Advertisementt

`భేతాళుడు`బాక్సాఫీస్ హంట్ మొదలైంది..!

Thu 01st Dec 2016 05:29 PM
vijay antony,director prathi krishnamurthy,music director: vijay antony,bethaludu movie,albums: dishum dishum,naan,kadhalil vizhunthen  `భేతాళుడు`బాక్సాఫీస్ హంట్ మొదలైంది..!
`భేతాళుడు`బాక్సాఫీస్ హంట్ మొదలైంది..!
Advertisement
Ads by CJ

`బిచ్చ‌గాడు` అనంతరం విజ‌య్ ఆంటోని న‌టించిన `భేతాళుడు` కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు, అటు కామ‌న్ జ‌నాల్లోనూ అత‌డి సినిమాపై ఒక‌టే క్యూరియాసిటీ. అనుకున్న‌ట్టే భేతాళుడు మూవీ దాదాపు 500 థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజైంది. డిసెంబ‌ర్ 1 రిలీజ్‌కి ముందే `సైతాన్ హంట్స్ ఫ‌ర్ జ‌య‌ల‌క్ష్మి` అంటూ యూనిట్ రిలీజ్ చేసిన వీడియో భేతాళుడిపై మ‌రింత ఆస‌క్తి రేకెత్తించింది.  ఈ వీడియో దాదాపు 10 నిమిషాల నిడివితో ఉంది. భేతాళుడి హంట్ మొద‌లైంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా మ‌రో ప్ర‌భంజ‌నం కాబోతోంది.మార్నింగ్  షోతోనే పాజిటివ్  మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. విజ‌య్ ఆంటోని కెరీర్‌లో ఇది మరొ స్పెష‌ల్ మూవీ అన్నది ఆడియెన్స్ టాక్. ముఖ్యంగా అత‌డి పెర్ఫామెన్స్ ఇరగదీశాడన్న కామెంట్ అందరి నుంచి వినిపించటం విశేషం.

కంటెంటే బ‌లంగా తెర‌కెక్కిన‌ `భేతాళుడు` చిత్రానికి విజ‌య్ ఆంటోని అందించిన రీరికార్డింగ్ ప్ర‌ధాన ఆయుధం. అలాగే ఈ సినిమాలో సినిమాటోగ్ర‌ఫీ సీన్ మూడ్ క్యారీ చేయ‌డంలో ది బెస్ట్ అనిపించింది. ఎంచుకున్న క‌థాంశంలో గ‌మ్మ‌త్త‌యిన మ‌లుపులు ఇంట్రెస్టింగ్‌.  టీజ‌ర్‌ని క‌న్నార్ప‌కుండా ఎలా చూశారో.. థియేట‌ర్ల‌లో ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆద్యంతం కుర్చీ అంచుపై కూచుని అంతే ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. బిచ్చ‌గాడు ఇచ్చిన కిక్కుతో తొలిరోజే బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌లో హ‌వా మొద‌లైంద‌న్న టాక్ వినిపిస్తోంది. క‌రెన్సీ క్రైసిస్‌ని సైతం కొట్టే రేంజు సినిమా ఇదె అన్న టాక్ వ‌చ్చింది. ఇప్పుడు విజ‌య్ ఆంటోని రైజింగ్ స్టార్ ఇన్ టాలీవుడ్‌. కొత్త‌ద‌నం అన్న ప‌దానికి అత‌డు చిరునామా.  కిక్కెక్కించే కథ‌ల‌తో సినిమాలు తీస్తున్న ఒకే ఒక్క హీరో.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ