Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (19-9-16)..!

Tue 20th Sep 2016 03:25 PM
naruda donoruda first look,attarillu movie press meet matter,jayanth c paranji,premabiksha movie matter,deyyalabandi movie matter  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (19-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (19-9-16)..!
Advertisement
Ads by CJ

    కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా న‌రుడా..! డోన‌రుడా! ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..! ఫ‌స్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లోని విల‌క్ష‌ణ‌త వ‌ల్ల ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమాతో ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు. 

గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందించిన ష‌నీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా, క్ష‌ణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ, సాగ‌ర్ రాచ‌కొండ‌ మాట‌లు అందిస్తున్నారు. వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

`రంగం` ఫేమ్ జీవా, కాజల్ కాంబినేషన్ సినిమా హక్కులు సొంతం చేసుకున్న డి.వి.సినీ క్రియేషన్స్

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమిళం లో భారీ  బడ్జెట్ తో  నిర్మిస్తున్న  ఈ చిత్రం తెలుగు హక్కులు  కోసం చాలా మంది అతిరథులు పోటీ పడ్డప్పటికీ డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ ఫ్యాన్సీ ఆఫర్ తో హక్కులను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు చాలా బావుంది. మంచి స్పందన వచ్చింది. దాంతో తెలుగులో సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. త్వరలోనే తెలుగు టైటిల్ ను అనౌన్స్ చేస్తాం.  ప్రస్తుతం  నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం అన్నారు.  

 

     జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఉగ్రం' 

ప్రేమించుకుందాం.. రా, బావగారూ బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌, లక్ష్మీనరసింహా, శంకర్‌దాదా యంబిబియస్‌, తీన్‌మార్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి. పరాన్జీ ప్రస్తుతం రవి గంటా హీరోగా 'కాళహస్తి' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'ఉగ్రం' పేరుతో ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు. ఇషాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించే ఈ చిత్రం ద్వారా నీలేష్‌ ఈటి హీరోగా, ఇజబెల్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ తెలియజేస్తూ -'ఈ చిత్రం ద్వారా నీలేష్‌ ఈటి హీరోగా, ప్రముఖ మోడల్‌ ఇజబెల్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ముంబాయి అండర్‌ వరల్డ్‌, ఒక తెలుగు పోలీస్‌ ఆఫీసర్‌ మధ్య జరిగే హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రంలో వెల్‌ఫేర్‌ సెంటర్‌లో వర్క్‌ చేసే ఎన్‌ఆర్‌ఐ క్యారెక్టర్‌లో ఇజబెల్‌ నటిస్తుంది. నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం ముంబాయిలోనూ, మిగతా హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం' అన్నారు. 

 

          ఈ నెల‌ 23న ‘దెయ్యాల‌బండి’ వస్తోంది!

గతంలో 5కల‌ర్స్‌ మల్టీమీడియా మూవీ పతాకంపై ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాల‌ను నిర్మించారు శ్రీనివాస్‌ దామెర. తాజాగా 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘హౌల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాల‌బండి’ పేరుతో విడుద చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల‌ 23న ఇండియా వైడ్‌గా విడుదల‌వుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర మాట్లాడుతూ... ‘ఒక సిటీ నుంచి బయు దేరిన ప్యాసింజర్స్‌ ట్రైన్‌ హెవీ రైన్‌ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో ఆ ట్రైన్‌ లోకి వింత వింత ఆకారాతో, హాహాకారాలు  చేస్తూ కొన్ని దెయ్యాలు ఆ ట్రైనులోకి ఎంటరై  అందులోని ప్యాసింజర్స్‌ని ఏ విధంగా చంపాయి?  ఏంటి? అన్నది సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్‌ ఫిలిం. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈ నె 23న ఇండియా వైడ్‌గా విడుద చేస్తున్నాం’ అన్నారు. 

 

              `అత్తారిల్లు` స‌క్సెస్ మీట్!

 అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  అంజన్ కె. కళ్యాణ్  స్వీయ‌ దర్శకత్వంలో నిర్మించిన  చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా  ఈ రోజు హైదరాబాద్ లోని ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో  చిత్ర దర్శక నిర్మాత అంజన్ కె. కళ్యాణ్‌ మాట్లాడుతూ...న్యూ టాలెంట్ ని చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచేయాల‌ని కొత్త‌వాళ్లంద‌రం క‌లిసి చేసిన ప్ర‌య‌త్నం `అత్తారిల్లు`. ఈ శుక్ర‌వారం విడుద‌ల చేశాము. విడుద‌లైన అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ బాగుంది. చూసిన చాలా మంది వారికి న‌చ్చిన సీన్స్ గురించి నాతో డిష్క‌స్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటూ ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక నిన్న‌టి నుంచి నాకు చాలా బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. బ్రాహ్మ‌ణుల‌ను కించ‌పరిచే విధంగా ఒక పాత్రను పెట్టారు. వెంట‌నే వాటిని తొలిగించండని. కానీ వాళ్లంద‌రికీ మీడియా ద్వారా నేను చెప్ప‌ద‌ల‌చుకున్నది ఏంటంటే...ఎక్క‌డా బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచే విధమైన సంభాష‌ణ‌లు కానీ ..సీన్స్ కానీ చేయ‌లేదు. మీరు పాజిటివ్ వేలో చూస్తే బ్రాహ్మ‌ణుల గురించి మంచిగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. కాబ‌ట్టి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చూడాల‌ని కోర‌కుంటున్నా. నిజంగా వారిని కించ ప‌రిచే విధమైన స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఉంటే సెన్సార్ వారు అభ్య‌త‌రం చెప్పే వాళ్లు క‌దా. మ‌రి కొంత మంది ఎందుకిలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారో అర్థం కావ‌ట్లేదు. ఏది ఏమైనా మేము అనుకున్న‌దానిక‌న్నా మా సినిమాకు మంచి రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

న‌టుడు రాజేందర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో బాల‌రాజు అనే పాత్ర‌లో విల‌న్ గా న‌టించా. నా పాత్ర బావుందంటూ చాలా మంచి కాంప్లిమెంట్స్ ల‌భిస్తున్నాయి. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అన్నారు.

న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్ జోజో మాట్లాడుతూ...కొరియోగ్ర‌ఫీతో పాటు ఈ సినిమాలో మంచి క్యార‌క్ట‌ర్ చేసే అవ‌కాశం క‌ల్పించిన క‌ళ్యాణ్ గారికి ఋణ‌ప‌డి ఉంటా అన్నారు.

ఎక్కాల వినోద్ కుమార్ మాట్లాడుతూ..అత్తారిల్లు చిత్రంలో ఎమ్మెల్యే గా న‌టించా. నా పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా ఇప్పుడొస్తున్న హ‌ర్ర‌ర్ సినిమాల్లా కాకుండా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌న్నారు.

నండూరి రాము మాట్లాడుతూ..భ‌ట్ల సురేష్ గా సినిమాలో నిర్మాత‌గా న‌టించా. నా డైలాగ్స్ కు థియేట‌ర్స్ లో క్లాప్స్ వ‌స్తున్నాయి. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత క‌ళ్యాణ్ గారికి థ్యాంక్స్  అన్నారు.

న‌టుడు రాకేష్ మాట్లాడుతూ...ఈ సినిమాలో కృష్ణ‌మూర్తి అనే పాత్ర‌లో న‌టించాన‌న్నారు.

హీరో సాయి ర‌వి కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమాలో హీరోగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన క‌ళ్యాన్ గార‌కి థ్యాంక్స్. నేను అనుకున్న‌దానికంటే సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. చూసిన వారంద‌రూ చాలా బాగా చేశాంటూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇంకా పెద్ద హిట్ చేస్తార‌ని కోర‌కుంటున్నాఅన్నారు.

హీరోయిన్ అతిథిదాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ ఇచ్చిన క‌ళ్యాన్ గార‌కి థ్యాంక్స్. నా క్యార‌క్ట‌ర్ చాలా బావుందంటున్నారు. మీ అంద‌రి స‌పోర్ట్ కావాల‌న్నారు.

 

               సాంగ్స్‌ రికార్డింగ్‌లో 'ప్రేమభిక్ష' 

ఓం శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో సాంగ్స్‌ కంపోజింగ్‌ జరుగుతుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. 'ప్రేమభిక్ష' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెల 19 నుండి షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి 75 శాతం షూటింగ్‌ అనంతపురం జిల్లా భద్రపట్నంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సారథ్యంలో అమూల్య స్టూడియోలో సాంగ్స్‌ కంపోజింగ్‌ జరుగుతున్నాయి. ప్రముఖ సింగర్స్‌ ధనుంజయ్‌, సునీల్‌ కశ్యప్‌, హేమచంద్రలు ఈ సాంగ్స్‌ రికార్డింగ్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనిల్‌, శృతిలయలు హీరో హీరోయిన్‌లుగా నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులందరూ నటించనున్నారు...అని అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ