Advertisementt

అంచనాలకందని బాలయ్య-పూరి ల టైటిల్!

Sat 10th Jun 2017 12:10 PM
paisa vasool,balakrishna,puri jagannadh,bhavya creations,balakrishna film paisa vasool  అంచనాలకందని బాలయ్య-పూరి ల టైటిల్!
Balakrishna's Film Title Paisa Vasool అంచనాలకందని బాలయ్య-పూరి ల టైటిల్!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ -పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ చిత్రం 'పైసా వసూల్'

నందమూరి బాలకృష్ణ, పూరిజగన్నాధ్ ల  గ్రేట్  కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'పైసా వసూల్' అనే టైటిల్  ఖరారు చేసారు. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.  ఈ సంధర్భంగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. 

ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ...'పైసా వసూల్ అనే టైటిల్ ఈ కథ కు యాప్ట్. ఖచ్చితం గా బాలకృష్ణ గారి ఫాన్స్, ఆడియన్స్ ఫుల్ ఖుష్  అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. బాలకృష్ణ గారితో పని చేస్తున్నందుకు  చాలా చాలా హ్యాపీ గా వుంది. ఈ సినిమా లో ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్, యాక్షన్  ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి. ఈ మధ్య కాలం లో బాలకృష్ణ గారు సీరియస్ టైపు రోల్స్ చేస్తున్నారు.  ఇందులో మాత్రం ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. నిజంగా అభిమానులకి పండుగే ఈ సినిమా. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్నియాక్షన్  ఎపిసోడ్స్ లో ఫారిన్ సాంకేతిక నిపుణులు  మరియు ఫైట్ మాస్టర్స్ పని చేసారు'.. అని తెలిపారు.

నిర్మాత వి.  ఆనంద్ ప్రసాద్  మాట్లాడుతూ...'నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చెయ్యగానే విపరీతమయిన అంచనాలు పెరిగిపోయాయి. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. టైటిల్ కి తగ్గట్టుగానే మంచి పైసా వసూల్ సినిమా అవుతుంది. మే 12  నుంచి పోర్చుగల్ లోని లిస్బన్, పోర్టో  సిటీల లో ఇంతవరకు ఎవరు చెయ్యని లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాము. ఈ నెల 16  వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భం గా శనివారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల  నుండి ఫేస్ బుక్  లో లైవ్ ఏర్పాటు చేసాం . బాలకృష్ణ గారు మరియు పూరి జగన్నాధ్ గారు ఈ లైవ్ లో పాల్గొని అభిమానులని ఆనందపరుస్తారు. బాలకృష్ణ గారు పాల్గొనే ఫస్ట్ ఫేస్ బుక్  లైవ్ ఇదే. అలాగే విదేశాల నుంచి ఫేస్ బుక్  లో లైవ్ జరుపుకునే తొలి  తెలుగు సినిమా కూడా ఇదే. భవ్య క్రియేషన్స్ ఫేస్ బుక్  పేజీ లో ఈ లైవ్ ని వీక్షించవచ్చును. బాలకృష్ణ గారి 101వ చిత్రం గా రూపొందుతున్న ఈ చిత్రం లో శ్రేయ, ముస్కాన్, కైరా దత్తు  హీరోయిన్లు గా నటిస్తునారు.. అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.

Balakrishna's Film Title Paisa Vasool:

Natasimham Nandamuri Balakrishna's new film is all set to be a PAISA VASOOL entertainer because the title of the film has been confirmed as 'Paisa Vasool'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ