డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఆ వివరాలను నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేస్తూ - ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే నాలుగు పట్టణాల్లో విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సునీల్ కెరీర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్‌కి మరో మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం..అన్నారు.
>2. అక్టోబర్ 7న విడుదలవుతున్న 'ఎం.ఎస్.జి- ది వారియర్ లయన్ హార్ట్''మెసెంజర్ ఆఫ్ గాడ్'(ఎం.ఎస్.జి), 'ఎం.ఎస్.జి 2' సినిమా సక్సెస్‌ల తర్వాత గుర్‌మీట్ రామ్ రహీం సింగ్ జీ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'ఎం.ఎస్.జి- ది వారియర్ లయన్ హార్ట్'. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ భాషల్లో సినిమా అక్టోబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
గుర్‌మీట్ రామ్ రహీం సింగ్ జీ మాట్లాడుతూ - నేను సినిమాల్లో రావడానికి ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు. యాక్టింగ్ చేయడానికి నేరుగా సెట్‌కు వచ్చేసేవాడిని. షాట్ పూర్తి కాగానే ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్ అన్నీ విభాగాల్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ఇది సాధారణ వ్యక్తి వల్ల అయ్యే పనికాదు. కానీ నేను ఐదేళ్ళ వయసు నుండి గురు మంత్రం చేస్తుండటం వల్ల నాకు ఇవన్నీ సాధ్యమయ్యాయి. 2010లో విరాట్ కోహ్లి, నెహ్రా, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా సహా కొంత మంది ఆటగాళ్లు నన్ను కలిసి మేం 30-40 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయిపోతున్నానని, ఏం చేయాలో చెప్పమని సలహా అడిగారు. నేను కొన్ని సలహాలు చెప్పడంతో వారి ఆట మెరుగయ్యింది. కోహ్లి ఇప్పుడు ఇండియన్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను హైదరాబాద్‌కు తొలిసారి వచ్చాను. సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మనం చెప్పే విషయాన్ని యూత్ కరెక్ట్‌గా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకనే నేను చెప్పాలనుకున్న విషయాలను సినిమాల ద్వారా చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ సినిమాలో నేను గురువులాగా కాకుండా ఒక యోధుడు పాత్రలో కనపడతాను. సినిమాలో మన సంస్కృతిని తెలియజేసే విధంగా ఈసినిమాలో పాట కూడా ఉంది. ఏ యువకుడైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, రైతులు ఆత్మహత్యలు నివారణ గురించి, మూఢ నమ్మకాల గురించి ఈ సినిమాలో తెలియజేస్తున్నాం. నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాను 76 కోట్లతో నిర్మించారు. నేను చిన్నప్పట్నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. 32 ఇంటర్నేషనల్ గేమ్స్ గురించి తెలుసు. వాటిని ఆడటంలో కూడా నేను నిష్ణాతుడను. ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇస్తుంటాను. సామాజిక సేవలో భాగంగా డ్రగ్స్‌కు బానిసలుగా మారిన ఆరుకోట్ల మందిని ఆ మహమ్మారి నుండి కాపాడాను. ఇలాంటి వారికి ఉచితంగా చికిత్స చేస్తాం. ఈ సినిమాలో హింస గురించి నేను చెప్పడం లేదు. అయితే శ్రీరాముడు, కృష్ణుడు, విశ్వామిత్రుడు, పరుశురాముడు వంటి దేవతలు, మునులు కూడా అవసరం వచ్చినప్పుడు దుష్టులను సంహరించారు. ఈ సినిమాలో ఎలియన్స్‌తో జరిపే పోరాటం ఉంటుంది. దాని కోసమే నేను చేసే పోరాటం సినిమాలో ఉంటుంది. నేను ఎం.ఎస్.జి సినిమాను విడుదల చేస్తున్నప్పుడు సెన్సార్ కార్యక్రమంలో సమస్యలు వచ్చాయి. అయితే సినిమాలో ఎటువంటి తప్పు లేదు. చివరకు అది వారు తెలుసుకున్నారు. సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా విషయంలో కూడా సెన్సార్ సమస్యలేవీ ఎదురుకాలేదు. అన్నీ ధర్మాలకు, వేదాలకు సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాను. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. వి.ఎఫ్.ఎక్స్ పనులు జరుగుతున్నాయి వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.. అన్నారు.
>3. 'ప్రేమమ్' పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్ ,మడొన్నా సెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది.
మలయాళంలో ఉస్తాద్ హోటల్, బెంగళూర్ డేస్ వంటి చిత్రాలతో పాటు తెలుగులో భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ తో పాటు రాజేష్ మురుగేషన్ అందించిన పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అక్కినేని జయంతి న విడుదల చేశారు. ఈ పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ చానెల్ లో ఈ సినిమా లో ని 'ఎవరే' పాట ఒక్కదానికే ముప్ఫయి లక్షల పైగా వ్యూస్ రావటం విశేషం. ప్రేమకథా చిత్రాలకు అక్కినేని ఫ్యామిలీ అంటే పెట్టింది పేరు. ఏ మాయ చేసావే తర్వాత నాగచైతన్య కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ లవ్ స్టోరీగా నిలవనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా పాటలను అధికారక యూ ట్యూబ్ చానెల్ తోపాటు ఐ ట్యూన్స్, itunes, saavn,wynk, Eros Now and Hungam ద్వారా వినొచ్చు.. అని ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.
>4. 'జాగ్వార్' సెన్సార్ పూర్తి - విజయదశమి కానుకగా అక్టోబర్ 6 విడుదలమాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్'. హెచ్.డి.కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జాగ్వార్'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
>5. ఒప్పమ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్..!మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. ఈ చిత్రం మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో మూడు వారాల్లోనే 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి... దృశ్యం, ప్రేమమ్ చిత్రాల కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. మలయాళ ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకున్న ఒప్పమ్ కథ ఏమిటంటే....ఈ చిత్రంలో మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించారు. అయితే గుడ్డివాడైన మోహన్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా వర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసిన కిల్లర్ తప్పించుకుంటాడు. అయితే....మర్డర్ చేసిన కిల్లర్ ను గుడ్డివాడైన మోహన్ లాల్ ఎలా పట్టుకున్నాడు అనేది ఒప్పమ్ కథ.
ఇంట్రస్టింగ్ గా ఉన్న ఆ పాయింట్ నచ్చడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొంత మంది నిర్మాతలు ప్రయత్నించారు. అయితే...ఒప్పమ్ చిత్రం తెలుగు డబ్బింగ్ & రీమేక్ రైట్స్ ను ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఓవర్ సీస్ ఎంటర్ టైన్మెంట్ అధినేత బి.దిలిప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ అందిస్తుండడం విశేషం. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల విజయాలతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో ఒప్పమ్ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన మోహన్ లాల్ ఒప్పమ్ తో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే...ఒప్పమ్ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తారా..? లేక రీమేక్ చేస్తారా అనేది త్వరలో తెలియచేయనున్నారు.
>6. అక్టోబర్ 1న వస్తోన్న నాగశౌర్య 'నీ జతలేక'ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్ బ్యానర్‌ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్ సక్సెస్‌ఫుల్ హీరో నాగశౌర్యతో 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మించారు. పారుల్ గులాటి హిరోయిన్‌గా లారెన్స్ దాసరి దర్శకత్వంలో జి.వి. చౌదరి, నాగరాజుగౌడ్ చిర్రా సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆడియో ఆల్‌రెడీ విడుదలై సూపర్‌హిట్ అవడమే కాదు ప్లాటినం డిస్క్‌ను కూడా సాధించింది. అలాగే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా....నిర్మాత జి.వి. చౌదరి మాట్లాడుతూ - ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. కానీ మా చిత్రంలోని ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి కథ స్క్రీన్‌పై రావడం ఇదే ఫస్ట్‌టైమ్. ఈ చిత్రం టైటిల్ కథకి పర్‌ఫెక్ట్ యాప్ట్. ఇప్పటివరకు నాగశౌర్య చేసిన చిత్రాలన్నిం టికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి సీన్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లారెన్స్ దాసరి కథ చెప్పిన దానికంటే సినిమా బాగా తీశాడు. విస్సు కె. కెమెరా వర్క్ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. స్వరాజ్ సంగీతం, శేఖర్ విఖ్యాత్ సంభాషణలు, రఘు మాస్టర్ కొరియో గ్రఫి, లారెన్స్ దాసరి డైరెక్షన్ సినిమాకు హైలైట్స్‌గా నిలు స్తాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తానని పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఫ్యామిలీ ఆడి యన్స్ అందరికీ నచ్చే ప్యూర్ ఫిల్మ్. 175 థియేటర్లుకు పైగా అక్టోబర్ 1న గ్రాండ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం..అన్నారు. మరో నిర్మాత నాగరాజు గౌడ్ చిర్రా మాట్లాడుతూ - ప్రేక్ష కులు ఎంటర్‌టైన్ అయ్యేలా 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మించాం. చాలా స్టైలిష్‌గా వుంటుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ అద్భుతం. ప్రతి సీన్ చాలా ఫ్రెష్‌గా వుంటుంది. నాగ శౌర్య ఈ చిత్రంలో న్యూ లుక్‌లో కనబడతాడు. దాసరి లారెన్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ చిత్రం నాగ శౌర్యకి సూపర్‌హిట్ చిత్రం అవుతుంది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.
>7. అక్టోబర్ 1న అవికాగోర్ 'మాంజ'అవికాగోర్ హీరోయిన్ గా ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్, అనీష్ బజ్మీ, దీప్ పథక్ ఇతర ప్రధాన పాత్రధారులుగా కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం 'మాంజ'. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్లో దర్శకరత్న డా:దాసరి నారాయణరావు సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా డా:దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమాల మీద పడి చిన్ని తెలుగు సినిమాలకు స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను డబ్బింగ్ సినిమా ఫంక్షన్స్ కి రాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి వచ్చానంటే కారణం మాత్రం ఈ సినిమా డైరెక్టర్. 9సం. లకే డైరెక్ట్ చేశాడు. అందుకే అతన్ని ఆశీర్వదించడానికి వచ్చాను. నలుగురు కుర్రాళ్ళ కథే ఈ మాంజ. చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసేటప్పుడు వాడే మంజాను ఈ సినిమాలోని మూలకథకు ఏ విధంగా ఉపయోగించాడు అన్న ఇతివృత్తంగా తీసుకుని సినిమాను చాల అద్భుతంగా తెరకెక్కించాడు. నిజంగా టేకింగ్ మెచ్యూర్డ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టయింది. ఈ మధ్య అవికాగోర్ బాగా పాపులర్ అయింది. మంచి సినిమాలు చేస్తోంది. ఈ సినిమా కూడా తనకి మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది. సినిమాను ప్రమోషన్ చేసి విడుదల చేయడంలో రామసత్యనారాయణ రావు కి చక్కని అనుభవం ఉంది. అలాగే రాజ్ కందుకూరి, రామసత్యనారాయణరావు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం వాళ్లతో పాటు యూనిట్ అందరూ మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు.. చిన్న సినిమా అయినప్పటికీ గురువుగారు దాసరిగారి ఆదరణతో మాలాంటి చిన్న నిర్మాతలు తీసే సినిమాలకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. చక్కని కథాంశంతో మాస్ ఎంటెర్టైనెర్ గా ఈ సినిమా రూపొందిన 'మాంజ' చిత్రాన్ని అక్టోబర్ 1న 65థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం.. అన్నారు.
చిత్రదర్శకుడు కిషన్ ఎస్ ఎస్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎంతో ఎఫర్ట్ పెట్టి చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'మాంజ'. అవికాగోర్ తెలుగులో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా హేమామాలిని తనయ ఇషాడియోల్ రోల్ సినిమాకి హైలైట్. ఆ పాత్రకు జీవం పోశారు. ముగ్గురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి పోలిసులకు దొరికితే 18సం.ల లోపు వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తారనేది ఈ చిత్రంలో చూపించాం. అయితే పోలీసుల బారి నుండి తప్పించుకోవటానికి 'మాంజ'ను ఏ విధంగా వినియోగించారు అనేది చిత్ర కథాంశం. తప్పకుండా మాకందరికి మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది.. అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమాను చిన్నా-పెద్ద అన్న తేడా లేకుండా ప్రమోషన్ చేసి విడుదల చేయాలంటే రామసత్యనారాయణరావు గారికే సాధ్యం. అందుకే ఆయన చేసే ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది. కిషన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. వయసు తక్కువైనా ఏంతో అనుభవం ఉన్నవాడిలా చేసాడు. అతనికి ఈ సినిమా డైరెక్టర్ గా మంచి పేరు తెస్తుంది. టీం అందరూ ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంటారు..అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, ఎన్.శంకర్, గిరిధర్, సాయివెంకట్, పద్మిని, కె.ఆర్.ఫణిరాజ్, కిషన్ ఎస్ ఎస్, దీప్ పథక్, పాటల రచయితలు చల్లా భాగ్యలక్ష్మి, సురేష్ గంగుల, మాటల రచయిత చంద్ర వట్టికూటిలు పాల్గొన్నారు.