Advertisementt

తెలుగులో కూడా హిట్టు గ్యారెంటీ అంట....!

Wed 02nd Nov 2016 04:14 PM
remo movie,remo audio launch,remo audio matter,dil raju,samantha,keerthi suresh,sivakarthikeyan,anirudh  తెలుగులో కూడా హిట్టు గ్యారెంటీ అంట....!
తెలుగులో కూడా హిట్టు గ్యారెంటీ అంట....!
Advertisement
Ads by CJ
>`రెమో` గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది

                                                                                                                   - ఆడియో ఆవిష్కరణలో దిల్ రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్న చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ చిత్రం `రెమో`ను తెలుగులో అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత‌, దిల్‌రాజు, పి.సి.శ్రీరాం, శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తిసురేష్‌, అనిరుధ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సోనీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అశోక్‌, ర‌చ‌యిత రాజేష్‌, శ‌ర‌ణ్య‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమంత థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

`రెమో` తెలుగులో పెద్ద సక్సెస్ కావాలి

స‌మంత మాట్లాడుతూ - రెమో శివ‌కార్తీకేయ‌న్ చాలా డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఓ స్టార్ హీరో సూప‌ర్ స్టార్ కావ‌డం త‌న‌ను చూసే తెలుసుకున్నాను. అనిరుధ్ రెండు తెలుగు సినిమాలు చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఇప్పుడు నాకెంతో ఇష్ట‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌,త్రివిక్ర‌మ్‌గారి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు. రెమో సినిమా త‌మిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు నిర్మాత‌లు ఈ సినిమాను స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలా విడుద‌ల చేస్తున్నారు.సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు 24ఎ.ఎం.స్టూడియో బ్యానర్లో శివకార్తీకేయన్ గారితో నేను ఓ సినిమా చేయబోతున్నాను అన్నారు.

`రెమో` డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉన్న మూవీ

శివ‌కార్తీకేయ‌న్ మాట్లాడుతూ - త‌మిల్‌లో హిట్ అయిన రెమోను తెలుగులో పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారికి థాంక్స్‌. మా సినిమాకు చాలా మంచి ఫ్లాట్ పాం ఇచ్చారు. పి.సి.శ్రీరాంగారితో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు న‌న్ను అంద‌మైన అమ్మాయిగా మార్చేశాడు. నా నుండి త‌న‌కేం కావాలో ఆ న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడు. కీర్తిసురేష్ నా లేడీ గెట‌ప్ మేట‌ర్‌లో బాగా స‌పోర్ట్ చేశారు. అనిరుధ్ చాలా స‌న్నగా ఉన్నా, అమితాబ్ గారిలా పాజిటివ్ వాయిస్‌ను క‌లిగి ఉంటారు. త‌నెంతో పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తుంటాడు. 24 ఎ.ఎం.స్టూడియోస్ రాజాగారికి థాంక్స్‌. రెమో క‌ల‌ర్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో డిప‌రెంట్ స్టోరీ ఏదీ లేదు. డిఫ‌రెంట్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. తెలుగులో నా తొలి సినిమాలా భావిస్తున్నాను.తెలుగులో న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. సినిమా ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.

గ్యారంటీ హిట్ మూవీ

దిల్‌రాజు మాట్లాడుతూ - ఈ సినిమా త‌మిళంలో స‌క్సెస్ అయిన తీరు, క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న విధానం న‌చ్చ‌డంతో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి ఆస‌క్తి చూపాను. న‌వంబ‌ర్‌లో రెమో తెలుగులో విడుద‌ల కానుంది. త‌మిళంలో స‌క్సెస్ అయిన విధంగానే తెలుగులో కూడా ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను సాధిస్తుంది. శివ‌కార్తీకేయ‌న్‌కు ఈ సినిమా తెలుగులో గుడ్ ఎంట్రీఅవుతుంది. సినిమా చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో ఆ ఫీలింగ్ స‌క్సెస్‌తో రేపు తెలుగులో కూడా నిజ‌మ‌వుతుంది. శివ‌కార్తీకేయ‌న్ రెమో అనే లేడీ గెట‌ప్‌లో అల‌రిస్తుంది. అనిరుధ్ మంచి సంగీతం అందించాడు. శ్రీమ‌ణి చాలా మంచి సాహిత్యాన్ని అందించాడు. నేను శైల‌జ‌, నేను లోక‌ల్ సినిమాల్లో న‌టిస్తున్న కీర్తి సురేష్ రెమో సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను అందుకుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది నాది గ్యారంటీ. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది అన్నారు.

`రెమో` టీం నా ఫ్యామిలీ

పి.సి.శ్రీరాం మాట్లాడుతూ - రెమో టీం నా ఫ్యామిలీగా భావించి సినిమా చేశాను. ఇదొక బ్లెస్డ్ మూవీ. తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

మంచి ఎంటర్ టైనింగ్ మూవీ

కె.ఎస్‌.ర‌వికుమార్ మాట్లాడుతూ - ఒక‌ప్పుడు తెలుగు సినిమా, త‌మిళ సినిమా క‌లిసి మెలిసి ఉండేది. త‌ర్వాత విడిపోయాం. కానీ త‌మిళ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదు. మంచి సినిమాల‌ను ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. చాలా మంది హీరోలు తెలుగులో పెద్ద హీరోల‌య్యారు. అలాగే శివ‌కార్తీకేయ‌న్ తెలుగులో పెద్ద హీరో అవుతాడు. రెమో సినిమాలో మంచి ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంది. అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ భాగ్యరాజ్ క‌న్న‌న్ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. అంద‌రూ సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఎమోషనల్ జర్నీ

అనిరుధ్ మాట్లాడుతూ -  రెమో మూవీ మా యూనిట్‌కు ఎంతో ముఖ్యంగా భావిస్తున్నాం. శివ‌కార్తీకేయ‌న్‌, రాజాగారికి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. రెమో సినిమాకు వ‌ర్క్ చేయ‌డం ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. రాజాగారు మంచి ప్యాష‌నేట్ నిర్మాత‌. దిల్‌రాజుగారు ఇంత మంచి లాంచ్ ఇస్తున్నందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. కీర్తి అవుట్ స్టాండిగ్ జాబ్ చేసింది. సినిమా స‌క్సెస్‌లో కీర్తి న‌ట‌న కీ రోల్ పోషించింది. పి.సి.శ్రీరాం గురించి నేను ప్ర్య‌తేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బ‌కియ రాజ్‌క‌న్న‌న్ చాలా కూల్ ద‌ర్శ‌కుడు. ఓ అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా సినిమాను తెర‌కెక్కించాడు. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. త‌మిళంలో రెమో సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. శివ‌కార్తీకేయ‌న్‌, నేను క‌లిసి చేస్తున్న నాలుగో సినిమా. శివకార్తీకేయ‌న్ చాలా మంచి వ్య‌క్తి. త‌న‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్

కీర్తి సురేష్ మాట్లాడుతూ - నేను శైలజ తర్వాత నా సెకండ్ సినిమా నేను లోక‌ల్‌ను దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు భాగ్యరాజ్ కన్నన్ కొత్త ద‌ర్శ‌కుడిలా కాకుండా సినిమాను చాలా సూప‌ర్బ్‌ గా తెర‌కెక్కించాడు. పి.సి.శ్రీరాం, అనిరుధ్‌, రాజాగారు, కె.ఎస్‌.రవికుమార్‌గారు, శ‌రణ్య‌ గారితో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. శివ‌కార్తీకేయ‌న్‌తో అల్రెడీ ఓ సినిమా చేశాను. ఈ సినిమా శివ‌కార్తీకేయ‌న్‌కు మంచి డెబ్యూ మూవీ అవుతుంద అన్నారు.

ద‌ర్శ‌కుడు భాగ్య రాజ్ క‌న్న‌న్ మాట్లాడుతూ - పి.సి.శ్రీరాంగారితో వ‌ర్క్ చేయాల‌నే క‌ల ఈ సినిమాతో నేర‌వేరింది. అనిరుధ్ హిట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. అలాగే శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తిసురేష్ స‌హా స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ