Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (24-9-16)..!

Sun 25th Sep 2016 04:36 PM
hyper trailer response,jaguar special song,tanu vachenanta team vijayawada,2 states telugu remake,undha ledha talkie complete,rap rock shakil,tollywood tazaa updates,tollywood tajaa updates,24th september  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (24-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (24-9-16)..!
Advertisement
Ads by CJ
>1. 'హైపర్‌' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్ ...సెప్టెంబ‌ర్ 30న వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లై ఆడియెన్స్ నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ ను రాబ‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా....నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - జిబ్రాన్ సంగీతం అందించిన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 30న ద‌స‌రా కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం..అన్నారు. 

>2. `జాగ్వార్‌`లో హీరో నిఖిల్‌కుమార్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాల స్పెష‌ల్ సాంగ్ పూర్తి...అక్టోబ‌ర్ 6న గ్రాండ్ రిలీజ్‌

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జాగ్వార్‌`. స్టార్ కాస్ట్ అండ్ క్రూ,  75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీసెట్‌లో హీరో నిఖిల్‌కుమార్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాల‌పై ఈ స్పెష‌ల్‌సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ స్పెష‌ల్ సాంగ్ సినిమాలో మ‌రో హైలైట్‌గా నిల‌వ‌నుంది. ఈ సాంగ్‌ను చిత్రీక‌రించ‌డంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా 'జాగ్వార్‌' చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

>3. విజయవాడలో అచ్యుత ఆర్ట్స్‌'తను.. వచ్చేనంట..'

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్‌, ధన్యబాలకృష్ణన్‌, చలాకి చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను.. వచ్చేనంట'. అచ్యుత ఆర్ట్స్‌  పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ కాచర్ల దర్శత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ..మా  చిత్ర ప్రమోషన్ నిమిత్తం రేష్మి గౌతమ్, తేజ కాకుమాను, చలాకి చంటిలు విజయవాడ లోని విజయవాడ సిద్దార్ధ కాలేజీ, ఎస్ ఆర్.కె. కాలేజీ, మాంటిసోరి కాలేజీ మరియు ఖాన్ సాబ్ రెస్టారెంట్ లలో హల్చల్ చేసారు. ఈ సందర్భంగా పులువురు విద్యార్థులు, పబ్లిక్ మా చిత్ర యూనిట్ తో  ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మొదటిసారిగా వస్తున్న జామెడీ గురించి చాలామంది ఉత్సాహంగా అడిగారు. జామెడీ కాన్సెప్ట్ గురించి ఇంతగా జనాల్లోకి వెళ్లినందుకు మాకు చాలా ఆనందంగా వుంది.  మా హీరో తేజ కాకుమాను విజయవాడ వాడే కావడంతో జనాల్లో అతనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది జనాలు మీ చిత్రం ట్రైలర్ చూసాము, సాంగ్స్ విన్నాము చాల బాగున్నాయి అని చెప్తున్నారు. ఈ రెస్పాన్స్ చూస్తే మేము సగం విజయం సాధించాం అనిపిస్తుంది. అదే విధంగా మా చిత్ర యూనిట్ వైజాగ్ కూడా ప్రమోషన్ నిమిత్తం వెళ్తున్నాము. ఈ చిత్రాన్ని ఈ నెల ఆఖరికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మొదటినుంచి మా చిత్రాన్ని జనాలకి బాగా చేరువ చేసిన అల్ మీడియా వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాము..అని అన్నారు. 

>4. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ అందుకున్న 'ర్యాప్ రాక్ షకీల్'

ఇటీవల మయూరి ఆర్ట్స్, స్వర్ణ భారతి ఫౌండేషన్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ర్యాప్ రాక్ షకీల్ 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే' ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నాడు. 'రణం 2' చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ర్యాప్ రాక్ షకీల్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకేలుతున్నాడు. 'రణం 2, మనసంతా నువ్వే 2016, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే, శ్రీకాంత్ రాబోయే చిత్రం రా.. రా.., ఘోస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' చిత్రాలు కూడా చేస్తున్నాడు.  ఇప్పటికే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే సినిమా పాటలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. షకీల్ ప్రస్తుతం 3 తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా, ఒక తమిళ్ సినిమాకు సంగీతాన్ని అందించే పనిలో ఉన్నాడు. 

>5. అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో వెంకట్‌ కుంచెమ్‌ దర్శకత్వంలో ‘2 స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌

ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘టు స్టేట్స్‌’ (2014) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది’ అని విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గీయులు ప్రశంసించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ కానుంది. కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి.  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్‌ కుంచెమ్‌.. వినాయక్‌ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్‌ హక్కులు దక్కించుకున్నారు. విశేషం ఏంటంటే.. హిందీ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ధర్మ ప్రొడక్షన్స్‌ ఇప్పటివరకూ తమ సంస్థ నిర్మించిన ఏ చిత్రం రీమేక్‌ హక్కులను దక్షిణాదికి ఇవ్వలేదు. తొలిసారి  ఈ సంస్థ రీమేక్‌ హక్కులను అమ్మిన చిత్రం ‘2 స్టేట్స్‌’.

పంపిణీ రంగంలో పలు విజయాలు చూసిన అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్న అభిషేక్‌ దృష్టికి వెంకట్‌ కుంచెమ్‌ ఈ ‘2 స్టేట్స్‌’ని తీసుకెళ్లారు. మంచి కథాంశంతో రూపొందించిన చిత్రం కావడం, హిందీలో ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి  అభిషేక్‌  ముందుకొచ్చారు.  అతి త్వరలో నటీనటుల వివరాలు, మిగతా విషయాలు తెలియజేస్తానని చిత్ర నిర్మాత అభిషేక్‌ నామా తెలిపారు.

>6. టాకీ పూర్తిచేసుకున్న 'ఉందా.. లేదా..?' చిత్రం

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌  దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  మూవీ  ‘ఉందా..లేదా?’. తాజాగా విజయవాడలో జరిగిన షెడ్యూల్  తో టాకీ పూర్తిచేసుకుంది.. ఈ సందర్భంగా ..దర్శకుడు అమనిగంటి వెంకట శివప్రసాద్‌ మాట్లాడుతూ : సస్పెన్స్ థ్రిల్లర్ జోన‌ర్‌లో రూపోందుతున్న మా చిత్రం సక్సెస్ ఫుల్ గా  టాకీ పూర్తిచేసుకుందని అన్నారు...విజయవాడలో జరిగిన  షెడ్యూల్ లో  కామెడీ సన్నివేశాలను ,హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను నిమ్రకాలేజ్ లో,ప్రకాశం బ్యారేజ్ వద్ద చిత్రీకరించినట్లు తెలిపారు.

నిర్మాత అయితం ఎస్.కమల్ మాట్లాడుతూ : ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందిలేకుండా షూటింగ్ పూర్తిచేసుకున్నామని అన్నారు..సీనియర్ ఆర్టిస్ట్ లు జీవా ,రామ్ జగన్  ,ఝూన్సీ,  సాయి  బాగా సపోర్ట్ చేశారని అన్నారు....టెక్నిషన్స్  సపోర్ట్ తో ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నామని  తెలిపారు. బ్యాలెన్స్ ఉన్న రెండు సాంగ్స్ ను పూర్తిచేసి పోస్ట్ ప్రోడక్షన్ కు వెళ్లనున్నట్లు తెలిపారు..అక్టోబర్ లో ఆడియోని విడుదల చేయనున్నట్లు తెలిపారు...

ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె బంగారి, పాటలు నాగరాజు ,మ్యూజిక్: శ్రీమురళి, కొరియోగ్రాఫర్: నందు జెన్నా, విఎఫ్ఎక్స్: మణికాంత్ -సాగర్, నిర్మాత :అయితం ఎస్.కమల్,కథ-దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ