Advertisementt

ఈవీవీ ని గుర్తుచేసిన మేడమీద అబ్బాయి..!

Sat 10th Jun 2017 08:22 PM
meda meeda abbayi,allari naresh,evv satyanarayana,meda meeda abbayi 1st look  ఈవీవీ ని గుర్తుచేసిన మేడమీద అబ్బాయి..!
Meda Meeda Abbayi 1st Look Released ఈవీవీ ని గుర్తుచేసిన మేడమీద అబ్బాయి..!
Advertisement
Ads by CJ

ఈవీవీ జయంతి సందర్భంగా  మేడమీద అబ్బాయి ఫస్ట్‌లుక్ విడుదల! 

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్  నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను  ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా శనివారం (జూన్ 10న) విడుదల చేశారు.  

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ  నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు.  గమ్యం, శంభో శివ శంభో తర్వాత అలాంటి శక్తివంతమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది.   రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే  నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది. నేడు స్వర్గీయ ఈవీవీ జయంతి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. నరేష్ కేరీర్‌లో మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం వుంది.  బ్యాలెన్స్ పాటను త్వరలోనే పూరిచేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం...అని  తెలిపారు. 

అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ:  శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

Meda Meeda Abbayi 1st Look Released:

Allari Naresh and nikhala vimal Starring Meda Meeda Abbayi Movie First Look Released on the Occacion of Late EVV's Birthday.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ