Advertisementt

'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' కి డేట్ ఫిక్స్ చేశాడు!

Wed 05th Oct 2016 03:47 PM
gautamiputra satakarni,balakrishna,vijaya dasami,gautamiputra teaser,archana theater  'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' కి డేట్ ఫిక్స్ చేశాడు!
'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' కి డేట్ ఫిక్స్ చేశాడు!
Advertisement
Ads by CJ

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా  కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రానికి సంబంధించి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ‌, వశిష్టిదేవిగా శ్రియాశ‌ర‌న్ ప్రీలుక్స్‌ కు ఇటు నందమూరి అభిమానులు, అటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌య్య ముహుర్తాన్ని నిర్ణ‌యించారు. అక్టోబ‌ర్ 9న శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రాయ‌ల్ లుక్ విడుద‌ల కానుండ‌గా, స‌క‌ల విజ‌యాల‌ను క‌లుగు జేసే విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే అక్టోబ‌ర్ 11 ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ - నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న గౌత‌మిపుత్ర శాత‌కర్ణి సినిమా సినిమాలో నాలగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవల మ‌ధ్య ప్ర‌దేశ్‌లో జ‌రిగిన నాలుగో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో రాజసూయ యాగాన్ని నిర్వహ‌ణ స‌న్నివేశంతో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను, ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ఐదవ షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా టాకీకి సంబంధించి మేజర్ పార్ట్ అంతా పూర్తయ్యింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫ‌స్ట్‌ లుక్‌ను అక్టోబ‌ర్ 9న, టీజ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ గా రిలీజ్ చేస్తున్నాం... అన్నారు.

నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం 900 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్ లో రేపటి నుండి( అక్టోబర్ 5) జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రే హీరో సినిమాల‌కు లేని విధంగా బాల‌కృష్ణ అభిమానులు 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రానికి ఇలా స్వాగ‌తం ప‌లక‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఈ అరుదైన విషయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోనుంది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ న‌టించిన 100 వ సినిమా కోసం ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ