Advertisementt

కేసిఆర్ కూడా 'ఫిదా'..!

Mon 24th Jul 2017 08:40 PM
fidaa,kcr,sekhar kammula,kcr about fidaa,kcr praises fidaa,dil raju,sai pallavi  కేసిఆర్ కూడా 'ఫిదా'..!
KCR Watches Fidaa Movie కేసిఆర్ కూడా 'ఫిదా'..!
Advertisement
Ads by CJ

ఫిదా టీమ్‌ను అభినందించిన సీఎం కె.సి.ఆర్‌.. మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి 'ఫిదా'

వ‌రుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఫిదా'. జూలై 21న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. యు.ఎస్‌లో ఇప్ప‌టికే 'ఫిదా' మిలియ‌న్ డాల‌ర్స్ క్ల‌బ్‌లోకి చేరింది. స్వతంత్ర భావాలున్న ఓ తెలంగాణ అమ్మాయికి, ఎన్నారై యువ‌కుడి మ‌ధ్య జ‌రిగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌, కుటుంబ ప‌ర‌మైన భావోద్వేగాలు యువ‌త‌, కుటుంబ‌ క‌థా చిత్రాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటున్నాయి. అంద‌రినీ మెప్పిస్తున్న ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్ర‌త్యేకంగా వీక్షించారు. సినిమా చాలా చ‌క్క‌గా ఉంద‌ని, ద‌ర్శ‌కుడు  శేఖ‌ర్ క‌మ్ముల‌, నిర్మాత దిల్‌రాజు సినిమాను అద్భుతంగా రూపొందించారని, న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించార‌ని అప్రిసియేట్ చేసిన కె.సి.ఆర్‌. వీలు చూసుకుని చిత్ర యూనిట్ త‌న‌ను క‌ల‌వాల‌ని ఆహ్వానించారు.

KCR Watches Fidaa Movie:

Telangana CM KCR Praises Fidaa Movie Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ