పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల జంట మరోసారి కనువిందు చేయబోతున్న చిత్రం 'కాటమరాయుడు'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'
'కాటమరాయుడు' చిత్ర బృంధం విజయవంతంగా పొల్లాచ్చిలో షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ 'చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 'గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ 'కాటమరాయుడు'లో మరోసారి కనువిందు చేయబోతోంది. 'పొల్లాచ్చి లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు' అని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. దర్శకుడు కిశోర్ పార్దసాని పవన్ కల్యాణ్ గారితో రెండవ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో 'ఉగాది' కి విడుదల అవుతుంది అన్నారు.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు
నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి
సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు.
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: కిషోర్ పార్ధసాని