Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-10-16)..!

Thu 27th Oct 2016 05:27 PM
kashmoraa sencor news,nanna nenu naa boyfriends song launch news,chal chal gurram hero sailesh interview  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (26-10-16)..!
Advertisement
Ads by CJ
>'కాష్మోరా' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌ 28 విడుదల 

కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 28న దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. 

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బ ంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.

>`నాన్న‌, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` రైట్స్‌ను సొంతం చేసుకున్నదిల్‌రాజు

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావ' ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ స‌క్సెస్‌ఫుల్ బ్యానర్ నుండి దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా  ల‌క్కీమీడియా బ్యాన‌ర్‌పై  భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`.  ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా డిజిట‌ల్ పోస్ట‌ర్ ను, ఓ సాంగ్‌ను బుధ‌వారం రేడియో మిర్చిలో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి), ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ బండి, అశ్విన్‌, పార్వ‌తీశం, నోయెల్ సేన్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా....

చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా క‌థ కోసం దాదాపు ఏడాదిగా కసరత్తులు చేశాం. ఇది యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా ద్వారా . ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఈ క‌థ‌ను ముందు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుగారికి వినిపించాం. ఆయ‌న క‌థ విని కొన్ని మార్పులు చేయ‌మ‌ని చెప్పారు. ఆయన చెప్పిన‌ట్టుగానే క‌థ‌లో చేంజ‌స్ చేసి సినిమా తీశాం. ఫ‌స్ట్ కాపీ చూసి దిల్ రాజుగారు సినిమా చాలా బావుంద‌ని అప్రిసియేట్ చేశారు. గ‌తంలో మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన `సినిమా చూపిస్త మావ` సినిమా చూసిన రాజుగారు సినిమా న‌చ్చ‌డంతో నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు `నాన్న‌, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` సినిమా చూసి బాగా న‌చ్చ‌డంతో సినిమాకు సంబంధించిన మొత్తం హ‌క్కుల‌ను మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇలా రాజుగారు కంటెంట్‌పై న‌మ్మ‌కంతో విడుద‌ల చేసిన హ్యాపీడేస్‌, ప‌టాస్ వంటి చిత్రాలు ఘ‌న విజ‌యాల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాన్న‌, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా విష‌యంలో అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త్వ‌ర‌లోనే ఆడియో, సినిమా విడుద‌లకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

>చల్ చల్ గుర్రం హీరో శైలేష్ ఇంటర్వ్యూ

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మించిన చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. శుక్ర‌వారం విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి హీరో శైలేష్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

మా నిర్మాత రాఘ‌వ‌య్య‌గారు జ‌న‌సేన పార్టీలో ట్రెజ‌ర‌ర్‌. జ‌న‌సేన పార్టీ మీటింగ్ ఉంటే నేను మామూలుగా రాఘ‌వ‌య్య‌గారితో వెళ్లి క‌లిశాను. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారితో ప‌ది నిమిషాలు మాట్లాడాను. సినిమా ట్రైల‌ర్‌ని చూపించాం. ఆడియో కొద్దిగా విన్నారు. `కాట‌మ‌రాయుడు` షూటింగ్‌లోనూ వెళ్లి క‌లిశాం. ఆయ‌నకు సినిమా కాస్ట్యూమ్స్ లో స్టిల్ ఇవ్వ‌డం ఇష్టం ఉండ‌దు. అంత బిజీ షెడ్యూల్‌లోనూ డ్ర‌స్ మార్చుకుని వ‌చ్చి ఫోటో ఇచ్చారు. ఈ సినిమాలో నా పేరు మ‌నోహ‌ర్‌. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి కూడా రెండు కంపెనీల్లో ఒకేసారి ప‌నిచేస్తుంటాడు. రెండు కంపెనీలు ఒకే బిల్డింగ్‌లో ఉంటాయి. పైనొక‌టి, కిందొక‌టి.. రెండు చోట్లా గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ రెండు కంపెనీల‌ను త‌ప్పించుకుని ఎలా తిరుగుతాడు? దొర‌క్కుండా ఎలా తిరుగుతాడు? అనేది ఆస‌క్తిక‌రం. చ‌ల్ చ‌ల్ గుర్రం అనేది దాని గురించే పెట్టారు. ముకుంద త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని చేశాను. మా నాన్న‌గారు బిజినెస్ మానేసి నన్నే చూసుకోమ‌న్నారు. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్‌, లాజిస్టిక్స్ షిప్పింగ్ అని ఇంకో బిజినెస్ ఉంది. అది కాకుండా నేను కార్ రేసింగ్‌లో మూడు సార్లు నేష‌న‌ల్ చాంపియ‌న్‌. సో నేను అటూ ఇటూ తిరుగుతుండ‌టంతో సినిమాల్లో కాసింత బ్రేక్ వ‌చ్చిన‌ట్టు అనిపించింది. నేను రేస్‌లో ఉన్న‌ప్పుడు ఒక‌సారి ఏదో టీవీకి ఇంట‌ర్వ్యూ అడిగారు. అది చూసి మా నాన్న‌గారి ఫ్రెండ్ నాకు ట్రెయినింగ్ ఇప్పించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. సో న‌న్ను స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి కెమెరాను ఫేస్ చేయ‌డం నేర్ప‌మ‌న్నారు. అలా విడివిడిగా నేర్ప‌డం కుద‌ర‌ద‌ని, కావాలంటే మూడు నెల‌లు ట్ర‌యినింగ్ ఇస్తాన‌ని చెప్పారు స‌త్యానంద్‌గారు. సో నేను అలా మూడు నెల‌లు శిక్ష‌ణ తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆ మూడు నెల‌లు కూడా వ‌రుస‌గా చేయ‌లేదు. ఎందుకంటే మ‌ధ్య‌లో నా క‌మిట్‌మెంట్స్ ఉండేవి. సో మూడు నెల‌లు కాలం కాస్తా తొమ్మిది నెల‌లు అయింది. అలా నేను ట్ర‌యినింగ్ తీసుకుంటూ ఉండ‌గా మ‌ధ్య‌లో ఒక‌సారి శ్రీకాంత్ అడ్డాల గారు మాస్టార్‌గారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ముకుంద‌లో కేర‌క్ట‌ర్ కోసం ఎవ‌ర‌న్నా ఉన్నారా అని అడిగార‌ట‌. అప్పుడు న‌న్ను పిలిపించారు. న‌చ్చి చేయ‌మ‌న్నారు. ఆ త‌ర్వాత ఈ ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం ఆఫ‌ర్ వ‌చ్చింది. మ‌రోవైపు సినిమాల్లో నెగ‌టివ్ కేర‌క్ట‌ర్ చేయ‌మ‌ని కూడా అడుగుతున్నారు. ఆలోచించి చెప్తాన‌ని అన్నా. నా దృష్టిలో కారు రేసింగ్ చాలా సుల‌భం. న‌ట‌నే క‌ష్టం.అని అన్నారు.

నాగ‌బాబు, బెన‌ర్జీ,ముక్త‌ర్ ఖాన్, ప్ర‌వీణ్‌, సుడిగాలి సుధీర్, చిత్రం శ్రీను,అశోక్ కుమార్

కొరియోగ్ర‌ఫీః ర‌ఘు మాస్ట‌ర్, ప్ర‌దీప్ ఆంటోనీ మాస్ట‌ర్, భాను మాస్ట‌ర్ త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకు ఎడిట‌ర్ః శంక‌ర్, సినిమాటోగ్ర‌ఫీః వి. శ్యామ్ ప్ర‌సాద్, ఆర్ట్ః జె.కె. మూర్తి, సంగీతంః వెంగి, ఫైట్స్ః రామ్ సుంక‌ర, ప్రొడ్యూస‌ర్ః రాఘ‌వయ్య‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః మోహ‌న ప్ర‌సాద్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ