దర్శకుడు భాస్కర్ కు బొమ్మరిల్లు సినిమాతో స్టార్ హోదా వచ్చింది. ఆ తర్వాత ఆయన బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఈ మధ్యనే బొమ్మరిల్లు చిత్రం దశాబ్ద ఉత్సవాలు కూడా జరుపుకుంది. ఈ చిత్రాన్ని గురించి ఓ పదేళ్ళ పాటు అంతా చెప్పుకునేలా చరిత్ర సృష్టించింది. అసలు తెలుగు సినిమా చరిత్రలో బొమ్మరిల్లు తర్వాత బొమ్మరిల్లుకు ముందు అన్న రీతిలో చరిత్రను సృష్టించి సంచలనాలకు దారితీసింది. బొమ్మరిల్లు తర్వాత వచ్చిన పరుగు చిత్రం కూడా బాగానే ఆడిందని చెప్పాలి. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ సినిమా బాగా నిరాశ పరచింది. ఇక ఒంగోలు గిత్త సినిమాతో భాస్కర్ పరవాలేదనిపించుకున్నాడు.
ఆ తర్వాత బెంగళూరు డేస్ అని ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేశాడు. అది బాగా నిరాశ పరచింది. దాంతో బాగా నిరాశ చెందిన దర్శకుడు భాస్కర్ చాలా కాలం నుండి గీతా ఆర్ట్స్ సంస్థ చుట్టూతా స్క్రిఫ్టు పట్టుకొని తిరుగుతున్నాడు. మొత్తానికి ఆ స్క్రిప్టు ఓకే చేసేసుకున్నట్లు తెలుస్తుంది. భాస్కర్ చెప్పిన కథ అల్లు అర్జున్ కి, అల్లు అరవింద్‌కీ బాగా నచ్చిందట. అయితే అది బన్నీ కోసం కాదట. ఓ స్టార్ హీరో కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా నాగచైతన్య లాంటి ఇమేజ్ ఉన్న హీరోలతో ఈ సినిమా చేస్తే బాగుంటుందన్నది అల్లు అరవింద్ ఆలోచన. కాగా అలాంటి హీరో కోసం వేట కొనసాగుతుంది. ఇలాంటి దర్శకుడు, పేరున్న బ్యానర్ కాబట్టి బొమ్మరిల్లు భాస్కర్ దశ తిరుగుతుందన్నమాట.