Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (03-11-16)..!

Fri 04th Nov 2016 03:18 PM
dhruva movie audio matter,kaashmoraa success meet matter,karthi,sahasam swasaga saagipo censor,pizza 2 movie matter  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (03-11-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (03-11-16)..!
Advertisement
Ads by CJ
>న‌వంబ‌ర్ 9న మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ `ధృవ` పాట‌లు విడుద‌ల‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ `ధృవ`  ఈ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇప్పుడు హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు  స‌మాంత‌రంగా సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. సినిమా ఫ‌స్ట్ లుక్ నుండి ఆడియెన్స్‌లో క్రేజ్ నెల‌కొంది. ఈ సినిమాకు హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా న‌వంబ‌ర్ 9న నేరుగా మార్కెట్లోకి విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమా విడుద‌ల‌కు ముందు అభిమానులు, ప్రేక్ష‌కుల న‌డుమ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది. 

 

>కాష్మోరా సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌: కార్తీ 

కార్తీ హీరోగా పి.వి.పి సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన చిత్రం కాష్మోరా. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 28న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. విడుదలైన మొదటివారంలోనే పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించి కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా హీరో కార్తీ పాత్రికేయ మిత్రులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. కార్తీ మాట్లాడుతూ - 

ఉహించలేదు... 

ఆడియెన్స్‌ నుండి ఇంత మంచి రెస్పాన్స్‌ను ఉహించలేదు. సోషియో ఫాంటసీ సినిమా, పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న సినిమా. రెగ్యులర్‌ కాన్సెప్ట్‌ మూవీ కాదు. హర్రర్‌కు కామెడినీ జోడించడంతో ఫస్టాఫ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక సెకండాఫ్‌లో హిస్టారికల్‌ పార్ట్‌, రాజ్‌నాయక్‌ క్యారెక్టర్‌ను ఆడియెన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. రెండున్నరేళ్ల ప్రయాణం. అందులో రాజ్‌నాయక్‌ క్యారెక్టర్‌కు తల లేకుండా ఉండేలా చూపించడం చిన్న విషయం కాదు. కథను ఉహించి చెప్పవచ్చు కానీ స్క్రీన్‌పై చూపంచే టప్పుడు చాలా శ్రమించాం. కానీ ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్‌ చూసి హ్యాపీగా ఉంది. సినిమాను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకుకు థాంక్స్‌. 

కంపేర్‌ చేసుకోలేదు... 

బాహుబలి సినిమాకు కాష్మోరాకు కంపేర్‌ చేసుకోలేదు. బాహుబలి రిలీజ్‌ తర్వాత ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేయడంతో వార్‌ సీక్వెన్స్‌, సెట్స్‌ అన్నీ రీ వర్క్‌ చేసుకున్నాం. 

రెండూ ఇష్టమే... 

కాష్మోరా అనే క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించాం. స్టార్టింగ్‌లో కొంత సీరియస్‌గా ఉండే కాష్మోరా క్యారెక్టర్‌ తర్వాత కామెడితో కూడుకుని ఉండటం, అందరినీ మోసం చేసేలా ఉండటం వల్ల, అలాంటి కాష్మోరా క్యారెక్టర్‌ రాజ్‌నాయక్‌ భవంతిలోకి వెళ్లినప్పుడు బిహేవ్‌ చేసే స్టయిల్‌ హ్యుమర్‌తో కలిసి ఉండాలి. అలాగే రాజ్‌ నాయక్‌ క్యారెక్టర్‌ చేసేటప్పుడు గెటప్‌ చాలా కొత్తగా ఉండాలి, ఎవరూ ఇది కార్తీయే కదా అని వెంటనే గుర్తించకూడదు. ఆ క్యారెక్టర్‌ కాస్ట్యూమ్‌ నలభై కిలోలుంటుంది. దాన్ని వేసుకుని ఒకకవైపు విలనిజాన్ని చూపుతూనే తనెంటో తన హవభావాలతో భయపెట్టాలి. ఈ రెండు క్యారెక్టర్స్‌ చేసేటప్పుడు ఇద్దరం డిస్కస్‌ చేసుకుని ఇంప్రవైజ్‌ చేశాం. దర్శకుడు మూడు క్యారెక్టర్‌ను తెరపై ప్రెజెంట్‌ చేసిన తీరు రియల్లీ సూపర్బ్‌. తనపై నమ్మకంతో ఇలాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ చేయడానికి రెడీ అయిపోయాను. 

ఆన్నయ్య మెచ్చుకున్నారు... 

అన్నయ్య సూర్య ఆడియెన్స్‌ మధ్య సినిమా చూశారు. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో అయితే బాగా నవ్వారు. ఈ మధ్య ఇంత బాగా నవ్వలేదురా అన్నారు. అలాగే సెకండాఫ్‌లో థ్రిల్‌ అయిపోయి సినిమాను చూశారు. సినిమా చూసిన తర్వాత యూనిట్‌ను అప్రిసియేట్‌ చేస్తూ ఓ పెద్ద లెటర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

హైలైట్స్‌... 

సినిమా సక్సెస్‌లో విజువల్‌ గ్రాఫిక్స్‌ కీలకపాత్ర పోషించాయి. కుక్క హీరోను తరమడం, కింగ్‌డమ్‌ రూపొందించిన గ్రాఫిక్స్‌తో పాటు కాస్ట్యూమ్స్‌, ఇలా అన్ని చాలా బావున్నాయని అందరూ అప్రిసియేట్‌ చేశారు. సినిమా ఫస్టాఫ్‌ను ఇరవై రోజుల్లోపే షూట్‌ చేశాం. సెకండాఫ్‌ను షూట్‌ పూర్తి చేయడానికి ఏడాదిన్నర పైగానే పట్టింది. 

బైలింగ్వువల్‌ అంత సులభం కాదు... 

సినిమాను బైలింగ్వువల్‌లో చేయడం అనే మాట చెప్పడం సులభమే కానీ దాన్ని తెరకెక్కించేటప్పుడు చాలా కష్టపడాలి. ముఖ్యంగా డైలాగ్స్‌ విషయంలో మంచి రైటర్స్‌ అవసరం. మంచి రైటర్స్‌ ఉన్నప్పుడు సులభమవుతుంది. రెండింటికి వేరియేషన్స్‌ను కొత్తగా చూపించినప్పుడే చూసే ఆడియెన్స్‌కు ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఉంటుంది. 

విలన్‌గా చేయను... 

పూర్తిస్థాయి విలన్‌గా చేయను. అన్నయ్య హీరో అయితే విలన్‌ చేయడానికి సిద్ధమే. 

తదుపరిచిత్రం... 

మణిరత్నంగారి దర్శకత్వంలో నా నెక్ట్స్‌ సినిమా ఉంటుంది. ఎనిమిది రోజుల చిత్రీకరణ మినహా సినిమా మొత్తం పూర్తయ్యింది. అందులో మిలటరీ ఆఫీసర్‌ రోల్‌ చేస్తున్నాను. మంచి లవ్‌ స్టోరీ. దీని తర్వాత ఓ పోలీస్‌ స్టోరీ చేయబోతున్నాను. 

గోకుల్‌ మాట్లాడుతూ - సినిమా సక్సెస్‌ అవుతుందని భావించాను. కానీ చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాను ఇంత బాగా ఆదరిస్తారని అనుకోలేదు. ఇంత మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్‌. ఈ సక్సెస్‌, ఇంకా మంచి సినిమాలు చేయాలనే బాధ్యతను పెంచింది. మూడు క్యారెక్టర్స్‌ను కార్తీ చాలా అద్భుతంగా పోషించారు. ఇంత మంచి నటుడుతో ఇంకా సినిమాలు చేయాలని భావిస్తున్నాను అన్నారు.

 

>సెన్సార్ పూర్తి చేసుకున్న `సాహ‌సం శ్వాస‌గా సాగిపో`..న‌వంబ‌ర్ 11న వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో లవ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ 'సాహసం శ్వాసగా సాగిపో`. మిర్యాల‌ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఏ మాయ చేసావే త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్‌మీన‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో ఈ చిత్రం ప్రణీత మీడియా ద్వారా ఓవ‌ర్‌సీస్‌లో విడుద‌ల‌వుతుంది. 

 

>డీవీ క్రియేషన్స్, విజయ్‌సేతుపతిల కలయికలో పిజ్జా-2 

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల తెలుగు హక్కులను  ఫ్యాన్సీ రేటుతో దక్కించుకుంటున్న డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్ర హక్కులను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్లతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి నటిస్తున్న తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ  ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రం ఎనిమిద హిట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్ర థ్రియేట్రికల్ ట్రైలర్‌ను విడుదలైన 48 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వీక్షించడం విజయ్‌సేతుపతి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. అతి త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ఇదే నెలలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు. గాయత్రి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ