శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరోవరం. ఈ సినిమా టీజర్ లాంచ్ ..హైదరాబాద్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ లాంచ్ చేసారు. అనంతరం సినిమా న్యూ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీలతతో పాటు. హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
గుంటూరు ఈస్ట్ ఎమ్మేల్లె మహమ్మద్ ముస్తఫా షేక్ మాట్లాడుతూ ... మూవీ మా గుంటూరు నగరం చుట్టుపక్కల తీసి ఎంతో చాకచక్యంగా అంటే నాకు కొత్త కాబట్టి, ఎప్పుడు కప్ప ఏమనుకుoటుoదంటే బావిలో ఉంటే అదే ప్రపంచం అనుకుంటుంది. మరి నేను కూడా కొద్దిగా చూశాను కాబట్టి అదే ప్రపంచం అనుకుంటున్నా..మరి ఈ రోజు ఈ మూవీ విజయవంతం అవ్వాలని చెప్పేసి భగవంతున్ని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
హీరో విశాల్ మాట్లాడుతూ ...మూవీ చాలా బాగోచ్చిందండి, ఫైట్ మాస్టర్ ఇంకా డాన్స్ మాస్టర్... మంచి జాబ్ ని నిర్వర్తించారు...అని అన్నారు.
హీరోయిన్ ప్రియంకశర్మ మాట్లాడుతూ ....ఐ లైక్ యు అండ్ థాంక్యూ.. డైరెక్టర్ సురేష్ గారు యాండ్ ప్రొడ్యూసర్ శ్రీలత గారు ఫర్ గివింగ్ దిస్ ఆపార్చునిటి అండ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ...థాంక్యూ..అని చెప్పారు.
మాల్కపురం శివకుమార్ గారు మాట్లాడుతూ .....ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ..చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.