Advertisementt

మా కాంబినేష‌న్ బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది..!

Mon 09th Jan 2017 12:52 PM
akkineni nagarjuna,raghavendra rao,om namo venkatesaya movie,anushka,naga chaitanya  మా కాంబినేష‌న్ బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది..!
మా కాంబినేష‌న్ బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది..!
Advertisement
Ads by CJ

`ఓం న‌మో వేంక‌టేశాయ` రాఘ‌వేంద్రరావుగారు, మా కాంబినేష‌న్ బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది - కింగ్ నాగార్జున 

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యం.యం.కీర‌వాణి సంగీతం అందించారు. ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. థియేట్రికల్ ట్రైలర్ ను శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విడుదల చేశారు. ఆడియో సీడీలను అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా....

సౌర‌భ్ జైన్ మాట్లాడుతూ - `అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్రరావుగారికి, నిర్మాత మ‌హేష్ రెడ్డికి, హీరో నాగార్జున‌గారికి థాంక్స్‌. వేంక‌టేశుని పాత్ర‌లో ద‌క్షిణాది ప్ర‌జ‌లు నన్ను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను` అన్నారు. 

విమ‌లారామ‌న్ మాట్లాడుతూ - `ఈ చిత్రంలో ప‌ద్మావ‌తి దేవి పాత్ర‌లో న‌టించాను. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు` అన్నారు. 

ప్ర‌గ్యాజైశ్వాల్ మాట్లాడుతూ - `ఈ చిత్రంలో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుగారు నాకు మంచి పాత్ర ఇచ్చారు. నాగార్జున‌గారితో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. కీర‌వాణిగారి మ్యూజిక్ బాగా న‌చ్చుతుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌` అన్నారు. 

జె.కె.భార‌వి మాట్లాడుతూ - `కృష్ణ‌వంశీగారు చెప్పిన క‌థ న‌చ్చి నిన్నే పెళ్ళాడ‌తా సినిమా చేశారు. అలాగే మ‌ణిర‌త్నం చెప్పిన గీతాంజ‌లి న‌చ్చ‌డంతో దాన్ని ధైర్యం చేసి సినిమా చేశారు. అలాగే మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ అక్కినేని ఫ్యామిలీ అంతా క‌లిసి మ‌నం అనే సినిమా చేశారు నాగార్జున‌గారు. అలాగే నేను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు సినిమాలు చేశారు. అన్న‌మ‌య్య క‌థ విన‌గానే సెన్సేష‌న‌ల్ హిట్ అవుతుంద‌ని అప్పుడే చెప్పారు. ఓం న‌మో వేంక‌టేశాయ క‌థతో వెళ్ళిన‌ప్పుడు ముందు నాగార్జున‌గారు క‌థ విన‌డానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అన్న‌మ‌య్య కంటే వేంక‌టేశ్వ‌ర‌స్వామికి గొప్ప భ‌క్తుడెవ‌రుంటారు. గొప్ప క్లైమాక్స్ అన్న‌మ‌య్య కంటే ఎక్క‌డ ఉంటుంద‌ని అన్నారు. అయితే మా కోరిక మేర క‌థ విన్న రెండో నిమిషంలోనే సినిమా చేస్తున్నామ‌ని అన్నారు. అన్న‌మ‌య్య క్లైమాక్స్ కంటే ఈ సినిమా క్లైమాక్స్ క‌దిలించింది కాబ‌ట్టే ఈ సినిమాను నాగార్జున‌గారు చేశారు. ఆయ‌న చేశారు కాబ‌ట్టే ఈ సినిమా అన్న‌మ‌య్య‌దాటేలా ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించారు. రాఘ‌వేంద్రరావుగారు మహాద్భుతం. ఈ క‌థ‌ను నేను, డైరెక్ట‌ర్‌గారు ప‌ది సంవ‌త్స‌రాలు క‌డుపులో మోశాం. ప‌దేళ్ళుగా ఈ క‌థ త‌యార‌వుతుంది. అనుష్క‌, ప్ర‌గ్యాజైశ్వాల్‌, సౌర‌భ్ జైన్ స‌హా అంద‌రూ సినిమాలో అద్భుతంగా న‌టించారు` అన్నారు. 

అనుష్క మాట్లాడుతూ - `నేను 2004లో నాగార్జునగారితో ముందుగా కలిసింది రాఘవేంద్రరావుగారినే. చాలా గొప్ప దర్శకుడాయన. రాఘవేంద్రరావుగారితో సినిమా చేస్తానని అనుకోలేదు. అది కూడాాధ్యాత్మిక పాత్రలో నాగార్జునగారితో కలిసి నటిస్తానని అనుకోలేదు. రేపు సినిమా చూస్తే నా పాత్ర అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను` అన్నారు. 

యువసామ్రాట్ నాగచైతన్య  మాట్లాడుతూ - `కొన్ని సినిమాలు, కొన్ని కాంబినేషన్స్ గురించి మనం ఎక్కువ‌గా మాట్లాడ‌కూడ‌దు. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడీసాయి ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ‌. మ‌న‌కు ఎప్పుడూ గుండెల్లో గుర్తుండేలా తీశారు. వంద సినిమాలు పూర్త‌యిన రాఘ‌వేంద్రరావుగారికి హ‌ద్దులే లేవు. నాన్న‌గారు ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌ను ప‌ట్టించుకోకుండా ఆయ‌న ఓ ట్రెండ్‌లో వెళ్లిపోతారు. అదొక ట్రెండ్‌లా సెట్ అయిపోతుంది. నాన్న‌గారు న‌టుడిగా నాకు ఇన్‌స్పిరేష‌న్‌. రాఘ‌వేంద్రరావు, కీర‌వాణిగారు స‌హా యూనిట్ అంద‌రికీ అభినంద‌న‌లు` అన్నారు. 

ర‌ఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ - `కీర‌వాణిగారు అద్భుత‌మైన సంగీతాన్నిచ్చారు. నాగార్జున‌గారికి, రాఘ‌వేంద్రరావుగారికి, మ‌హేష్‌రెడ్డిగారికి అభినంద‌నలు` అన్నారు. 

ప్రముఖ నిర్మాత విపి మాట్లాడుతూ - `ఇలాంటి సినిమా నిర్మించాల‌న్నా, డైరెక్ష‌న్ చేయాల‌న్నా, న‌టించాల‌న్నా పూర్వ జ‌న్మ సుకృతం అనాలి. నాగార్జున‌గారికి, రాఘ‌వేంద్రరావు, మ‌హేష్‌రెడ్డికి అభినంద‌నలు. సినిమా గ్రాండ్ స‌క్సెస్ అవుతుంది` అన్నారు. 

హిట్ది చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - `నాగార్జున‌గారు, రాఘ‌వేంద్రరావుగారు, కీర‌వాణిగారు, భార‌విగారు, మ‌హేష్‌రెడ్డి అనే ఐదు మంది మ‌హానుభావులు క‌లిసి చేస్తున్న సినిమా ఇది. వేంక‌టేశుని క‌టాక్షం వల్ల సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్‌` అన్నారు. 

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ - `ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాలో చేసింది చిన్న క్యారెక్ట‌ర్‌. అంద‌రూ లెజెండ్స్ ప‌నిచేసిన సినిమాలో నేను భాగం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఓ సాంగ్‌ను అనుష్క‌తో ఇచ్చారు. నాగార్జున నా మిత్రుడు, త‌న‌తో చిన్న పాత్ర చేయ‌డానికైనా నేను రెడీయే. ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను` అన్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మినిష్ట‌ర్ గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - `కీర‌వాణిగారు చ‌క్క‌టి మ్యూజిక్ అందించారు. గ‌తంలో నాగార్జున న‌టించిన అన్న‌మ‌య్య‌, రామ‌దాసు, శిరిడీ సాయి సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నిర్మాత మ‌హేష్‌గారు మంచిని అంద‌రికీ తెలియ‌జేయాల‌నే కోణంలో సినిమాను నిర్మించారు. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది` అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - `అన్నమయ్య, శ్రీరామదాసు ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాల జ‌ర్నీ చూస్తుంటే రాఘవేంద్రరావు, నాగార్జున‌గారితో తెలుసా మ‌న‌సా ఇది ఏనాటి అనుబంధ‌మో పాట పాడాల‌నిపిస్తుంది. ఏ ప‌ని అయినా విజ‌య‌వంతం కావాలంటే ఒళ్ళు వంచి ప‌నిచేయాలి, కాస్తా బుద్ధి కూడా ఉప‌యోగించాలి. దానికి తోడు దైవ‌బ‌లం, మంత్ర బ‌లం కావాలి. ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌ర్వాత స్వామివారి మంత్రాలు, ఈ సినిమాలోని పాట‌లు, వెనుక నుండి అభిమానుల కేక‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ మూడు మంత్రాల్లాగా విన‌ప‌డ‌తున్నాయి. మిత్రుడు మ‌హేష్ చేసిన ఈ బృహ‌త్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు. 

చిత్ర నిర్మాత ఎ.మ‌హేశ్ రెడ్డి మాట్లాడుతూ - `వేంక‌టేశ్వ‌ర స్వామి మా కుల‌దైవం. ఆయ‌నపై ఈ సినిమా తీసే అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్రరావు, నాగార్జున‌గారు, కీర‌వాణిగారికి ధ‌న్య‌వాదాలు. ఇది మ‌రో అన్న‌మ‌య్య‌.  అన్న‌మ‌య్య కంటే అద్భుతంగా ఉంటుంది. అన్న‌మ‌య్య సినిమా రిలీజైన‌ప్పుడు భ‌క్తులు పెరిగార‌ని తిరుప‌తి దేవ‌స్థానం వారే చెప్ప‌డం జ‌రిగింది. మా న‌మోవేంక‌టేశాయ చిత్రంలో వేంక‌టేశ్వ‌ర స్వామి గురించి, ఆయ‌న‌కు చేసే కొన్ని పూజ‌లు గురించి చెప్పాం. ఈ సినిమా ద్వారా స్వామితో ఓ భ‌క్తుడు ఎలాంటి ఆట ఆడుకుంటాడు, ఏమవుతుంద‌నేదే క‌థ‌. అక్కినేని అభిమానులకు ఇదొక అద్భుత‌మైన సినిమా అవుతుంది. నాగార్జున‌గారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌` అన్నారు. 

దర్శకేంద్రుడు కె..రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - `వేంక‌టేశ్వ‌ర‌స్వామి చాలా కోరిక‌లు తీరుస్తుంటాడు. అలాగే నాకు కూడా స్వామి చాలా కోరిక‌లు తీర్చాడు.  గొప్ప త‌ల్లిదండ్రుల‌నిచ్చాడు. గొప్ప కుటుంబాన్నిచ్చాడు. గొప్ప సినిమాలు చేసే అవ‌కాశం ఇచ్చాడు. అంద‌రి హీరోలతో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చాడు. ఇవ‌న్నీ స్వామి చేసిందే త‌ప్ప, నేను చేసింది కాదు. కొన్ని కొన్ని స్వామి అడ‌గ‌కుండానే ఇచ్చాడు. అన్న‌మ‌య్య సినిమా నేను చ‌స్తాన‌ని అనుకోలేదు. శ్రీరామ‌దాసు సినిమా చేస్తాన‌ని అనుకోలేదు. అంతా స్వామి ద‌య వ‌ల్లే వ‌చ్చింది. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు రెండు భ‌క్తుల క‌థ‌లే. అడ‌క్కుండానే అన్ని ఇచ్చిన స్వామికి ఏం చేయ‌లేద‌నే బాధ ఉండేది. అప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా తీస్తే ఎలా ఉంటుంద‌ని అనుకున్న‌ప్పుడు భార‌విగారు పెద్ద ఫైల్ క‌థ‌తో నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. భ‌గ‌వంతుడుకి, మ‌హాభ‌క్తుడుకి మ‌ధ్య క‌థ‌ను భార‌విగారు అద్భుతంగా చెప్పారు. అలాంటి స‌మ‌యంలోనే దేవుడు సినిమాలే చేస్తాన‌ని అనుకునే మ‌హేశ్ రెడ్డిగారిని నిర్మాత‌గా ఇచ్చారు. ఈ సినిమాలో నాగార్జున అద్భుతంగా న‌టించాడు. దేవుడు క‌న‌ప‌డాలంటే నాగార్జున చూపుల‌తో చూడాల‌నేంత గొప్ప‌గా నటించారు. అలాగే అనుష్క గొప్ప భ‌క్తురాలి పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. అన్నీ కుదిరింది సౌర‌భ్ జైన్‌ను చూసిన త‌ర్వాత యూనిట్ అంద‌రూ అత‌నే వేంక‌టేశ్వ‌రుడు అనేలా చేశారు. కీర‌వాణిగారు అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. కీర‌వాణి లేకుండా ఈ సినిమా చేసేవాడిని కాను. త‌న సంగీత‌మే ఈ సినిమాకు సోల్‌. విక్ర‌మ్‌కుమార్ గౌడ్ కూడా నిర్మాణంలో స‌పోర్ట్‌గా నిలిచారు. అంద‌రూ డ‌బ్బు క‌న్నా భ‌క్తితో చేశారు` అన్నారు. 

కింగ్ నాగార్జున మాట్లాడుతూ - `నాకు ఇష్ట‌మైన వాళ్ళంద‌రితో ఈ సినిమాలో ప‌నిచేశాను. ఈ సినిమాకు ప‌నిచేయడం వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. నాకు ఏ స‌మ‌స్య ఉన్నా నేను ఫోన్ చేసే మొద‌టి వ్య‌క్తి మ‌హేష్ రెడ్డి. త‌ను నాకు మంచి మిత్రుడు. కీర‌వాణిగారి మ్యూజిక్ వింటే చాలు. చ‌క్ర‌వ‌ర్తిగారి దగ్గ‌ర కీర‌వాణిగారు ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుండి నాకు ప‌రిచ‌య‌మే. ఎన్నో అద్భుత‌మైన పాట‌లిచ్చారు. గోపాల్‌రెడ్డిగారు ఎంతో చ‌క్క‌టి సినిమాటోగ్ర‌ఫీతో ఆక‌ట్టుకున్నారు. నేను ప‌నిచేసిన డైరెక్ట‌ర్స్‌లో రాఘవేంద్ర‌రావుగారితోనే ఎక్కువ‌గా ప‌నిచేశాను. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అడుగులేస్తున్న సంద‌ర్భంలో నాకు ఆఖ‌రిపోరాటం అనే సినిమానిచ్చి న‌న్ను నిల‌దొక్కుకునేలా చేశారు రాఘ‌వేంద్రరావుగారు. అక్క‌డి నుండి ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఉంది. అన‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి సినిమాలు తీశారు. ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా చేశారు. ఈ సినిమా చేయ‌డం నా కోసం కాదు. ఈ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేస్తానో లేదో అనుకుని చేశాను. నాన్న‌గారి కోసం మ‌నం పెద్ద హిట్ కావాల‌ని ఎంత బాగా కోరుకునే వాడినో నాకు తెలుసు. చివ‌ర‌కు మ‌నం పెద్ద క్లాసిక్ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది మా కాంబినేష‌న్‌లో బెస్ట్ ఫిలిం అవుతుంద‌నుకుంటున్నాను. భార‌విగారు ఎంతో చ‌క్క‌టి క‌థ‌ను అందించారు. అనుష్క‌, ప్ర‌గ్యా, విమలారామ‌న్, సౌర‌భ్ ఇలా అంద‌రితో బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. నేను చిన్న‌ప్ప్పుడు అమ్మ‌తో తిరుమ‌ల‌కు వెళ్లాను. త‌ర్వాత నా సినిమాలు విడుద‌లైన‌ప్పుడంతా తిరుమ‌ల‌కు వెళ్లేవాడిని. అలా ఆయ‌న‌తో ప‌రిచయం బాగా ఏర్ప‌డింది. వేంక‌టేశ్వ‌ర స్వామిని నేను స్నేహితుడిగానే చూస్తాను. నేను ఎప్పుడు ఆయ‌న గుడికి వెళ్లినా అంద‌రూ బావుండాల‌నే కోరుకుంటాను. అయితే ఆయ‌న్ను ఓ కోరిక కోరుకున్న సంద‌ర్భం అమ్మ విష‌యంలోనే జ‌రిగింది. అమ్మ‌కు ఆరోగ్యం బాగా లేక చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ప్పుడు ఆవిడ అంతా మ‌రిచిపోయింది. న‌న్ను కూడా గుర్తు ప‌ట్టలేదు. నేను బెంగ‌ళూరు వెళ్ళాల్సి వ‌చ్చింది. నేను అమ్మ‌ను తీసుకెళ్లిపో స్వామి అని వేంక‌టేశ్వ‌రునికి మొక్కుకున్నాను. నేను ఫ్లైట్ దిగానో లేదో అమ్మ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింద‌ని ఫోన్ వ‌చ్చింది. అలా అమ్మ బాధ నుండి తీసుకెళ్లిపోయారు. నాన్న‌గారి కోసం చేసిన మ‌నం సినిమా హిట్ కావాలి స్వామి..నేను చేయాల్సిన ప్ర‌య‌త్నం అంతా చేస్తాన‌ని మొక్కు కున్నాను. అది కూడా నాకు ప్ర‌సాదించారు. అలాగే ఇద్ద‌రి అబ్బాయిల‌కు పెళ్ళి కుదిరింది. అలాగే తెలుగువారి అభిమానాన్ని కూడా నాకు ఇచ్చారు. అందుకు వేంక‌టేశ్వ‌రుని థాంక్స్` అన్నారు. 

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః ఎం.ఎం.కీరవాణి, కెమెరాః ఎస్‌.గోపాల్‌రెడ్డి, క‌థః జె.కె.భార‌వి, ఎడిట‌ర్ః గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కె.విక్ర‌మ్ కుమార్, నిర్మాతః ఏ.మ‌హేశ్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః కె.రాఘ‌వేంద్ర‌రావు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ