Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (14-9-16)..!

Thu 15th Sep 2016 03:22 PM
pichiga nachav poster launch,chetana uttej,jyo achyutananda success meet,red movie release date,manalo okadu audio success meet,sarabha movie,itali,jayammu nischayammu raa,idi pedda saithan,haripriya,tollywood tazaa updates,tollywood tajaa,sep 14  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (14-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (14-9-16)..!
Advertisement
Ads by CJ
>1. ఇది సక్సెస్ మీట్ కాదు గ్రాటిట్యూడ్ మీట్: అవసరాల 

వారాహి చలన చిత్రం బ్యానర్ లో నారారోహిత్, నాగసౌర్య, రెజీనా హీరో హీరోయిన్లుగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జ్యో అచ్యుతానంద. నిర్మాత రజిని కొర్రపాటి. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గతవారం విడుదలై విజయపధంలో దూసుకుపోతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ సందర్భంగా.. కెమరామెన్ వెంకట్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది. ఈ అవకాశం ఇఛ్చిన, ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికి ధన్యవాదాలు..అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ కోడూరి మాట్లాడుతూ.. సినిమా హిట్ అవడానికి, మంచి పేరు తేవడానికి చాలా తేడా ఉంది. నారా రోహిత్ ,నాగ సౌర్య , రెజీనా చాలా బాగా నటించారు. ఇంత పెద్ద విజయం..మాలో ఎంతో స్ఫూర్తిని నింపింది..అని అన్నారు.

రెజీనా మాట్లాడుతూ..ఈ సినిమాని థియేటర్ లో చూశాను.  చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో నా పేరు జ్యోత్స్న. ఆ పేరుకి న్యాయం చేశానని అనుకుంటున్నాను..అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ...ఊహలు గుసగుసలాడే సినిమా చేసి రెండు సంత్సరాలు అయినా అందరూ గుర్తు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం. ఇందులో హీరో, హీరోయిన్స్ ఎపుడు చేయని క్యారెక్టర్స్ చేసారు. రిలీజ్ అయినా మొదటి రోజే మంచి ట్వీట్స్ వచ్చాయి. ఇంత పెద్ద సక్సెస్ ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకు ఋణపడి వుంటాను. ఈ సక్సెస్ తో నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. ఇది సక్సెస్ మీట్ కాదు గ్రాటిట్యూడ్ మీట్ ..అని అన్నారు .

>2. శర్వానంద్ చే  ఉత్తేజ్ డాటర్ చేతన ఫస్ట్ లుక్ రిలీజ్ 

'కుక్కకావాలి' అంటూ 'చిత్రం' సినిమాలో , 'నీ పేరేంటి' అంటూ 'బద్రి' సినిమాలో పవన్ కళ్యాణ్ ను క్వశ్చన్ చేసిన చైల్డ్ ఆర్టిస్ మరియు కామెడీ ఆర్టిస్ ఉత్తేజ్  కూతురయిన చేతన  హీరోయిన్ గా వస్తున్న ఫస్ట్ మువీ  'పిచ్చిగా నచ్చావ్'. శ్రీవత్స క్రియేషన్స్ బ్యానరుపై వస్తున్న సినిమాను కమల్ కుమార్ పెండెం , శశిభూషణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. సినిమాలో చేతన ఫస్ట్ లుక్ ను హీరో శర్వానంద్ ఫిలిం సిటీలో రిలీజ్ చేశారు. పోస్టర్ డిజైన్ బాగుందంటూ , చైల్డ్ ఆర్టిస్ట్ గా చేతన చేసిన సినిమాలు  ఎంత పెద్ద హిట్ అయ్యాయో, హీరోయిన్ గా చేస్తున్న 'పిచ్చిగా నచ్చావ్' సినిమా అంతకంటే బిగ్ హిట్ అవ్వాలని చేతనకు మరియు ఎంటైర్ యూనిట్ కు  శర్వానంద్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. చేతన మాట్లాడుతూ  చైల్డ్ ఆర్టిస్ గా రామోజీరావు గారి 'చిత్రం' సినిమాలో  పరిచయమైన తను, హీరోయిన్ గా చేస్తున్న ఫస్ట్ సినిమా 'పిచ్చిగా నచ్చావ్' లోని తన ఫస్ట్ లుక్ రామోజీ రావు గారి ఫిలిం సిటీలో రిలీజ్ అవ్వడం మంచి సెంటిమెంట్ అంటూ , తన లుక్ రిలీజ్ చేసిన  శర్వానంద్ కు థ్యాంక్స్ చెప్పింది. నిర్మాత   మాట్లాడుతూ అడగ్గానే  చేతన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు  శర్వానంద్ కు ఎంటైర్ యూనిట్ తరుపున థ్యాంక్స్ చెపుతూ , హీరో నాని రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్ కు, మంచు  లక్ష్మీ రిలీజ్ చేసిన  హీరో ఫస్ట్ లుక్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో చేతన ఫస్ట్ లుక్ కు అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు . సినిమా టైటిల్ ఈజ్ తో ఎంత క్యాచీగా వుందో అలానే  సినిమాపై రోజురోజుకు  అంచనాలు పెరుగుతున్నాయని , డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను ఖచ్చితంగా రీచ్ అవ్వుద్దని డైరెక్టరు శశిభూషణ్ చెప్పారు . పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్ పుచ్ఛా రామకృష్ణ , కెమెరా వెంకటాహనుమ ,మ్యుజిక్ రాం నారాయణ్.

>3. ఈ నెల 23న వస్తున్న ఎరోటిక్ సస్పెన్స్‌ థ్రిల్లర్  'రెడ్'

కన్నడలో ఘన విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య..  ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ...'ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన  రాజేష్‌మూర్తి.. ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ..   ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ తో పాటు అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం..' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, పబ్లసిటీ డిజైనర్: వెంకట్.ఎం, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

>4. 19న తిరుప‌తిలో 'మ‌న‌లో ఒక‌డు' ఆడియో స‌క్సెస్ మీట్‌

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ  స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక‌డు' ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌ర‌గ‌నుంది. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. 

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ....మా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డీటీయ‌స్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నెల 19న తిరుప‌తిలో  సంగీత విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హిస్తాం. `మ‌న‌లో ఒక‌డు` మీడియా నేప‌థ్యంలో సాగుతుంది.  కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం.. అని అన్నారు. 

నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ...ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. అందుకే 19న తిరుప‌తిలో ఆడియో స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఈ నెలాఖ‌రున చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం... అని చెప్పారు. సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు  కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు:  చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

>5. ఇటలీకి వెళుతున్న 'శరభ' యూనిట్

ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'శరభ'.  జయప్రద, నెపోలియన్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంట‌సీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమ‌న్ ఏమోష‌న్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డ్యూయెట్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఇటలీ వెళుతుంది. ఈ సందర్భంగా.....చిత్ర చిత్ర నిర్మాతలు  అశ్వ‌ని కుమార్ సహదేవ్, సురేష్ కపాడియా మాట్లాడుతూ - విజువల్ వండర్ గా రూపొందుతోన్న శరభ మూవీ టాకీ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం పాటల  చిత్రీకరణ జరుపబోతున్నాం. భారీ బడ్జెట్ తో , క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ ను ఇటలీలోని రోమ్, నా ప్లెస్ తదితర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం. అందులో భాగంగా సెప్టెంబర్ 25న యూనిట్ ఇటలీ వెళుతుంది. రఘు మాస్టర్ నేతృత్వంలో ఫారెన్ డ్యాన్సర్ తో ఈ పాటను చిత్రీకరిస్తాం. అలాగే స్విజర్లాండ్ లోని ఆల్ఫ్ మౌంటెన్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం... అన్నారు.  

ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, జయప్రద, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి,రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్,ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.

>6. వినాయక మహా నిమజ్జనానికి...'జయమ్ము నిశ్చయమ్మురా.'

'గీతాంజలి' తర్వాత శ్రీనివాస్ రెడ్డి-  'రాజు గారి గది' తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా'. 

తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ... 2013 నేపథ్యంలో- కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కధే 'జయమ్ము నిశ్చయమ్మురా'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత-దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. 

చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ.. 'కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని' అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి.

>7. యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ హర్రర్‌తో వస్తోన్న'ఇది పెద్ద సైతాన్‌' 

విజయ్‌ రాఘవేంద్ర హీరోగా హరిప్రియ హీరోయిన్‌గా ఆదిరామ్‌ దర్శకత్వంలో కన్నడంలో ఎస్‌.రమేష్‌ నిర్మించిన 'రణతంత్ర' చిత్రం సమ్మర్‌లో రిలీజై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి 'ఇది పెద్ద సైతాన్‌' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి చిత్ర విశేషాలను తెలియజేశారు. 

యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ హర్రర్‌!! 

నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి మాట్లాడుతూ - 2016 సమ్మర్‌ కానుకగా కన్నడంలో రిలీజైన 'రణతంత్ర' చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ రొమాంటిక్‌ హర్రర్‌గా రూపొందిన ఈ చిత్రం విజయరాఘవేంద్ర కెరీర్‌లో నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 'ఇది పెద్ద సైతాన్‌' పేరుతో తెలుగులో మా బేనర్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. అచ్చ తెలుగు అమ్మాయి హరిప్రియ హీరోయిన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ చిత్రంతో హరిప్రియ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. దర్శకుడు ఆదిరామ్‌ టేకింగ్‌ ఎక్స్‌లెంట్‌గా వుంది. తెలుగులో వచ్చిన హర్రర్‌ చిత్రాలు చాలా వరకు పెద్ద సక్సెస్‌ అయ్యాయి. అలాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. కంటెంట్‌ బాగుంటే చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. రీసెంట్‌గా 'బిచ్చగాడు' చిత్రం ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో అందరికీ తెల్సిందే. అలాగే ఈ చిత్రంలో కూడా మంచి కంటెంట్‌ వుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బేనర్‌లో 'మహాబలి', 'గోలీసోడా', 'ఇది పెద్ద సైతాన్‌' చిత్రాల్ని రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే తెలుగు స్ట్రెయిట్‌ మూవీని పెద్ద స్టార్‌ కాస్టింగ్‌తో దసరాకి ప్రారంభించడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. వారి సహకారంతో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చే చిత్రాలను మా బేనర్‌లో నిర్మిస్తాం. సెన్సార్‌ పూర్తయిన 'ఇది పెద్ద సైతాన్‌' చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.. అన్నారు. 

విజయ్‌ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ ఎం., నిర్మాత: వెంకట్రావ్‌ మార్టోరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఆదిరామ్‌. ​

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ