తమిళనాట నెలకొన్న పరిస్థితుల కారణంగా 'S3-యముడు-3' విడుదల వాయిదా
సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం 'S3-యముడు-3'. ఈ చిత్రానికి హరి దర్శకుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 26 న విడుదల కావలసిన ఈ చిత్రం తమిళనాట నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు బాషల్లో ఈనెల 26 న విడుదల కావలసిన 'S3-యముడు-3' చిత్రం విడుదల వాయిదా వేశాము. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంగా విడుదల చేయటానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం జల్లికట్టు నేపధ్యంలో తమిళనాట కొనసాగుతున్న పరిస్థితుల్ని గమనించి, ఇది విడుదలకి సరియైన సమయం కాదని తలచి ఈ నిర్ణయం తీసుకొవటం జరిగింది. డైరక్టర్ హరి గారు , సూర్య గారి కాంబినేషన్ లో వచ్చే చిత్రం కొసం తమిళ, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అందరికి తెలుసు.. కాని పలు కారణాల వలన ఈ చిత్రం విడుదలని ఏప్పటికప్పడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మా తదుపరి విడుదల తేది ని అతిత్వరలో తెలియజేస్తాం.. అని అన్నారు.