మెగాస్టార్ చిరంజీవి, కాజల్ నాయకానాయికలుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో /`ఖైదీ నంబర్ ౧౫౦/` వ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించిన టీమ్ ఇటీవలే పాటల చిత్రణకు యూరప్ వెళ్లింది. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్ లొకేషన్లలో చిత్రీకరణ చేశారు. తాజాగా టీమ్ ఆ పనులను కూడా పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేసింది.
ఆ రెండు పాటలు మెగాస్టార్ స్టైల్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయని యూనిట్ చెబుతోంది. యంగ్ కొరియోగ్రఫర్స్ శేఖర్, జానీ మాస్టర్ నేతృత్వంలో కంపోజ్ అయిన పాటల్లో మెగాస్టార్ స్టెప్పులు ఫ్యాన్స్ కు కిక్కెంచడం షురూ అని మాష్టర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవితో కలిసి పనిచేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఈ యువ టెక్నిషీయన్స్ ఆనందంతో ఉబ్బితబ్బితున్నారు. మెగాస్టార్ మూవీకు పనిచేయడంతో జీవితానికి ఓ అర్ధం వచ్చిందని జానీ మాష్టర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక తదుపరి మిగిలిన షూటింగ్ పార్టుపై టీమ్ బిజీ కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.