేయగా, ఆడియో సీడీలను హీరో నాని విడుదల చేసి తొలి సీడీని రాజ్‌ తరుణ్‌కు అందించారు. దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, అనీల్‌ సుంకర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా... హీరో నాని మాట్లాడుతూ - అందరూ అనుకుంటున్నట్లు బాధలో ఉండే మజ్ను కథ ఈ సినిమా కాదు. ప్రేమలో పడి సమస్యల్లో ఉన్నట్లు కనపడే ఎవరినైనా మజ్ను అనే అంటాం. ఇక మా మజ్ను సినిమా విషయానికి వస్తే బోర్‌ కొట్టదు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఇంటికి వెళ్ళినా గుర్తుకు వస్తుంటాడు. ఉయ్యాలా జంపాలా కథను దర్శకడు విరించి వర్మ ముందు నాకే చెప్పాడు. కాబట్టి నాకు అప్పటి నుండి మంచి పరిచయం. తను చాలా మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి. తన నిజాయితీ తన సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌లో కనపడుతుంది. ప్రేక్షకులు అందుకే తన సినిమాను తమదిగా భావిస్తారు. అందుకే ఉయ్యాలా జంపాలా పెద్ద హిట్‌ సాధించింది. దాని కంటే మా మజ్ను ఇంకా పెద్ద హిట్‌ సాధిస్తుంది. కిరణ్‌గారు, గీతగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నాకు అష్టాచమ్మా రోజులు గుర్తుకు తెచ్చిన సినిమా ఇది. యూనిట్‌ సభ్యులందరితో ఒక సభ్యుడిగా కలిసిపోయి ఈ సినిమా కోసం పనిచేశాను. హీరోయిన్స్‌ అనుఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీలు చక్కగా యాక్ట్‌ చేశారు. గోపీ సుందర్‌తో భలే భలే మగాడివోయ్‌ తర్వాత చేస్తున్న మూవీ ఇది. నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూ చేశాం. అందరికీ థాంక్స్‌ అన్నారు. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ - మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాగే ప్రేమలో వున్నప్పుడు అది ఎన్ని రోజులు వుంటుందనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ మజ్ను చిత్రాన్ని రూపొందించాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు రొమాంటిక్‌ ఫీల్‌ వున్న చిత్రం అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ - నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అందరికీ కంఫర్టబుల్‌గా వుండే హీరో. అలాగే మంచి కథల్ని ఎంచుకుంటూ మంచి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తూ వుంటాడు. ఈ సినిమా తనకి, విరించి వర్మకు, నిర్మాతలకు పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. మారుతి మాట్లాడుతూ - నాని ఫెయిల్యూర్‌ వచ్చినా చాలా పాజిటివ్‌గా ఆలోచించే హీరో. తనతో భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ సినిమా చేశాను. తనతో పనిచేస్తున్నప్పుడు సొంత సినిమాకి పనిచేస్తున్న ఫీల్‌ కలుగుతుంది. విరించి వర్మ తన టేస్ట్‌కి తగ్గ సినిమాలు చేస్తూ వస్తున్నారు. గోపిసుందర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతలకు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాను అన్నారు. అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ - నేను, నాని ఒకే సినిమాతో పరిచయమయ్యాం. ఇప్పుడు మా ఇద్దరి సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌ అవ్వడం హ్యాపీగా వుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు. 

రెండు పాటలు మినహా ఇంట్లో దెయ్యం.. నాకేం భయం పూర్తి - విజయదశమి రిలీజ్‌ 

 అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇంట్లో దెయ్యం.. నాకేం భయం. ఈ చిత్రం షూటింగ్‌ రెండు పాటలు మినహా పూర్తయింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తోన్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అన్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - అల్లరి నరేష్‌తో చేసిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. టర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది అన్నారు. 

జార్జియాలో రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ హైపర్‌ పాటల చిత్రీకరణ 

 ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హైపర్‌ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రంలోని రెండు పాటలను జార్జియాలో చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్‌ 3 నుంచి జార్జియాలోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల చిత్రీకరణతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుగా సెప్టెంబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

>సెప్టెంబర్‌ 18న నిఖిల్‌ కుమార్‌ జాగ్వార్‌ ఆడియో 

 మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం జాగ్వార్‌. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జాగ్వార్‌. సెప్టెంబర్‌ 18న ఆడియో ఈ చిత్ర విశేషాలను సమర్పకులు హెచ్‌.డి.కుమారస్వామి తెలియజేస్తూ - ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇండస్ట్రీలో వున్న టాప్‌ టెక్నీషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. తమన్నా స్పెషల్‌ సాంగ్‌ ఈ సినిమాకి హైలైట్‌ కానుంది. ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి మ్యూజిక్‌ చేసిన సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. రామ జోగయ్య శాస్త్రి ఈ చిత్రంలో అన్ని పాటల్ని ఒకదాన్ని మంచి మరొకటి అద్భుతంగా వుండేలా రాశారు. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. దసరా కానుకగా అక్టోబర్‌ 6న సినిమా రిలీజ్‌!! ప్రముఖ తారాగణంతో 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా జాగ్వార్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

>సాయేదైవం పాటలు విడుదల

 విజయచందర్ బాబాగా నటించిన సాయేదైవం చిత్రం పాటల విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు చిత్ర ప్రముఖులు పాల్గోన్న ఈ ఆడియో వేడుకల సాయేదైవం పాటలను సైతం ప్రదర్శించారు. సాయేదైవం చిత్రంల విజయచందర్, సుమన్, సాయిప్రకాష్, కోట, రావు రమేష్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మినటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఘటికాచలం, సాహిత్యం బిక్కీకృష్ణ, నిర్మాత పోనుగటి భవాని అర్జున్ రావు, కథ, దర్శకత్వం జి.ఎల్ . బి. శ్రీనివాస్.

>చివ‌రిషెడ్యూల్ లో నిఖిల్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అక్టోబ‌ర్ లో విడుద‌ల‌ 

 స్వామిరారా, కార్తికేయ, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.  ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా  21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో అట్ట‌క‌త్తి, ముందాసిప‌త్తి, ఎధిర్ నీచ‌ల్ లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెద‌టిలుక్ కి విప‌రీత‌మైన స్పంద‌న రావ‌టం తెలిసిన విష‌య‌మే. చూసిన ప్ర‌తిఓక్క‌రూ టైటిల్ చాలా వినూత్నంగా వుంద‌ని సోష‌ల్ మీడియాలో వారి స్పంద‌న‌లు తెలిపారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని  టైగ‌ర్ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు.  మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చిక్‌మంగ్‌లూర్ లో చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 12 నాటికి టోట‌ల్ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.  ఈ సంధర్బం గా నిర్మాత‌లు మాట్లాడుతూ మా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో విజ‌యాల్ని సోంతంం చేసుకున్న నిఖిల్‌ హీరోగా, స‌క్స‌స్‌ఫుల్ బ్యూటీస్‌ హెబాప‌టేల్, నందిత శ్వేత ల కాంబినేష‌న్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మాచిత్రం ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా నిర్మిస్తున్నాము. టైగ‌ర్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రం త‌రువాత  మా ద‌ర్శ‌కుడు ఆనంద్ చాలా కొత్త గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్  మా హీరో నిఖిల్ భ‌ర్త‌డే కి గిఫ్ట్ గా విడుద‌ల చేశాము. సినిమా ఇండ‌స్ట్రి నుండే  కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి అప్లాజ్ రావ‌టం అంతేకాకుండా ట్రేడ్ బిజినెస్ వ‌ర్గాల్లో క్రేజ్ వ‌చ్చింది. ట్రెండ్ లో వుంటూనే ఎంట‌ర్‌టైనింగ్ చేయ‌టంలో  మా హీరో నిఖిల్‌, ద‌ర్శ‌క‌డు ఆనంద్ సిద్ధ‌హ‌స్తులే అని మ‌రోక్క‌సారి ఈ చిత్రం ప్రూవ్ చేస్తుంది. ఇప్పిటికే ఈ సినిమా టైటిల్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వుతుండ‌టం చాలా హ్య‌పిగా వుంది.  త్వ‌ర‌లో శేఖ‌ర్ చంద్ర అందించిన‌ ఆడియో ని విడ‌ద‌ల చేస్తాము. ఈనెల 12కి చిత్రం టాకీ కంప్లీట్ చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తాము. తెల‌గు ప్రేక్ష‌కులంద‌రికి వినాయ‌క చ‌వ‌తి శుభాకాంక్ష‌లు అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ