Advertisementt

సమ్మర్‌ స్పెషల్‌గా... 'వైశాఖం'..!

Tue 28th Mar 2017 08:05 PM
vaisakham movie,ba raju,umesh gupta,b jaya,vaisakham in summer  సమ్మర్‌ స్పెషల్‌గా... 'వైశాఖం'..!
సమ్మర్‌ స్పెషల్‌గా... 'వైశాఖం'..!
Advertisement
Ads by CJ

ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతుల మీదుగా ఈనెల 16న రిలీజ్‌ చేసిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతుల మీదుగా విడుదలైన మా 'వైశాఖం' ఆడియోకి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. 'భానుమతి.. భానుమతి', 'కమాన్‌ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇది యూత్‌కి, మాస్‌కి, ఫ్యామిలీస్‌కి, అందరికీ నచ్చే యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. మా బేనర్‌లో 'వైశాఖం' మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ అవుతుంది.. అన్నారు. 

ఆదిత్య మ్యూజిక్‌ ఉమేష్‌ గుప్తా మాట్లాడుతూ - బి.ఎ.రాజు, జయ గార్ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్‌లీ.. ఇలా అన్ని సినిమాల ఆడియోలు మా ఆదిత్య మ్యూజిక్‌ ద్వారానే రిలీజ్‌ చేశాం. అన్ని సినిమాలు మ్యూజికల్‌గా హిట్‌ అయ్యాయి. వాటన్నింటికంటే 'వైశాఖం' ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను చెయ్యబోతున్నాం.. అన్నారు. 

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ