Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (11-10-16)..!

Wed 12th Oct 2016 06:37 PM
pawan kalyan - a.m ratnam movie opening matter,angle movie matter,trivikram production no 1 movie opening matter,allu arjun dj movie,music,settings  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (11-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (11-10-16)..!
Advertisement
Ads by CJ
>పవర్ స్టార్ పవ‌న్ క‌ల్యాణ్, ఎ.ఎం.ర‌త్నం కాంబినేష‌న్‌లో సినిమా ప్రారంభం

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీ సాయిరాం క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 4గా కొత్త చిత్రం విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఫిలింన‌గ‌ర్‌లోని నిర్మాణ సంస్థ కార్యాల‌యంలో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.ర‌త్నం ఈ  చిత్ర స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఐశ్వ‌ర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.ఎం.ర‌త్నం, శ‌ర‌త్ మ‌రార్‌, జ్యోతికృష్ణ‌, ఆర్.టి.నేస‌న్‌, ఎ.ఎం.ర‌త్నం సోద‌రుడు ద‌యాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు. 

>మ్యూజిక్ సిట్టింగ్స్‌లో అల్లుఅర్జున్‌, హ‌రీష్ శంక‌ర్ `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా రూపొందుతున్న చిత్రం డి.జె..దువ్వాడ జగన్నాథమ్. 

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాణ సంస్థ  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ రూపొందుతున్న 25వ సినిమా ఇది. అల్లు అర్జున్‌తో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి గ‌బ్బ‌ర్ సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్‌ను అందించిన హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటు ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జ‌రుగుతున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బ‌న్ని సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడంటేనే అభిమానులు సినిమా మ్యూజికల్ హిట్ అని ఫిక్స‌యిపోతారు.  అందుకు ఉదాహ‌ర‌ణ‌లే అల్లుఅర్జున్ న‌టించిన ఆర్య‌, బ‌న్ని, ఆర్య‌2, జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు కమ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్‌హిట్ కావ‌డ‌మే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మ‌రోసారి బ‌న్ని, దేవి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌టంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తినెల‌కొంది. ఈసారి దేవి ఎలాంటి  మ్యూజిక్ వేవ్స్ క్రియేట్ చేస్తాడోన‌ని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో గ‌మ‌నిస్తున్నారు.  

సినిమా క‌థ‌, క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  స్టార్‌  హీరోను తెర‌పై స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేయ‌డంలో హ‌రీష్ శంక‌ర్ దిట్ట‌. ఈ విష‌యాన్ని  ఆయ‌న గ‌త చిత్రాలే నిరూపించాయి. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్‌తో రూపొంద‌నున్న‌దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ షూటింగ్ అతి త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

>త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన నేO 1సినిమా పూజ  

త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన నేO 1 సినిమా పూజ కార్యక్రమాల ఈ రోజు ఫిలిం నగర్ గుడిలో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రాజేష్, నిర్మాత యస్.త్రివిక్రమ్ మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాలో హీరో పవన్,హీరోయిన్స్ ప్రియ స్వీటీ, బేబీ మోక్ష ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

దర్శకుడు రాజేష్ యడమ మాట్లాడుతూ.

శ్రీహరి సినిమాలకు పని చేశాను, 6 ఇయర్స్ గా దర్శకత్వ శాఖలో ఉన్నాను, ఈ సినిమా నాకు మంచి అవకాశం,ఇదోక ప్రేమకథ ఇప్పటి తరం యువతి యువత ఎలా ఉందో ఎలా ఉండాలో చూపించే చిత్రమిది. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం అమ్మాయి చేయి వదిలి పెట్టకూడదనే అంశాన్ని చెప్పాలి ఈ చిత్రం ద్వార తెలియ చేయాలి .యువత ప్రేమను ప్రపోజ్ చేసుకోవటం ఓకే అయితే శారీరకo గా దగ్గర అవటం లేకుంటే బారు కి వెళ్ళటం ఈ పద్దతి మారాలి అనె అంశాన్ని చూపిస్తున్న సినిమా ఇది.ఈ నెల 15 నుంచి ఏకధాటిగా షూటింగ్ కి చేస్తాం.ఈ సినిమా 3 షెడ్యూల్ లో పూర్తి చేస్తాం.

ఎస్.త్రివిక్రమ్ నిర్మాత మాట్లాడుతూ.

నేను వృత్తి రీత్యా డాక్టర్ ని అయితే సినిమాలంటే చాల ఇష్టం,చాలాకాలంగా సినిమా నిర్మించాలని భావిస్తున్న ఇప్పటికి కుదిరింది.నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిని.ఈ రోజు పవనిజం డే, విజయదశమి మంచి రోజు పూజ కార్యక్రమాలలో తో సినిమా మెదలు పెట్టాం. మంచి కథ యువతరం తెలుసు కోవాలి అనుకుంటున్న విషయాలు అంశాలు చాల ఉన్నాయి. ఇందులో ఓక మెసేజ్ ఉంటుంది. యువతికి. ప్రేమను వ్యక్తీఖరించే విధాలు వేరుగా ఉన్నా . ప్రేమ భావం ఒక్కటే ఇదే మా సినిమా మూలకధ. రెండు షెడ్యూల్స్ లో టాకీ పార్ట్ ఓక షెడ్యూల్ లో పాటలు పూర్తి చేస్తాం. ప్రేమ కుటుంబ కథా చిత్రంగా మీ ముందుకు తీసుకోస్తాo.

>ఒక్క పాట చూసి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సుకుమార్

తొలి చిత్రం విడుదల కాకముందే ఓ కొత్త దర్శకుడు రెండో సినిమాకు సైన్‌ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ దర్శకుల జాబితా ప్రిపేర్‌ చేస్తే చాలా చిన్నగా కూడా ఉంటుంది. అందుకే.. శవరాజ్‌ కనుమూరి అనే కుర్రాడి పేరు పరిశ్రమ వర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.శివరాజ్‌ కనుమూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రూపొందుతున్న జయమ్ము నిశ్చయమ్మురా టీజర్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసిన ప్రముఖ దర్శకులు సుకుమార్‌.. ఓ రంగుల చిలకా అనే ఆ సాంగ్ చూసి చిత్ర దర్శకులు శివరాజ్‌ కనుమూరితో తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమా అనౌన్స్‌ చేయడమే ఇందుకు కారణం.సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై శివరాజ్‌ కనుమూరి దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

శ్రీనివాస్‌రెడ్డి- పూర్ణ జంటగా శివరాజ్‌ ఫిలింస్‌ పతాకంపై..  స్వీయ నిర్మాణంలో శివరాజ్‌ కనుమూరి రూపొందిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా నవంబర్‌లో విడుదల కానుంది. సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్‌లైన్‌తో.. దేశవాళి ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే నినాదంతో సందడి చేస్తున్న ఈ చిత్రం నవంబర్ ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముఖ్యంగా.. ఓ రంగుల చిలకా అనే పాటకు సంగీత ప్రియుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుండడం పట్ల సంగీత దర్శకులు రవిచంద్ర-కార్తీక్ రోడ్రెజ్, లిరిక్ రైటర్ రామాంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు!

 

>నాగఅన్వేష్ ఏంజెల్ దసరా స్పెషల్ పోస్టర్

యంగ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటెల్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకుంది. సోషియో ఫాంటసీ అండ్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ముంబైలో ఈ సినిమా పాటల రికార్డింగ్ ని పూర్తి చేశారు భీమ్స్. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే దసరా సందర్భంగా తెలుగు ప్రేక్షకులకి, మీడియా వారికి శుభకాంక్షలు తెలుపుతూ నిర్మాత భువన్ ఏంజెల్ దసరా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. అలానే ఏంజెల్ యూనిట్ అక్టోబర్ 15 నుంచి పాలకొల్లులో నుంచి దాదాపు 15 రోజులు పాటు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకోనుందని తెలిపారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ