డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ - ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అతి త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, అక్టోబర్ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. క్లాస్‌ని, మాస్‌ని అలరించే ఈ చిత్రం ఆడియన్స్‌ని థ్రిల్ చేసే ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సునీల్ కెరీర్‌కి, మా బేనర్‌కి 'ఈడు గోల్డ్ ఎహే' మరో సూపర్‌హిట్ చిత్రమవుతుంది... అన్నారు.
డాన్సింగ్ స్టార్ సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్ ఇస్సార్, డా|| నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, భరత్, అనంత్, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్ అక్షిత్, నల్లవేణు, గిరిధర్, సుదర్శన్, విజయ్, జోష్ రవి, పి.డి.రాజు, పవన్, గణేష్, కోటేశ్వరరావు, జగన్, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.
>2. డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయల పురస్కారం>తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 2016 సంవత్సరానికిగాను శ్రీ కృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానం కనులపండువగా జరిగింది. డైలాగ్‌కింగ్ సాయికుమార్, ప్రముఖ సాహితీవేత్త, డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ నటి జయప్రద, కన్నడ సాహితీ దిగ్గజం డా|| బరగూరు రామచంద్రప్పలకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రదానం చేసి అభినందించారు.
పురస్కారాలు అందుకున్న తర్వాత డా. యార్లగడ్డ మాట్లాడుతూ - తెలుగోడి గొప్పదనాన్ని కవితారూపంలో అభివర్ణించారు. కర్ణాటకాంధ్ర మహాప్రభు రాయల పేరిట పురస్కారాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. మా ఆదికవి నన్నయ్య కన్నడిగుడు. మీ హంపా మా తెలుగువాడు అంటూ ఆయన సభికులనుద్దేశించి అన్నారు. కర్ణాటకలో భాషా అల్ప సంఖ్యాకులుగా ఉన్న తెలుగు ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డా. జయప్రద తెలుగు, కన్నడ భాషలను మిళితం చేసి ప్రసంగించారు. మరో జన్మంటూ ఉంటే కళాకారిణిగానే పుడతానన్నారు. తాను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినా కర్ణాటక మెట్టినిల్లు అన్నారు. కన్నడ సాహితీదిగ్గజం డా. బరగూరు రామచంద్రప్ప మాట్లాడుతూ - సమాఖ్య వ్యవస్థలో అన్ని భాషల ప్రజలు సామరస్యంగా ఎలా జీవించాలో తెలుగు, కన్నడిగులు చాటి చెబుతున్నారంటూ ప్రశంసించారు. దేశం మొత్తానికి ఇది ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షించారు. డైలాగ్‌కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ - తన మాతృభాష తెలుగు అయినా జీవన భాష కన్నడ అని గర్వంగా చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల పేరిట తెలుగు, కన్నడ భాషలలో ఓ సీరియల్ నిర్మించాలన్న ఆలోచన ఉందన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డా.ఎ.రాధాకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.కె.జయచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి రమేష్‌కుమార్, కళాబంధు డా. టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
>3. హీరో కళ్యాణ్‌రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా 'అరకు రోడ్ లో' ఆడియో విడుదలరాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అరకు రోడ్ లో'. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను సోమవారం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. బిగ్ సీడీని పూరి జగన్నాథ్, కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను పూరి జగన్నాథ్ విడుదల చేసి తొలి సీడీని కళ్యాణ్‌రామ్ కు అందించారు. పూరి సంగీత్ ద్వారా మార్కెట్లోకి పాటలు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా..పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - అరకురోడ్‌లో థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం టీం పడ్డ కష్టమంతా తెలుస్తుంది. చాలా బావుంది. గడ్డం సాంగ్ బావుంది. అన్నీ సాంగ్స్‌లో ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్ వాసుదేవ్, నిర్మాతలు సహా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్...అన్నారు.
హీరో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ - రాం శంకర్ గత పదేళ్లుగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. హిట్ కోసం ట్రై చేస్తూ ముందడుగు వేయాలని సాయిరాం శంకర్‌కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడ్డం తెల్లబడిపోతుందనే సాంగ్‌ను రాంశంకర్ ఎప్పుడో చూపించాడు. చూడగానే నచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా బావుంది. ఈ అరకు రోడ్‌లో సినిమా రాంశంకర్ కు మంచి బ్రేక్ తెస్తుందని భావిస్తున్నాను. దర్శకుడు వాసుదేవ్ చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. నిర్మాతలు సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్.. అన్నారు.
అమలాపురం ఎమ్మెల్యే ఆనంద్‌రావు మాట్లాడుతూ - నిర్మాతలతో మంచి పరిచయం ఉంది. వారి నిర్మాణంలో రానున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్... అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. హీరో రాంశంకర్ గారు, హీరోయిన్ నికిషా పటేల్ సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. రాంశంకర్‌గారి కుమార్తె ఈ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించింది. దర్శకుడు కథ చెప్పగానే బాగా నచ్చింది. ఒక సంవత్సరంగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నాము. రాంశంకర్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్... అన్నారు. చిత్ర దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ - దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చుతుందని భావిస్తున్నాను. సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు... అన్నారు. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి మాట్లాడుతూ - ఇదొక థ్రిల్లర్ మూవీ. నిర్మాతలు, డైరెక్టర్ అందరూ కొత్తవాళ్ళే. అందరూ ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. రాంశంకర్, నికిషా, కమల్ కామరాజు సహా అందరికీ థాంక్స్.. అన్నారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ - మా బాబాయ్ నటించిన సినిమాల్లో ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు. నిఖిషా పటేల్ మాట్లాడుతూ - 'అరకు రోడ్ లో' నా హృదయానికి దగ్గరైన చిత్రం. వాసుదేవ్‌గారు ఎంతో హార్డ్‌వర్క్ తో ఈ సినిమా చేశారు. రాంశంకర్ చాలా టాలెంటెడ్ నటుడు. జగదీష్ చీకటిగారు ప్రతి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. సినిమా బాగా వచ్చింది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్.... అన్నారు.
హీరో రాంశంకర్ మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో భయస్తుడు. అమ్మాయిలను చూస్తే నత్తి వచ్చేస్తుంది. అలాంటి హీరో జీవితంలో జరిగే ఘటనతో జీవితం టర్న్ తీసుకుంటుంది. అదేంటనేది సినిమాలో చూడాల్సిందే. నా క్యారెక్టర్‌ను డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. మంచి సక్సెస్‌ను తెచ్చి పెట్టే సినిమా అవుతుందని భావిస్తున్నాను. సక్సెస్ గురించి దండయాత్ర చేస్తున్నానని ఎవరో రాశారు. ఆ వార్త బాగా నచ్చింది. ఎందుకంటే దండయాత్ర చేయకుంటే తప్పు అవుతుంది. ఈ అరకురోడ్‌లో చిత్రంతో మరోసారి దండయాత్ర చేయబోతున్నాను. ఈ దండయాత్ర సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. వాసుదేవ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. పని రాక్షసుడు. చాలా బాగా కష్టపడ్డాడు. ఆ కష్టంతో మా అందరికీ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. ఓ మంచి డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం కలిగింది. మంచి నిర్మాతలు. జగదీష్ చీకటి మంచి సినిమాటోగ్రాపర్‌గా పేరు తెచ్చుకుంటాడు. మంచి టీంతో పనిచేశాం. ఆదరిస్తారని భావిస్తున్నాం.. అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యన్ రాజేష్, పూరి జగన్నాథ్ శ్రీమతి లావణ్య, రాంశంకర్ శ్రీమతి వనజ ,కమల్ కామరాజు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దీక్షాపంత్, అక్షత, సుప్రియ, సుఫీ సయ్యద్ మొదలగు వారు పాల్గొని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
>4. `పిల్ల రాక్షసి`తో రానున్న `బిచ్చగాడు` నిర్మాతలుశ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందించిన చిత్రం `బిచ్చగాడు`. విన్నూతమైన కంటెంట్‌తో పాటు పబ్లిసిటీ కూడా తోడవడంతో `బిచ్చగాడు` సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. తెలుగులో 25 కోట్లకు పైగా వసూళ్ళను సాధించి ఇటీవల విడుదలైన చిత్రాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా బంపర్ హిట్ కొట్టిన చిత్రమిది.
`బిచ్చగాడు` వంటి బ్లాక్ బస్టర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత చదలవాడ పద్మావతి రీసెంట్‌గా మలయాళలో ఘన విజయం సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` హక్కులను ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్న `బిచ్చగాడు` నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగులో `పిల్ల రాక్షసి అనే పేరుతో విడుదల చేస్తున్నారు. `బిచ్చగాడు` చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన ఆ సినిమా సక్సెస్‌లో భాగమైన రచయిత భాషా శ్రీ మలయాళ చిత్రం `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందిస్తుండటం విశేషం.
ఓ ఫ్రాడ్‌స్టర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నదే సినిమా. దర్శకుడు మిథున్ మాన్యూల్ థామస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రియలిస్టిక్ పంథాలో ఆవిష్కరించారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో పాటు, మ్యాజిక్ ఆద్యంతం రక్తికట్టించేలా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. `ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా, సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది. సన్ని వాయ్‌నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
>5. నవీన్‌చంద్ర, సత్తిబాబు కాంబినేషన్‌లో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం పేరు 'మీలో ఎవరు కోటీశ్వరుడు''అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్'వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ - సత్తిబాబు, నవీన్‌చంద్ర కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశాం. రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఒక పాటను ఈనెలలో అరకులో చిత్రీకరిస్తాం. ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందించే హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది.. అన్నారు.
దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ - ఆడియన్స్ కోరుకునే పూర్తి వినోదం ఈ కథలో వుంది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సహకారంతో సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వస్తోంది. దర్శకుడుగా నాకు ఇది మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. రాధామోహన్‌గారి బ్యానర్‌లో ఈ సినిమా చెయ్యడం హ్యాపీగా వుంది.. అన్నారు.
నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్ డెవలప్‌మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
>6. విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ‘కాల్‌మనీ’ షూటింగ్ పూర్తి!!‘కాల్‌మనీ’ వ్యవహారం ఆమధ్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనలు ఆధారంగా.. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘కాల్‌మనీ’.
కృష్ణుడు, అంజనీకుమార్, సందీప్తి, నామాల మూర్తి ముఖ్య తారాగణంగా మక్కెన్ రంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాల్‌మనీ’ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఓ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఓ డాన్ భరతం-ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ ఎలా పట్టాడన్నది క్లుప్తంగా కథాంశం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించి త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీనివాస్, కెమెరా: వీణ ఆనంద్, సంగీతం: అర్జున్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: మక్కెన్ రంగా.
>7. స్పూర్తి జ్యోతి ఫౌండేషన్ కు రామ్-లక్షణ్ ల ఆర్ధిక సాయం!
టాలీవుడ్ లో సీనియర్ మరియు యువ హీరోలందరితోనూ ఫైట్లు, ఫీట్లు చేయించిన రామ్-లక్ష్మణ్ లు ఇండస్ట్రీకి మాత్రమే కాదు సాధారణ ప్రజలకు సుపరిచితులే. కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి తమకు చేతనైనంతలో తోటివారికి సహాయపడుతూనే వస్తున్న ఈ అన్నదమ్ములు ఈమధ్యకాలంలో ఆ సహాయాన్ని మరింత విస్తృతం చేశారు. తాజాగా.. ఇబ్రాహీంపట్నంలోని అంధ బాలబాలికల సహాయార్ధం మానవీయ ధృక్పధంతో జ్యోతి స్థాపించిన 'స్పూర్తి జ్యోతి ఫౌండేషన్' కు బాసటగా నిలిచారు రామ్-లక్ష్మణ్ లు.
నేడు (సెప్టెంబర్ 13) మద్యాహ్నం ఇబ్రాహీంపట్నంలోని ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ నిర్వహకురాలు జ్యోతికి రామ్-లక్ష్మణ్ లు లక్ష రూపాయల చెక్ ను అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఓ రెండు నెలల క్రితం ఈ దారిలో ఒక షూటింగ్ కు వెళుతుండగా.. మార్గమధ్యంలో ఈ ఫౌండేషన్ బోర్డ్ ను చూడడం జరిగింది. అంధ బాలబాలికలకు సహాయం చేస్తున్నారని తెలిసి వెంటనే ఆఫీస్ కి వెళ్ళి వారిని కలిశాం. వారి ఫౌండేషన్ డెవలప్ మెంట్ కోసం నేడు మా అన్నదమ్ముల తరపున లక్ష రూపాయలు అందజేయడం మాకు మానసిక సంతృప్తిని కలిగిం