Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (11-9-16)..!

Mon 12th Sep 2016 06:44 PM
abhinetri trailer launch matter,lachhi trailer launch,mohan babu 40 years,lakkunnodu movie opening  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (11-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (11-9-16)..!
Advertisement
Ads by CJ

 మోహన్ బాబు 40 నట వసంతాల వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు...

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు  అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న కలకాలం గుర్తుండి పోయేలా భారీ సెట్ వేసి టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మొదటిది మోహన్ బాబు సినిమాల్లోని బెస్ట్ 60 సాంగ్స్ ఉన్న సీడీని విడుదల చేయడం. సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుమాట రాసిన బెస్ట్ సీన్స్ ఆఫ్ పెదరాయుడు పుస్తకాన్ని విడుదల చేస్తారు. చివరిగా మోహన్ బాబు వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోతో కూడిన బుక్ ను విడుదల చేస్తారు.

  'అభినేత్రి' థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ 

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ప్రభుదేవా, డైరెక్టర్‌ విజయ్‌, చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ విడుదలైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు క్లాప్ తో ప్రారంభమైన విష్ణు మంచు `లక్కున్నోడు`

`ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా `లక్కున్నోడు` చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్ ను దర్శకుడికి అందించి, యూనిట్ సభ్యులను అభినందించారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ....

చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం మంచు మోహన్ బాబుగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఆయన మా టీంకు ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. గీతాంజలి, త్రిపుర వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా లక్కున్నోడు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను డైమండ్ రత్నబాబు అందిస్తున్నారు. ఈరోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాంఅన్నారు.

 'వెన్నెల' ఫేం జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' చిత్రం టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం

ప్ర‌వైట్ ఛాన‌ల్ లో వెన్నెల అనే పోగ్రాం నుండి ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. జ్ 9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. హ‌ర్ర‌ర్ కామెడి లో ఒ కొత్త జోన‌ర్ ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం ఆడ‌యో ని అతిత్వ‌ర‌లో సినిప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ల‌చ్చి చిత్రానికి సంబందించి మెద‌టి లుక్ టీజ‌ర్ ని ఈరోజు తెలంగాణా  అధికార ప్ర‌తినిధి ఎస్‌.వేణుగోపాలా చారి గారి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్న‌ధ్ చేతుల మీదుగా ఈ చిత్రం మెద‌టి లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ గారు మాట్లాడుతూ.. ఇప్ప‌డే ల‌చ్చి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని లాంచ్ చేశాను. అలాగే టీజ‌ర్ ని చూశాను. చాలా బాగుంది. జ‌య‌తి న‌టిస్తూ నిర్మిస్తున్న ల‌చ్చి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. అన్నారు

ఎస్‌.వేణుగోపాలా చారి మాట్లాడుతూ... తెలంగాణా ఊర్ల‌లో ల‌చ్చి అని పిల‌వ‌టం అల‌వాటు.. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా పిలుస్తారు. అలాంటి నానుడి వున్న టైటిల్ ని పెట్టినందుకు జ‌య‌తి ని అభినందించాలి. ఆ టీజ‌ర్ ని నా చేతుల‌మీదుగా విడుద‌ల చేసే ఛాన్స్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రంలో న‌టించిన వారంద‌రి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్రం అంద‌రిని పెళ్ళిచూపులు చిత్రం మాదిరిగా అల‌రిస్తుంద‌ని ఆశిస్తున్నాను. అని అన్నారు

ఈసంద‌ర్బంగా నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రోడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చెపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ పాత్ర‌లో న‌టించాను. హ‌ర్ర‌ర్ కామెడి జోన‌ర్ లో కొత్త జోన‌ర్ లో ఈ చిత్రాన్ని చేశాము. మా చిత్రానికి ల‌చ్చి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ అంద‌రూ ఈచిత్రంలో న‌టించారు. అంద‌రూ న‌వ్వించారుకూడా.. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.ర‌ఘు తో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈచిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా అందించారు. మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము. మా చిత్రం యోక్క మెద‌టి లుక్ టీజ‌ర్ ని లాంచ్ కి వ‌చ్చేసిన వేణుగోపాలా చారి గారికి మా ధ‌న్య‌వాదాలు, అలానే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరిజ‌గన్నాధ్ గారికి ప్ర‌త్యేఖ‌మైన ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము.  అతి త్వ‌ర‌లో సురేష్ యువ‌న్ అందించిన ఆడియో ని విడుద‌ల చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.

మ‌రో క‌థానాయిక తేజ‌శ్విని మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకు డెబ్యు, ద‌ర్శ‌క‌డు ఈశ్వ‌ర్ గారు చాలా ఇష్ట‌ప‌డి ప్ర‌తి పాత్ర‌ని మ‌లిచారు. మెయిన్ పాత్ర‌లో చేస్తున్నాను. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు. 

 ఎ.ఆర్‌. మురుగదాస్‌ సోదరుడు దిలీపన్‌-అంజలి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'గోలీసోడా' 

దిలీపన్‌, అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్‌. మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో ఎ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన చిత్రం వత్తికుచ్చి. తమిళ్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి 'గోలీసోడా' పేరుతో తెలుగులో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనెలలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరి!!

నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి మాట్లాడుతూ - ఎ.ఆర్‌. మురుగదాస్‌ శిష్యుడు కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో మురుగదాస్‌ సోదరుడు దిలీపన్‌ని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ మురుగదాస్‌ తమిళంలో నిర్మించిన వత్తికుచ్చి చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రంలో దిలీపన్‌ అద్భుతంగా నటించాడు. అలాగే అంజలి డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మ్‌ ప్రదర్శించింది. యువ సంచలన సంగీత దర్శకుడు జిబ్రాన్‌ అందించిన సంగీతం సూపర్‌హిట్‌ అయ్యింది. యూత్‌, లవ్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని నేచురాలిటీకి దగ్గరగా ఈ చిత్రం వుంటుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలూ ఈ చిత్రంలో వున్నాయి. డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసి, సెప్టెంబర్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ