Advertisementt

'జాగ్వార్' ఆడియో విశేషాలు

Mon 19th Sep 2016 04:21 PM
jaguar movie,jaguar audio launch,celebrities at jaguar audio launch,deve gowda,kumaraswamy,nikhil kumar,jagapathi babu,brahmanandam  'జాగ్వార్' ఆడియో విశేషాలు
'జాగ్వార్' ఆడియో విశేషాలు
Advertisement
Ads by CJ

                                                      `జాగ్వార్` ఆడియో విడుదల

మాజీ ప్రధాని దేవ‌గౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్. నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషించారు.బాహుబలి, భజరంగి భాయ్‌జాన్‌ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ జాగ్వార్ చిత్రానికి కథ అందించ‌గా, ఎ.మహదేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందించిన  జాగ్వార్ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. బిగ్‌సీడీ, ఆడియో సీడీలను మాజీప్ర‌ధాని దేవగౌడ, కె.టి.ఆర్‌ విడుదల చేశారు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ... చెన్నాంబిక  ఫిలింస్‌ అంటేనే సెన్సేషన్‌. ఈ బ్యానర్‌లో విడుదలైన ప్రతి సినిమా సెన్సేషనల్‌ సక్సెస్‌ను సాధించింది. అనిత మేడమ్‌ నిర్మాతగా పెద్దాయన దేవగౌడగారి ఆశీర్వాదంతో కుమారస్వామిగారు ఆయన తనయుడు నిఖిల్‌ను ఎంత గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుందని వార్తలు రాగానే ఈ సినిమాతో మనకు పోటీ ఎందుకులే అనే విధంగా కొత్త సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే సినిమాకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యానర్‌లో విడుదలై సెన్సేషన్‌ అయిన సినిమాలంటే పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలవాలి. నిఖిల్ ని చూస్తుంటే ఐరన్‌ మ్యాన్‌..!రేసుగుర్రం...అనిపిస్తుంది.  ఈ సినిమాతో తనకు గొప్ప ప్రతిఫలం దక్కాలని, ఈ సంస్థ ఇంకా గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

పి.వి.సింధు మాట్లాడుతూ... ఆడియో వేడుకకు రావడం ఇదే మొదటిసారి. పాటలు బాగున్నాయి.. సినిమా పెద్ద హిట్‌ అయ్యి టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

రఘురామరాజు మాట్లాడుతూ... కుమారస్వామిగారి తెర వెనుక కష్టం, తెరపై నిఖిల్‌ కష్టం మనకు కనపడుతుంది. సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. నిఖిల్‌ కుమార్‌ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు. నిఖిల్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ... జాగ్వార్‌గా నటించిన నిఖిల్‌, కథను అందించిన విజయేంద్రప్రసాద్‌, మ్యూజిక్‌ అందించిన థమన్‌, దర్శకత్వం వహించిన మహదేవ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాలో నేను మంచి పాత్ర పోషించాను. జగపతిబాబుగారు ట్రెండీ విలన్‌గా నటించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. మనోజ్‌ పరమహంస ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించాడు. ఎంతో మంది టీంతో పనిచేసే అవకాశం కలిగింది. నిఖిల్‌ సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ర‌చ‌యిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... కుమారస్వామిగారు నన్ను బెంగళూరుకి పిలిచి నిఖిల్‌ను పరిచయం చేసి తను హీరోగా ఓ కథను రాయమని అన్నారు. ముందు సాధారణంగానే కనపడ్డాడు. అయితే తను చేసిన ఓ యాడ్‌ చూడగానే తనను సానపడితే ఓ వజ్రం అవుతాడనిపించింది. కుమారస్వామిగారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కుమారస్వామి లాంటి తండ్రి ఉండటం నిఖిల్‌కుమార్‌ అదృష్టం. నిఖిల్‌కుమార్‌ చాలా సౌమ్యంగా ఉంటున్నాడు. తన మంచి ప్రవర్తనతోనే తనింకా ఎదుగుతాడు. ఇక దర్శకుడు మహదేవ్‌ నాకు బిడ్డలాంటివాడు. రాజమౌళిని ఎలా చూస్తానో, మహదేవ్‌ను కూడా అలాగే చూస్తాను. తను ఈ సినిమాతో తనెంటో ప్రూవ్‌ చేసుకుంటాడు. ఈ సినిమాతో నిఖిల్‌, మహదేవ్‌లా కెరీర్‌ లాంచ్‌ చేస్తున్నామని భావిస్తున్నాను అన్నారు.

తెలంగాణ ఐటీ మినిష్టర్‌ కె.టి.ఆర్‌ మాట్లాడుతూ... దేవగౌడ, కుమారస్వామిగారితో చాలా మంచి అనుబంధం ఉంది. వారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్న నిఖిల్‌లో చాలా ఫైర్‌ ఉంది. నిఖిల్‌ తన తాతగారు, తండ్రిగారి పేరుని నిలబెడతాడు. భవిష్యత్‌లో తను మంచి హీరోగా ఎదుగుతాడు. తమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను, హీరోలను ఎంకరేజ్‌ చేసే మంచి సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు ఉంది. అలాంటి సంస్కృతితోనే నిఖిల్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం అన్నారు.

హెచ్‌.డి.దేవగౌడ మాట్లాడుతూ... మా నిఖిల్‌ను ఆశీర్వదించడానికి సుబ్బరామిరెడ్డి, కె.టి.ఆర్‌. సహా అందరూ మిత్రులు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. నిఖిల్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో బాగా ట్రయినింగ్‌ తీసుకున్నాడు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా దర్శకుడు మహదేవ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సహా చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌కే చెందుతుంది. సహకారం అందించిన అందరికీ థాంక్స్‌ అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ... దేవగౌడ, కె.టి.ఆర్‌. వంటి అగ్రెసివ్‌ లీడర్స్‌ను కలిశాను. అలాగే నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేసిన సుబ్బరామిరెడ్డిగారికి థాంక్స్‌. ఈ సినిమాతో కుమారస్వామిగారు నాకు మంచి మిత్రుడుగా మారిపోయారు. చాలా మంచి వ్యక్తి. గొప్ప నాయకుడు. సినిమాకు పనిచేసిన దర్శకుడు మహదేవ్‌ నుండి మనోజ్‌ పరమ హంస, థమన్‌ సహా అందరూ ప్రాణం పెట్టి పనిచేయకుండా ప్రాణం పోయేలా పనిచేశారు. నిఖిల్‌ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. మంచి హార్డ్‌వర్కర్‌. టీం అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ...జాగ్వార్‌ సినిమా తెలుగు, కన్నడంలో రూపొందుతోంది. ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. నిఖిల్‌ సహా టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

హీరో నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ... ఈ సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. చాలా ప్యాషన్‌తో సినిమా చేశాం. థమన్‌ వండర్‌ ఫుల్‌ మ్యూజిక్‌ అందించగా, మనోజ్‌ పరమహంస చాలా రిచ్‌గా సినిమాను చూపించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జగపతిబాబు, సంపత్‌, బ్రహ్మానందం సహా మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో  హెచ్‌.డి.కుమారస్వామి, శ్రీమతి అనితా కుమారస్వామి,  తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్‌బాబు, దామోద‌ర ప్ర‌సాద్, పుల్లెల గోపీచంద్‌, పి.వి.సింధు, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ