Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (8-9-16)..!

Fri 09th Sep 2016 03:19 PM
nithiin new movie opening,hanu raghavapudi,anil sunkara,14 reels entertainment,majnu,majnu release date,nani,dora,nayanthara,malkapuram sivakumar,tollywood tazaa updates,tollywood tajaa updates,september 8th  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (8-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (8-9-16)..!
Advertisement
Ads by CJ
>1. నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం 

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'అఆ' వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత యూత్‌స్టార్‌ నితిన్‌ చేస్తున్న మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ప్రముఖ నిర్మాత, హీరో నితిన్‌ తండ్రి ఎన్‌.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. హీరో నితిన్‌, చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని దర్శకుడు హను రాఘవపూడికి అందించారు. నవంబర్‌ ద్వితీయార్థంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ ప్రారంభంలో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ - ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. నితిన్‌తో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. అందర్నీ ఆకట్టుకునే చక్కని ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో 'కృష్ణగాడి వీరప్రేమగాథ' తర్వాత చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.. అన్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి. 

>2. నయనతార కొత్త చిత్రం 'డోర'

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో  ఓ హారర్ చిత్రం తెరకెక్కుతోంది. దాసు రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'డోర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు.  తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి 'డోర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  

ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ  ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది.  ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.  నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని  రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్. 

>3. సెప్టెంబర్‌ 23న నేచురల్‌ స్టార్‌ నాని 'మజ్ను' 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ - ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. గోపిసుందర్‌ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నాని కెరీర్‌లో 'మజ్ను' మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న విడుదల చెయ్యడానికి ప్లానింగ్‌ జరుగుతోంది.. అన్నారు. 

నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకత్వం: విరించి వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ