విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ 'నక్షత్రం'
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో 'బుట్ట బొమ్మ క్రియేషన్స్' పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు 'విన్ విన్ విన్ క్రియేషన్స్' పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నక్షత్రం'.
'నక్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించనున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. అలాగే చిత్రం టీజర్ విడుదలను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రంలో సుప్రీం హీరో 'సాయిధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 'పోలీస్' అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.
సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్య జైస్వాల్, తులసి, జె.డి.చక్రవర్తి, ప్రకాష్ రాజ్, శివాజీరాజా, రఘుబాబు, తనీష్, ముఖ్తర్ ఖాన్, సాయికిరణ్ ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెర:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్: శివ.వై.ప్రసాద్, కొరియోగ్రఫీ: గణేష్,స్వామి; పోరాటాలు:జాషువా మాస్టర్, జాలి బాస్టియన్, శ్రీధర్; ఆర్ట్: పురుషోత్తం, పబ్లిసిటీ: ఓంకార్ కడియం, స్టిల్స్: మల్లిక్, నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్, సజ్జు,కె.శ్రీనివాసులు, కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ.