Advertisementt

ఫైనల్ గా రామ్ చిత్రం అతనికే ఫిక్స్..!

Sat 25th Mar 2017 08:37 PM
hero ram,kishore tirumala,nenu sailaja,sravanthi movies,hero ram new movie details,ugadi  ఫైనల్ గా రామ్ చిత్రం అతనికే ఫిక్స్..!
ఫైనల్ గా రామ్ చిత్రం అతనికే ఫిక్స్..!
Advertisement
Ads by CJ

ఉగాది రోజు ​ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కొత్త చిత్రం ప్రారంభం

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో  స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్  బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు. గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన నేను శైల‌జ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 29న లాంచ‌నంగా ప్రారంభం కానుంది.

నేను శైల‌జ చిత్రాన్ని అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా  సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్  ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ