Advertisementt

'వాడు వస్తాడు' మరీ మీరు వస్తారా..!

Tue 30th May 2017 11:07 PM
vaadu osthadu movie,kick fame shyam,producer 
kv sabarish,hero shyam,heroine sridevi kumar  'వాడు వస్తాడు' మరీ మీరు వస్తారా..!
Vaadu Osthadu Movie Update! 'వాడు వస్తాడు' మరీ మీరు వస్తారా..!
Advertisement
Ads by CJ

అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసుకున్న కిక్ శ్యామ్ చిత్రం "వాడు వస్తాడు"

కిక్ ఫేమ్ శ్యామ్ తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం 'కవియాన్'. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రానికి 'వాడు వస్తాడు' అనే పేరుని ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కెవి శబరీష్ మాట్లాడుతూ 'లాస్ వేగాస్ లోని బిజీ రోడ్ల పై ఒక భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరించడం జరిగింది. ప్రముఖ స్టంట్ మాస్టర్ స్టన్ శివ ఆధ్వర్యంలో హీరో శ్యామ్ పాల్గొనగా ఈ ఫైట్ ని ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాము. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జస్టిన్ వికాజ్ విలన్ గా నటిస్తున్నారు. దర్శకుడు సారథి కి ఇది తొలి సినిమా అయినా విభిన్నమైన కథాంశాన్ని తీసుకున్నారు' అని పేర్కొన్నారు. 

దర్శకుడు సారథి మాట్లాడుతూ 'ఇది నా తొలిచిత్రమే అయినా యూనిట్ సహకారంతో బాగా తీయగలుగుతున్నాను. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో లాస్ వేగాస్ వీధుల్లో కిక్ శ్యామ్ గారి మీద ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాము. చాలా బాగా వచ్చింది. సినిమా హైలైట్స్ లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. కోలీవుడ్, హాలీవుడ్ నుండి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. త్వరలోనే భారీ ఎత్తున ఆడియో వేడుక నిర్వహిస్తాం' అని తెలిపారు. 

శ్రీదేవి కుమార్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మనం కొత్తి పారవై ఫేమ్ ఆత్మీయ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఎన్ ఎస్ రాజేష్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తోన్న ఈ సినిమాకి సంగీతాన్ని శ్యామ్ మోహన్ అందిస్తున్నారు.

Vaadu Osthadu Movie Update!:

Actor Sham's Tami Telugu bilingual film Kaviyaan is nearing completion. K.V Sabarish is producing the movie under the banner 2M cinemas. Director Sarathy has chosen a tough script as his debut film. In Telugu the movie is named as 'Vaadu Osthadu'.The latest news we hear is that Sham had reportedly performed a crucial fight scene under stunt Shiva in the busy roads of las Vegas. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ