Advertisementt

'గౌతమ్ నంద'గా గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల..!

Sun 05th Feb 2017 12:22 PM
hero gopi chand,heroine hansika,durector sampath nandi,fights ram lakshmans,producers,j bhagavan,j pullarao  'గౌతమ్ నంద'గా గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల..!
'గౌతమ్ నంద'గా గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల..!
Advertisement
Ads by CJ

'గౌతమ్ నంద'గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల..!

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. 'గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. ఈ చిత్రంలో గోపీచంద్ ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశాం. బియర్డ్ లుక్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సంపత్ నంది ఆయన పాత్రను తీర్చిదిద్దన విధానం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను ఫిబ్రవరి 24న హైద్రాబాద్ లో మొదలుకానుంది. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతాం.  మార్చ్ లో పాటల్ని విడుదల చేసి.. ఏప్రిల్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. 

నికితన్ ధీర్, తనికెళ్లభరణి, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ