Advertisementt

'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్'ఎవరో తెలుసా!

Mon 05th Jun 2017 10:22 PM
nandamuri kalyan ram,kajal aggarwal,director upendra madhavan,mla movie opening  'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్'ఎవరో తెలుసా!
Kalyan Ram and Kajal Aggarwal Combo Movie MLA Opening 'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్'ఎవరో తెలుసా!
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్‌రామ్‌ - కాజల్ అగర్వాల్ ల నూతన చిత్రం 'MLA' ప్రారంభం 

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. 'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్' అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా కనిపించనున్నారు. 

T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణం లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు. 

ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయి బాబా దేవస్థానం లో జరిగింది. హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకులు ఉపేంద్ర మాధవ్, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి కుటుంబ సమేతం గా పాల్గొన్న ఈ కార్యక్రమం యూనిట్ సభ్యుల మధ్య జరిగింది. 

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనయుడు సౌర్యా రామ్ మరియు నిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ ఈ చిత్రానికి క్లాప్ ఇవ్వగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూతురు తారక అద్విత మరియు నిర్మాత M. V. కిరణ్ రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల మీద చిత్రీకరించిన మొదటి షాట్ కు ప్రముఖ రచయిత కోనా వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. 

'ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర రాసుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉంది. జూన్ 9 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చివరి భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం', అని నిర్మాతలు తెలిపారు. 

'టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది', అని దర్శకులు ఉపేంద్ర అన్నారు. 

రవి కిషెన్, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు.  ఇతర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ,  సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి,  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్. 

Kalyan Ram and Kajal Aggarwal Combo Movie MLA Opening:

Nandamuri Kalyan Ram's new film 'MLA' (Manchi Lakshanaalu Unna Abbay) was formally launched recently in Hyderabad. The film is being directed by debutant Upendra Madhav. The very glamorous Kajal Aggarwal will be playing the lead role in the movie along with Kalyan Ram. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ