Advertisementt

'సినీ మహల్' సక్సెస్ కి కారణం ఇదే.!

Thu 06th Apr 2017 04:12 PM
cine mahal,cine mahal movie success meet,lakshman varma,siddhans,reyan rahul  'సినీ మహల్' సక్సెస్ కి కారణం ఇదే.!
'సినీ మహల్' సక్సెస్ కి కారణం ఇదే.!
Advertisement
Ads by CJ

'సినీ మహల్'  సక్సెస్ మీట్

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెర‌కెక్కిన‌ `సినీ మహల్` (`రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక). లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కింది. సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. 

మార్చి 31 న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా పదర్శితమవుతోంది. ఈసందర్బంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా విజయాన్ని మేము నేరుగా ప్రేక్షకుల వద్దకే వెళ్లి చూడ్డం జరిగింది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని జోనర్స్ కలగలసి ఉన్న కథ ఇది. వైవిధ్యంగా ఉంది కనుకనే సినిమా ప్రేక్షకాదరణ పొందుతోందన్నారు.

హీరో సిద్దాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం కథే. సినిమా హాల్ నైపధ్యంలో కథనం నడవటం ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ ను కలిగిస్తోందన్నారు.

మరొ హీరో రేయాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర కు చాలా వేరియెషన్స్ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం కాన్సెప్ట్. దర్శకుడి కధ,కథనం తెరపై దాన్ని ప్రెజెంట్ చెసిన తీరు ప్రెష్ గా ఉంది కనుకనే 'సినీ మహల్' హిట్ అయిందన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఆడియెన్స్ మౌత్ టాక్ సినీమహల్ కు చాలా పాజిటివ్ గా ఉంది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని . సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. 

న‌టీన‌టులు- సాంకేతిక నిపుణులు:

గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన  ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ