Advertisementt

టాప్ డైరెక్టర్స్ ను ఆకర్శించిన సాంగ్..!

Sun 13th Nov 2016 12:43 PM
srinivas reddy,poorna,jayammu nischayammu raa movie theartical trailer release tomorrow  టాప్ డైరెక్టర్స్ ను ఆకర్శించిన సాంగ్..!
టాప్ డైరెక్టర్స్ ను ఆకర్శించిన సాంగ్..!
Advertisement
Ads by CJ

ఎప్పుడు ఎలా మొదలైందో పెద్దగా తెలియదు కానీ ఒక పాటతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న మూవీ 'జయమ్ము నిశ్చయమ్మురా'. ఈ మూవీ లో కంటెంట్ ఇండస్ట్రీలోని టాప్ దర్శకులను మెప్పించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి జయమ్ము నిశ్చయమ్మురా అని భరోసా ఇచ్చారు.

కొత్తదనం అనే పదానికి అర్దంలా మారిన సుకుమార్ ‘ఓ రంగుల చిలకా’ అనే సాంగ్ ని రిలీజ్ చేయడమే కాకుండా దర్శకుడు శివరాజ్ కుమార్ అభిరుచి నచ్చి తన బ్యానర్ లో సినిమా చేయమని కోరాడు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు కోరటాల శివ రిలీజ్ చేయబోతున్నాడు.

జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ సక్సెస్ ను అందుకున్న కొరటాల శివ ఈ మూవీ కథను తెలుసుకొని బాగా ఇంప్రెస్ అయ్యాడు. సెన్సార్ నుండి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ పై ఇండస్ట్రీ లో కూడా మంచి ఇంప్రెషన్ ఉంది..ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయకుడి పాత్రలో కనిపిస్తుండగా,పూర్ణ హీరోయిన్ గా నటిస్తుంది. ముఖ్యపాత్రల్లో పోసాని, కృష్ణభగవాన్,జీవ,ప్రవీణ్ మొదలైనవారు కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శివరాజ్ కనుమూరి తన శివరాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న (ఆదివారం) థియేట్రికల్ ట్రైలర్ ను కొరటాల శివ చేతుల మీదుగా రిలీజ్ చేసి 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ