Advertisementt

మెగా మల్టీస్టార్ పక్కా అంట..!

Mon 29th May 2017 04:11 PM
mega star chiranjeevi,pawan kalyan,t subbarami reddy,director trivikram,mega multi starrer  మెగా మల్టీస్టార్ పక్కా అంట..!
Chiranjeevi and Pawan Kalyan Combo Film Coming Soon! మెగా మల్టీస్టార్ పక్కా అంట..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ - ప‌వ‌ర్ స్టార్ - త్రివిక్రమ్  కాంబినేష‌న్లో  టి.సుబ్బిరామిరెడ్డి భారీ చిత్రానికి సిద్ధమవుతున్న కథ 

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే చూడాల‌నివుంది అని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీని క‌ళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. ఈ భారీ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారన్న విషయం విదితమే. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న  ఈ చిత్రానికి సంబంధించిన కదను  త్రివిక్రమ్  సిద్హం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్ సమయం లో డా. టి. సుబ్బరామిరెడ్డి   వీరిద్దరినీ కలవటం జరిగింది. ఈ సందర్భంగా  ఈ చిత్రానికి సంబంధించిన కద ను సిద్ధం చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,సుబ్బరామిరెడ్డిలకు చెప్పటం జరిగింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత క‌ళా బంధు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.... మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల ఇమేజ్ లకు ధీటైన, ఉన్నతమైన  కథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారు. మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రిని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఒక్క‌రే డైరెక్ట్ చేయ‌గ‌ల‌ర‌నేది నా న‌మ్మ‌కం. త్వరలోనే ఈ  చిత్రం సెట్స్ పైకి వెళుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు  ప్రస్తుతం వారి వారి చిత్రాలతో  బిజీగా ఉన్నారు. వీరి కమిట్మెంట్స్ పూర్తవగానే ఈ చిత్రం వైభవంగా ప్రారంభ మవు తుందని సుబ్బరామిరెడ్డి తెలిపారు.  గ్రేట్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ తో క‌లిసి ఈచిత్రాన్ని సుబ్బరామిరెడ్డి నిర్మించనున్న విషయం విదితమే. 

Chiranjeevi and Pawan Kalyan Combo Film Coming Soon!:

Subbarami Reddy recently met Pawan Kalyan and Trivikram on the sets of their current movie produced by Haarika Haasine Creations. While chatting up with them, Pawan Kalyan brought the topic of the movie with Subbarami Reddy and enquired the status on story development. Then Trivikram told Pawan Kalyan and T Subbarami Reddy that he is already writing the story for their mega movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ